Thursday, September 2, 2010

ఆర్థిక సంక్షోభాన్ని చైనా ఎలా ఎదుర్కొంటోంది?

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో గూడుకట్టుకున్న అనేక అసమానతలు, సంపద కేంద్రీకరణ, అసమంజస విధానాలు, లక్షణాల పర్యవసానమే నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న ద్రవ్యపెట్టుబడిదారీ సంక్షోభం. పశ్చిమ దేశాలు అనుసరిస్తున్న ఉదారవాద పెట్టుబడిదారీ అభివృద్ధి నమూనాకు ఉన్న పరిమితులను ఈ సంక్షోభం ముందుకు తెస్తోంది. అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడిదారీ సంక్షోభం పూర్వరంగంలో చైనా శాస్త్రీయ అభివృద్ధి దృక్పథాన్ని అనుసరించింది.


2008 చివరి త్రైమాసికం నుండి ప్రపంచం తీవ్రమైన ద్రవ్య సంక్షోభాన్ని చవిచూ స్తోంది. 1930ల నాటి మహా మాంద్యం తర్వాత కాలంలో కనీవినీ ఎరుగని తీవ్ర సంక్షో భం ఇది. ఈ సంక్షోభం నుండి బయట పడి ఆర్థికాభివృద్ధి దిశగా ఎలా నడవాలన్నదే నేడు ప్రపంచ దేశాల ముందున్న ఉమ్మడి కర్తవ్యం.
సంక్షోభం గురించి చైనా కమ్యూనిస్టు పార్టీ, ప్రభుత్వం అవగాహన
తాజా సంక్షోభం మూలాలు అమెరికాలో తలెత్తిన సబ్‌ప్రైమ్‌ సంక్షోభంలోఉన్నాయి. అమెరి కాలో స్థానిక సమస్యగా మొదలైన ఈ సంక్షోభం అనతికాలంలోనే ప్రపంచవ్యాప్తమైంది. అభి వృద్ధి చెందిన దేశాల మొదలు కొత్తగా ఈ కోవలోకి చేరే దేశాల వరకూ, ద్రవ్య ఆర్థిక రంగం మొదలు నిజమైన ఆర్థిక రంగం వరకూ దీని ప్రభావం అనూహ్య స్థాయిలో ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గత కొద్ది కాలంగా ప్రతికూల వృద్ధి, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో స్తబ్దత వంటి తీవ్రమైన సమస్యలతో సతమతమవుతోంది. అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లు తీవ్రమైన ఊపుతాపులకు లోనవు తున్నాయి. అమెరికా, యూరోపియన్‌ దేశాల ద్రవ్య మార్కెట్ల పనితీరు దారుణంగా దిగజా రింది. మార్కెట్లో నిధుల లభ్యత క్షీణించింది. కొత్తగా సంపన్న దేశాల సరసన చేరుతున్న దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల నుండి పెట్టుబడులు పెద్దఎత్తున తరలిపోతున్నాయి. దాంతో ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు అస్తవ్య వస్తమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు రక్షణాత్మక ఆర్థిక విధానాలను పునఃప్రారంభించాయి. దాంతో వాణిజ్యం, పెట్టు బడులు, సాంకేతిక పరిజ్ఞానం విషయంలోయ వివిధ దేశాల మధ్య విపరీతమైన పోటీ పెరిగింది. అనేక దేశాలు ఉమ్మడిగా తీసుకున్న చర్యల నేపథ్యంలో నేడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తిరిగి అభివృద్ధి పట్టాలెక్కే దిశగా నడుస్తోంది. అయితే అంతర్జాతీయ ద్రవ్య సంక్షోభం ఇంకా వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేస్తూనే ఉంది. ఆర్థికవ్యవస్థ ఉన్నపళంగా అభి వృద్ధి మార్గాన నడిచేందుకు పరిస్థితులు అనుకూ లంగా లేవు. సమగ్ర ప్రపంచాభివృద్ధికి చాలా సమయం పడుతుంది. ఇది సంక్లిష్టమైన మార్గం కూడా.
ఈ సంక్షోభాన్ని విశ్లేషిస్తే అమెరికాలో సబ్‌ ప్రైమ్‌ మార్కెట్లో పెద్దఎత్తున దివాళాలు చోటుచేసుకోవటంతో పాటు ద్రవ్య డెరివేటివ్‌ల కారణంగా ఈ సమస్య తలెత్తిందన్న విషయం రుజువవుతోంది. అభివృద్ధి చెందిన దేశాలు అనుసరించిన అసమంజసమైన స్థూల ఆర్థిక విధానాలు, భ్రమాత్మక ఆర్థికం (వర్చ్యువల్‌ ఎకా నమీ) వివిధ రంగాలకు విస్తరించటం, అప్పుపై ఆధారపడిన వినిమయతత్వం దీర్ఘకాలం కొనసాగటం, అసమర్థంగా మారిన ప్రభుత్వ అజమాయిషీ వంటి పరిణామాలు ఈ సంక్షో భానికి ప్రత్యక్ష కారణాలుగా చెప్పవచ్చు. అంత ర్గత కారణాలు పరిశీలించినపుడు సంపూర్ణ స్వేచ్ఛా మార్కెట్‌ విధానంలో ఉన్న లోపాలను ఈ సంక్షోభం ముందుకు తెచ్చింది. అంతేకాదు, ఆర్థిక ప్రపంచీకరణలో ఉన్న లోతైన సంస్థాగత సమస్యలు, అర్థరహితమైన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలోని లోపాలు, ప్రత్యేకించి ద్రవ్య మార్కె ట్‌లో ఉన్న లోపాలను ఈ సంక్షోభం తేటతెల్లం చేస్తోంది. అమెరికాలో మొదలైన సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్తబ్దతలోకి నెట్టింది. ప్రైవేటీకరణ, మార్కెటీకరణ, సరళీకరణ విధా నాలతో కూడిన నయాఉదారవాద సిద్ధాంతాలు, వాటి ఆచరణ వల్ల జరిగిన నష్టాన్ని ఇది వెలుగు లోకి తెస్తోంది.
అంతర్జాతీయ ద్రవ్య సంక్షోభం చైనా ఆర్థిక వ్యవస్థకు కూడా చెప్పలేనన్ని కష్టాలు, సవాళ్లు తెచ్చి పెట్టింది. ఈ సంక్షోభం కారణంగా చైనా ఉత్పత్తులకు అంతర్జాతీయంగా గిరాకీ పడిపో యింది. కొన్ని పరిశ్రమల్లో అదనపు ఉత్పత్తి నిల్వలు పేరుకుపోయాయి. కొనుగోళ్లు తగ్గిపో యాయి. లాభాలు పడిపోయాయి. ఈ ప్రభావం సముద్ర తీర ప్రాంతాల నుండి లోపలికి చొచ్చు కొచ్చింది. చిన్న, మధ్య తరహా పరిశ్రమల నుండి భారీ పరిశ్రమలకు, ఎగుమతి ఆధారిత పరిశ్ర మల నుండి మిగిలిన పారిశ్రామిక రంగానికి సంక్షోభ ప్రభావాలు విస్తరించాయి. నష్టాల బారిన పడిన పరిశ్రమల సంఖ్య పెరిగింది. పెద్ద సంఖ్యలో ఎగుమతి ఆధారిత పరిశ్రమలు తమ కార్యకలాపాలు నిలిపివేసుకోవాల్సి వచ్చింది. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం ప్రబలింది. పెద్దసంఖ్యలో గ్రామీణ ప్రాంతాల నుండి గతంలో వలస వెళ్లిన కార్మికులు తిరిగి గ్రామాలకు చేరుకున్నారు. ఆర్థికాభివృద్ధిపై ఇవన్నీ ప్రతికూల ప్రభావాలు చూపాయి. స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు మందగించి 2009 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం నాటికి 6.1 శాతానికి పడిపోయింది. గత 17 సంవత్స రాల్లో ఇది అత్యంత తక్కువ స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటుగా నమోదైంది. క్లుప్తంగా చెప్పాలంటే ఇది ఈ శతాబ్దంలో చైనా ఆర్థిక వ్యవస్థ ముందు తీవ్రమైన పరిస్థితిని ముందుకు తెచ్చింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇటు చైనా లోపలా, వెలుపలా కొద్ది మంది గత మూడు దశాబ్దాలుగా చైనా సాధిస్తూ వచ్చిన ఆర్థికాభివృద్ధి రేటును కొనసాగించగలదా అన్న విషయంలో సందేహా లకు లోనయ్యారు.
జాతీయంగాను, అంతర్జాతీయంగాను నేడు న్న పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని తాజా సంక్షోభం వల్ల చైనా ఆర్థిక వ్యవస్థ ఏ విధమైన ప్రభావానికి లోనవనుంది అన్న విషయాన్ని చైనా కమ్యూనిస్టు పార్టీ గతితార్కిక పద్ధతిలో విశ్లేషించి కొన్ని అంచనాలకు వచ్చింది:
మొదటిది, (సంక్షోభం ఉన్నప్పటికీ) ఇంకా అభివృద్ధికి అవసరమైన వ్యూహాత్మక అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ప్రపంచం స్థూలంగా శాంతి, సహకారం, అభివృద్ధిలను కోరుకొం టోంది. అందువలన అంతర్జాతీయ సంబంధా లు దీర్ఘకాలం శాంతియుత వాతావరణంలో కొనసాగేందుకు అవకాశాలు ఉన్నాయనీ, ఈ వాతావరణం చైనా ఆర్థికాభివృద్ధికి సంబంధిం చిన సానుకూల పరిస్థితులను కల్పిస్తోందన్నది మొదటి అంచనా. చైనా ఆర్థికాభివృద్ధి సాధించ టానికి కావల్సిన ప్రాథమిక పరిస్థితులు, సాను కూల వాతావరణంలో ఎటువంటి మార్పూ లేదన్నది రెండో అంచనా. గడచిన మూడు దశాబ్దాల్లో సంస్కరణల ద్వారా సాధించిన వేగవంతమైన అభివృద్ధితో చైనాలో శక్తివంతమైన భౌతిక పునాదులు వేశాము. దేశీయంగా వ్యవస్థల పునఃనిర్మాణం లక్ష్యంగా అమలు జరుగుతున్న ఉద్దీపన పథకాలను పరిగణనలోకి తీసుకున్నపుడు వేగవంతమైన పారిశ్రామికీకరణ, పట్టణీకరణ ద్వారా పెద్దఎత్తున గిరాకీ కల్పించ బడుతోంది. అదేవిధంగా పారిశ్రామిక వ్యవస్థ లను ఆధునీకరించటం, తాజాపర్చటం ద్వారా శాస్త్ర సాంకేతిక, పరిశోధనా రంగాల్లో పర్యా వరణ పరిరక్షణా చర్యలు, సామాజిక పథకాల్లో పురోభివృద్ధి వంటి అవసరాలు మౌలికవసతుల రంగానికి భారీ డిమాండ్‌ సృష్టిస్తున్నాయి. దీంతో చైనా ఆర్థికాభివృద్ధి మరికొంత కాలం నిలకడగా, నికరంగా ముందంజ వేసే అవకాశాలు మెండు గా ఉన్నాయి. అంతర్జాతీయ ద్రవ్య సంక్షోభం చైనా ఆర్థికాభివృద్ధి ముందు ఎన్నడూ లేని సవాళ్లు నిలిపినట్లే, మరెన్నడూ లేని అవకాశా లనూ అందిస్తోందన్నది మూడో అంచనా. చైనా ఉత్పత్తులకు అంతర్జాతీయ డిమాండ్‌ తగ్గిపో వటంతో దేశీయంగానే ఈ డిమాండ్‌ను సృష్టిం చాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో ఆర్థిక నిర్మాణాలను సర్దుబాటు అభివృద్ధి ప్రక్రియను మరింత పకడ్బందీగా మార్చాల్సిన అవసరాన్ని ఈ సంక్షోభం ముందుకు తెచ్చింది. సరైన విధానాలు, సమర్థవంతమైన చర్యలు తీసుకుని అందివచ్చిన అవకాశాలను శక్తివంతంగా ఉపయోగించుకొనే మార్గాలు అన్వేషించటం ద్వారా ఈ ప్రతికూల పరిస్థితుల్లో ఈ ఒత్తిళ్లనే చోదకశక్తిగా మార్చి సవాళ్లను అవకాశాలుగా మార్చుకుంటే అంతర్జాతీయ ద్రవ్య సంక్షోభం ప్రభావాన్ని పరిమితం చేసుకునే దిశలో సాగ గలం.
సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు చైనా అనుసరించిన విధానాలు, చేపట్టిన చర్యలు
అంతర్జాతీయ ద్రవ్య సంక్షోభం ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు పార్టీ, ప్రభుత్వం, ''తక్షణమే స్పందించటం, బలమైన నివారణ చర్యలు చేపట్ట టం, ఆచరణాత్మక దృక్ఫథంతో సరైన చర్యలు చేపట్టటం'' అన్న విధానాన్ని అనుసరించింది. నిలకడగా వేగవంతమైన అభివృద్ధి సాధించటం ప్రాధాన్యత గల కర్తవ్యంగానే ఉంది. స్థూల ఆర్థిక విధానాలు అవసరం మేరకు సర్దుబాటు చేసుకోవటం, సరైన, సరళమైన ద్రవ్య చర్యలతో క్రియాశీలకమైన ద్రవ్య విధానాన్ని పాటించటం ఈ కర్తవ్య సాధనలో అంతర్భాగంగా ఉంటాయి. అంతర్జాతీయ ద్రవ్య సంక్షోభం ప్రభావాన్ని అధిగ మించేందుకు ఒక పథకాన్ని సిద్ధం చేసుకున్నాము. నిలకడైన ఆర్థికాభివృద్ధి, ప్రజల జీవన ప్రమా ణాలు పెంచటం, ఆర్థిక రంగంలో మౌలిక సమ స్యలు పరిష్కరించటం, శక్తివంతమైన, వేగంత మైన సామాజిక ఆర్థికాభివృద్ధి సాధించటం అనే లక్ష్యాల నేపథ్యంలో నేడు ఈ పథకాన్ని మరింత మెరుగుపరుస్తున్నాము. అదేసమయంలో తాజా సంక్షోభం నుండి బయటపడేందుకు విశ్వాసం కూడా ఉండాలని భావిస్తున్నాము. అందువల్లనే దేశవ్యాప్తంగా ప్రజలకు చైనా శక్తి సామర్థ్యాలపై విశ్వాసం కల్పించే విధంగా ప్రచారోద్యమం చేపట్టాము. ఉమ్మడి అవగాహన రూపొందించే దిశగా కష్టపడుతున్నాము. ప్రజల నైతిక సామ ర్థ్యం పెంచటం, ప్రజలను, ప్రభుత్వ ఉద్యోగులను సమీకరించటం ద్వారా ఈ సమస్యలను పరిష్క రించటం లక్ష్యంగా ఈ ప్రచారోద్యమం నడుస్తోంది.
1. వినియోగదారుల డిమాండ్‌ పెంచేం దుకు వీలుగా ప్రభుత్వ వ్యయం పెంచుతూ ఆర్థికాభివృద్ధికి అవసరమైన దేశీయ డిమాండ్‌ను విస్తరిస్తున్నాము:
అంతర్జాతీయంగా పారిశ్రామికోత్పత్తులకు మార్కెట్‌ గణనీయంగా పడిపోవటంతో దేశీయ డిమాండ్‌ను విస్తరించటం తక్షణావసరంగా ముందుకొచ్చింది. రానున్న రెండేళ్లలో 4 లక్షలకోట్ల (ట్రిలియన్‌) యువాన్లు వెచ్చించే విధంగా ప్రభుత్వ వ్యయ ప్రణాళిక సిద్ధం చేశాము. ఇందులో 1.8 లక్షలకోట్ల యువాన్లు నేరుగా ప్రభుత్వమే వెచ్చించాలి. ఈ పెట్టుబడు లు ప్రజోపయోగమైన ప్రాజెక్టులను పూర్తి చేయటంలో వినియోగించబడతాయి. ఆర్థిక, సామాజిక అభివృద్ధిలో ఉన్న బలహీనమైన లింకులను బలోపేతం చేయటం ప్రభుత్వ వ్యయం యొక్క లక్ష్యం. దీర్ఘకాల ప్రయోజనాలతో ముడిపడి ఉన్న భారీ మౌలికవసతుల ప్రాజెక్టు లను పూర్తిచేయటానికి ఉపక్రమిస్తున్నాము. ఆర్థికాభివృద్ధి సాధించటంలో ప్రభుత్వేతర పెట్టుబడులకు విస్తృత పాత్ర కల్పించాలన్న ప్రభుత్వ విధానానికి అనుగుణంగా ఈ కాలంలో ప్రైవేటు పెట్టుబడులు ప్రభుత్వ లక్ష్య సాధన దిశలో వెచ్చించే విధంగా చర్యలు చేపడుతు న్నాము. అదేసమయంలో వినియోగదారుల కొనుగోలు సామర్థ్యం పెంచేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నాము. వినిమయ వ్యయం పెంచుతూనే ఇది ఉద్దీపన పథకాల్లో పేర్కొన్న ఆర్థికాభివృద్ధి సాధనతో ముడిపడి ఉండేలా చూసుకుంటున్నాము. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతంలో వినిమయ సామర్థ్యం పెంచటానికి వాహనాలు, ఇతర గృహౌపకరణాలు ప్రభుత్వ సబ్సిడీతో అందచేయటం జరుగుతోంది. ఈ దిశగా గ్రామీణ ప్రాంతంలో దుకాణాలు పెంచటం, రిటైల్‌ స్టోర్స్‌ను ప్రోత్సహించటం ద్వారా విశాలమైన గ్రామీణ ప్రాంత మార్కెట్‌ను వినిమయ డిమాండ్‌ పెంచటానికి అవసరమైన సాధనంగా మల్చుకుంటున్నాము.
2. సంస్థాగత సర్దుబాటు లక్ష్యంతో పారిశ్రామిక పునఃనిర్మాణం, ఉద్దీపన పథకం:
చైనా ప్రభుత్వం ఆర్థికాభివృద్ధి క్రమాన్ని పునఃనిర్మించుకోవటాన్ని లక్ష్యంగా ఎంచుకున్న కాలంలోనే అంతర్జాతీయ ద్రవ్య సంక్షోభం పెచ్చరిల్లింది. సంస్థాగత సర్దుబాటును వేగవం తం చేయటం, పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్స హించటం, పారిశ్రామిక వ్యవస్థలను తాజా పర్చటం వంటివి చైనా ఆర్థికాభివృద్ధి క్రమంలో ఉన్న మౌలిక లోపాలను సరిదిద్దుకోవటంలో ముఖ్యమైన చర్యలుగా ఉంటాయి. ఈ చర్యల ద్వారానే అంతర్జాతీయ ఆర్థిక స్థితిగతుల్లో వచ్చిన మార్పులను తట్టుకోగలుగుతోంది.
జాతీయ ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలిక మన్నిక, నాణ్యతలపై కేంద్రీకరించటం ద్వారా చైనా ప్రభుత్వం ఆటోమొబైల్‌, ఇనుము, ఉక్కు, మౌలిక సాధనాల ఉత్పత్తి రంగం వంటి ఏడు భారీ పరిశ్రమలకు సంబంధించిన రంగాలను పున ర్వ్యవస్థీకరించటం, తాజా పర్చటం లక్ష్యంగా ఉద్దీపన పథకాన్ని అమలు చేస్తోంది. అదే విధంగా నూతన, వ్యూహాత్మక ప్రాధాన్యత గల పరిశ్రమలను అభివృద్ధి చేసేందుకు దశలవారీ చర్యలు చేపట్టింది. వ్యవసాయం వ్యూహాత్మక రంగం. ఎందుకంటే వ్యవసాయ రంగంలో స్థిరమైన అభివృద్ధి సాధించటం ద్వారా సామా జిక సుస్థిరతను సాధించటమే కాదు, ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలపై ప్రజలకు విశ్వాసం కల్పించగలుగుతాము. గ్రామీణ ప్రాంతాలకు, ప్రజలకు, వ్యవసాయానికి సంబం ధించిన కార్యక్రమాలకు ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు కేటాయిస్తోంది. దాంతో పాటు వ్యవసా యరంగానికి ప్రభుత్వ సబ్సిడీలు పెంచుతు న్నాము. వ్యవసాయోత్పత్తుల ధరలపై ప్రతికూల ప్రభావాన్ని తగ్గించేందుకు వ్యవసాయ సబ్సిడీల పరిధిని కూడా విస్తరిస్తున్నాము. తద్వారా వ్యవసాయాన్ని, జాతీయ ఆహార భద్రతను పరిరక్షించే దిశగా చర్యలు చేపడుతున్నాము.
చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై కేంద్రీ కరించి, వాటి ఆర్థిక స్థితిగతులు మెరుగు పర్చేలా, ఈ తరహా పరిశ్రమలు అభివృద్ధి చెందటానికి అవసరమైన వాతావరణాన్ని కల్పిం చేందుకు, ఉత్పత్తి వ్యవస్థలను ఆధునీకరిం చేందుకు వీలుగా 29 రకాలైన విధాన నిర్ణ యాలు తీసుకున్నాము. ఇంధన వనరుల వినియోగాన్ని తగ్గించేందుకు కావల్సిన చర్యలపై శ్రద్ధ కనబరుస్తున్నాము. కలుషిత విసర్జితాలను నియంత్రించేందుకు, పర్యావరణాన్ని పరిరక్షిం చేందుకు, పర్యావరణ మార్పుల కారణంగా తలెత్తుతున్న పరిస్థితులను అధిగమించేందుకు పెద్దఎత్తున ప్రయత్నాలు ప్రారంభించాము. కీలకమైన రంగాల్లో, భౌగోళిక ప్రాంతాల్లో పర్యావరణ కాలుష్యాన్ని అదుపు చేసేందుకు చర్యలు చేపట్టాము. ఆర్థికాభివృద్ధి క్రమంలో పెద్దఎత్తున మార్పు తెచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టమే కాక కేంద్ర ప్రాంతంలో సంస్థాగత మార్పులు తీసుకొచ్చే దిశగా చర్యలు ప్రారంభించాము. పశ్చిమ ప్రాంతంలో భారీ అభివృద్ధి పథకాలకు తెరతీశాము. ఈశాన్య ప్రాంతంలో ఉన్న పారిశ్రామిక సదుపాయాలను ఆధునీకరిస్తున్నాము. ఈ చర్యల ద్వారా వివిధ ప్రాంతాల మధ్య సమాంతర అభివృద్ధి సాధిం చేందుకు కృషి చేస్తున్నాము. ఇక్కడ గుర్తించాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే సాంస్కృతిక రంగం పాత్ర, ప్రాధాన్యతను తాజా సంక్షోభం ముందుకుతెచ్చింది. దీన్ని పరిగణనలోకి తీసు కుని దేశంలో సాంస్కృతిక రంగ పరిశ్రమను ప్రోత్సహించేందుకు ఒక పథకాన్ని రూపొం దించాము. ఈ పథకం కింద నూతన సాంస్కృ తిక రంగ పరిశ్రమలతో పాటు ప్రధాన సాంస్కృ తిక రంగ పరిశ్రమలను కూడా ప్రోత్సహిం చటానికి చర్యలు తీసుకుంటున్నాము.
3. కీలక రంగాల్లో సంస్కరణలు - సంస్క రణలను తీవ్రతరం చేయటం ద్వారా ముందు కొచ్చే శక్తివంతమైన సాధనాల మధ్య అనుసం ధానం:
అంతర్జాతీయ ద్రవ్య సంక్షోభాన్ని అధిగ మించటానికి, నిలకడగా వేగవంతమైన అభివృద్ధి సాధించటానికి సంస్కరణలు అనివార్యం. ఆర్థికా భివృద్ధికి అవసరమైన, దేశీయంగా వినిమ యాన్నిపెంచేందుకు ఉపయోగపడే అనేక సంస్కరణలను ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ సంస్కరణల్లో భాగంగా కీలకమైన రంగాలపై కేంద్రీకరిస్తున్నాము. ఆర్థికాభివృద్ధిలో ఉండే సాదకబాదకాలను పరిష్కరించుకుని ముందుకు వెళ్లటానికి వీలుగా ముఖ్యమైన రంగాల మధ్య అనుసంధానం సాధిస్తున్నాము. ధరల సంస్కర ణలను వేగవంతం చేస్తున్నాము. ప్రత్యేకించి వనరులకు సంబంధించిన ఉత్పత్తుల ధరల విధానాన్ని సంస్కరిస్తున్నాము. కీలకమైన వనరుల విషయంలో మార్కెట్‌ సూత్రం, సరఫరా, గిరాకీసూత్రాలను, వనరుల కొరత, పర్యావరణ నష్టం వంటి ఆర్థిక సూత్రాలు ప్రతిబింబించేలా ధరల విధానంలో వేగవంతమైన మార్పులు తెస్తున్నాము. ప్రభుత్వ ద్రవ్య విధానంలో కూడా పెద్దఎత్తున సంస్కరణలు చేపట్టాము. బడ్జెట్‌ విధి విధానాల్లో మార్పులే కాదు, బడ్జెట్‌ రూపొం దించే ప్రక్రియకు, బడ్జెట్‌ లక్ష్యాల అమలు, పర్యవేక్షణ మధ్య సమతౌల్యం ఉండేలా చర్యలు తీసుకుంటున్నాము. ద్రవ్య విధానాన్ని, బ్యాంకింగ్‌, ఇతర ద్రవ్య పరిశ్రమల అభివృద్ధితో సమాంతరంగా ఉండేలా చూసేందుకు తగిన పద్ధతులు అమలు చేస్తున్నాము. ద్రవ్య సేవలు, ద్రవ్యరంగం, బ్యాంకింగ్‌ రంగం నిర్మాణాలను పటిష్టపర్చే విధంగా ఈ చర్యలు ఉంటాయి. అదేవిధంగా ద్రవ్యరంగంపై అజమాయిషీకి కూడా విధి విధానాలు రూపొందిస్తున్నాము. ఈ పర్యవేక్షణ వినూత్న మార్గాల అన్వేషణకు దోహదం చేసేదిగా ఉంటుంది. ప్రభుత్వరంగ పరిశ్రమల సంస్కరణలను వేగవంతం చేస్తు న్నాము. జాతీయ భద్రత, జాతీయ ఆర్థిక వ్యవస్థలకు ప్రాణవాయువుల్లాంటి కీలకమైన భారీ పరిశ్రమలతో పాటు పౌర సేవల రంగంలో ప్రభుత్వ పెట్టుబడుల కేంద్రీకరణ పెరిగేలా చర్యలు చేపట్టాము. ప్రభుత్వ రంగ పరిశ్రమలను అంతర్జాతీయ పోటీ మార్కెట్‌లో తట్టుకుని నిలవగలిగేలా తీర్చి దిద్దుతున్నాము.
4. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరిశోధ నలు, ప్రయోగాలకు ప్రోత్సాహం:
ద్రవ్య సంక్షోభాన్ని ఎదుర్కోవటంలో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విన్నూత్న పరిశోధనలు కీలకంగా నిలవనున్నాయి. గత అనుభవాన్ని గమనిస్తే ఒక పెద్ద సంక్షోభం తర్వాత శాస్త్ర, సాంకేతిక రంగాల్లో నూతన ఆవిష్కరణలకు తెరతీస్తుందన్న విషయం అర్థమవుతోంది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విప్లవం సాధించిన దేశాలే అభివృద్ధిలో ముందంజలో ఉంటాయని, సంపన్న దేశాలుగా ఎదుగుతాయన్న విషయాన్ని చరిత్ర రుజువు చేస్తోంది. వినూత్న ఆవిష్కరణలను సాధ నంగా మల్చుకుని ఆర్థికాభివృద్ధిని సాధించటానికి స్వయం శక్తి సామర్ధ్యాలపై ఆధారపడి చైనా ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది. శాస్త్ర, సాంకే తిక రంగాల అభివృద్ధికి సంబంధించి జాతీయ మధ్యకాలిక, దీర్ఘకాలిక పథకాన్ని రూపొందిం చాము. ఈ పథకం ద్వారా జాతీయ స్థాయిలో మౌలికవసతుల రంగంలో శాస్త్ర, సాంకేతిక పరిశోధనలు చేపడుతున్నాము. ప్రాథమిక శాస్త్ర విజ్ఞాన రంగంలోనూ, నూతన రంగాల్లోనూ పరిశోధనలకు పెద్దఎత్తున ప్రోత్సాహమిస్తు న్నాము. ఈ దిశగా మేము 16 కీలకమైన ప్రాజెక్టులను ఎంచుకున్నాము. ఇవి అభివృద్ధి క్రమంపై భారీ ప్రభావాన్ని చూపించేవి మాత్ర మే కాదు దీర్ఘకాల ప్రభావాన్ని చూపించగలిగేవి కూడా. అందులో ముఖ్యమైనవి: ఎలక్ట్రానిక్‌ సాధనాల పరిశోధన, అణు ఇంధనాన్ని అభివృద్ధి చేయటం, వినియోగంలోకి తేవటం, డిజిటల్‌ పద్ధతి ద్వారా నియంత్రించే భారీ యంత్ర సామాగ్రి వంటివి ఉన్నాయి. అదేవిధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్ని కీలక రంగాలకూ వర్తింపచేసేలా చర్యలు చేపడుతున్నాము. అత్యు న్నత శ్రేణి సామర్థ్యం కలిగిన శాస్త్ర, సాంకేతిక రంగ పరిశ్రమలను అభివృద్ధి చేస్తున్నాము. ఈ పరిశ్రమల నిర్వహణకు అవసరమైన మేధో సంపత్తి హక్కులు ఆయా పరిశ్రమల చేతుల్లోనే ఉంటాయి. ఆర్థిక రంగంలో కొత్తగా ఎదుగు తున్న శాఖలకు సాంకేతిక పరిజ్ఞానం అందు బాటులోకి తెచ్చేందుకు కావల్సిన చర్యలు చేపడుతున్నాము. తద్వారా వినిమయ రంగం లో కొత్త గిరాకీ సృష్టిస్తున్నాము. స్వతంత్ర పరిశోధనలు చేపట్టటంలో భారీ పరిశ్రమలకు పెద్దపీట వేస్తున్నాము. జీవ ఔషధాలు, మూడో తరానికి చెందిన మొబైల్‌ పరిజ్ఞానం, 3జి, పర్యావరణాన్ని పరిరక్షించే పద్ధతుల్లో ఇంధన వనరులను అభివృద్ధి చేయటం, మోటారువా హనాలు వృద్ధి చేయటం, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తారంగా ఉపయోగించేలా చేయ టంలో ఈ పరిశ్రమల స్వతంత్ర పాత్రకు ప్రాధాన్యత ఇస్తున్నాము.
5. ప్రజల జీవన ప్రమాణాలు పెంచే లక్ష్యంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలను విస్తృత ప్రజానీకానికి అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం:
కష్టాల సమయంలో ప్రజల యోగక్షేమాల గురించి ప్రభుత్వం మరింత శ్రద్ధ వహించాలని ప్రభుత్వం, పార్టీ అభిప్రాయపడుతున్నాయి. ఆర్థిక, సామాజిక అభివృద్ధికి అవసరమైన తక్షణ చర్యలపై ప్రభుత్వం కేంద్రీకరిస్తోంది. ప్రజలకు ప్రయోజన కరంగా ఉండే అనేక చర్యలు చేపడు తున్నాము. ప్రజల జీవితాలతో ముడి పడి ఉన్న తక్షణ సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నాము. మరింత మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అవసరమైన అనేక చర్యలను ప్రభుత్వం చేపట్టింది. ఇందుకు గాను చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఉపాధి కల్పన సామర్థ్యం పెంపొందించేందుకు, ఎక్కువమంది కార్మికులకు పని కల్పించగలిగే పరిశ్రమలు, సేవారంగ పరిశ్రమలను ప్రోత్స హించేందుకు, గ్రామీణ ప్రాంతాల నుండి వలస వచ్చిన వారికి స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, పట్టణ ప్రాంతాల నుండి తిరిగి గ్రామీణ ప్రాంతాలకు వెళ్తున్న కార్మికులకు తగిన ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిం ది. వృద్ధాప్య పింఛన్లు, మౌలిక వైద్య సదుపా యాలు, పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించటానికి అవసరమైన చర్యలు, నిరుద్యోగ భృతి, సహకార రంగంలో వైద్య సదుపాయాలు అందుబాటులోకి తేవటం వంటి రూపాల్లో ప్రభుత్వం సామాజిక భద్రత యంత్రాంగాన్ని పటిష్టం చేస్తోంది. తక్కువ అద్దెకు ఇళ్లు ఇవ్వటానికి వీలుగా గృహనిర్మాణ రంగంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాము. శివారు పట్టణాల్లో, నివాస ప్రాంతాల్లో సౌక ర్యాలు విస్తరిస్తున్నాము. భూకంప పీడిత ప్రాంతా ల్లో శాశ్వత గృహ సముదాయాలు నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నాము. ప్రజల భౌతిక పరిస్థితుల్లో మార్పులు తేవటానికి అవసరమైన చర్యలు చేపట్టటంతో పాటు వారి సాంస్కృతిక హక్కులు, ప్రత్యేకతలు పరిరక్షించే దిశగా కూడా చర్యలు చేపడుతున్నాము. ఈ దిశగా ప్రత్యేకించి ప్రభుత్వం ఆధ్వర్యంలో సాంస్కృతిక సేవలు అందుబాటులోకి తెస్తున్నాము. ప్రజల సాంస్కృతిక విలువలు పెంచటానికి గాను కమ్యూనిటీ ఆధారంగా సాంస్కృతిక కార్యక్ర మాలు చేపడుతున్నాము.
చైనాలో ఆర్థిక ప్రగతి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ద్రవ్య సంక్షోభాలను పరిగణనలోకి తీసుకుని ఈ చర్యలు, విధానాలు చేపడుతున్నాము. ఈ విధానాలన్నింటిలో ముఖ్యమైన లక్షణం ఏమిటంటే ప్రభుత్వ నియంత్రణ, మార్కెట్‌ శక్తుల స్వేచ్ఛ మధ్య, దీర్ఘకాలిక, స్వల్పకాలిక అభివృధ్ధి లక్ష్యాల మధ్య సమతుల్యం సాధిం చటం, విదేశీ గిరాకీని నిలుపుకుంటూ దేశీయ గిరాకీ పెంచటం ముఖ్యమైనవి. మరో విధంగా చెప్పాలంటే అభివృద్ధి, ప్రజా ప్రయోజనాలు, స్థిరత్వం లక్ష్యాల సాధనా క్రమంలో శాస్త్ర, సాంకేతిక అభివృద్ధి, సామరస్యపూర్వకమైన అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను కొనసాగిస్తూ, అవసరమైన చోట్ల వెసులు బాటు కల్పించే విధంగానూ, ప్రభుత్వ ప్రయత్నాలు ఖచ్చితంగా విజయవంతం అయ్యే లా చూడటం, అంతర్జాతీయ ద్రవ్య సంక్షోభం నేపథ్యంలో తలెత్తిన పరిస్థితులను గమనంలోకి తీసుకుని చైనా ఆర్థిక వ్యవస్థలో నిలకడైన అభివృద్ధి సాధించే దిశగానూ ఈ విధానాలు రూపొందించబడ్డాయి.
ఫలితాలు
అంతర్జాతీయ ద్రవ్య సంక్షోభం ప్రభావాన్ని అధిగమించేందుకు, ఆర్థిక సామాజిక అభివృద్ధిని సాధించేందుకు గత సంవత్సర కాలంగా మేము చేస్తున్న ప్రయత్నాలు, అమలు చేస్తున్న విధా నాలు సానుకూల ఫలితాలను చూపిస్తున్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఈ సానుకూల ప్రభావం పెరిగింది. దేశంలో ఆర్థికాభివృద్ధి నిలకడగా కొనసాగేలా చూడటం ద్వారా, అవసరమైన సంస్కరణలు అమలు చేయటం ద్వారా, ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించటం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకునేలా చేయటంలో చైనా ఇతోధికంగా కృషి చేస్తోంది. తద్వారా ఈ కింది ఫలితాలు వచ్చాయి:
1. వృద్ధి రేటు పతనాన్ని నిలువరించ గలిగాము. ఆర్థిక వ్యవస్థ కోలుకొంటోంది:
అంతకు ముందటి సంవత్సరంతో పోలిస్తే 2009 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం లో చైనా 7.7 శాతం వృద్ధి రేటు సాధించింది. పారిశ్రామికాభివృద్ధి, వ్యవసాయరంగ ఉత్పత్తు ల్లో నిలకడైన పురోగతి కనిపిస్తోంది. వేసవి కాలంలో వ్యవసాయోత్పత్తులు వరుసగా ఆరో సంవత్సరం పురోగతి సాధించాయి. నెలలు గడిచే కొద్దీ పారిశ్రామికాభివృద్ధి ఊపందుకొం టోంది. నవంబరు నాటికి భారీ పరిశ్రమల వరకూ గడచిన సంవత్సరం కంటే 19.2 శాతం వృద్ధి రేటు సాధించింది. విదేశీ ఎగుమతులు పడిపోయినప్పటికీ గత నెల్లో కొద్దిగా సాను కూలత కనిపించింది. 2008 నవంబరుతో పోలిస్తే 2009 నవంబరులో మొదటిసారిగా విదేశీ ఎగుమతులు ఆశాజనకంగా మారాయి. గడచిన మే నాటికే ప్రభుత్వ ఆదాయం పూర్వపు స్థాయి దిశగా ప్రయాణం ప్రారంభించింది. 2009 జనవరి-నవంబరు మధ్య కాలంలో జాతీయ ఆదాయం 6.3 లక్షల కోట్ల యువాన్లు దాటింది. అంటే ప్రభుత్వ ఆదాయంలో 9.2 శాతం వృద్ధి రేటు సాధించింది. పారిశ్రామిక వర్గాల విశ్వాస సూచిక, ఉత్పాదక సూచికల్లో మెరుగుదల కనిపించింది. స్థూలంగా చూస్తే 2009 ఆర్థిక సంవత్సరంలో చైనా లక్ష్యంగా ఎంచుకున్న 8 శాతం వార్షిక ఆర్థికాభివృద్ధికి దగ్గరగా ఉందని చెప్పొచ్చు.
2. దేశీయ గిరాకీ పెంచేందుకు తీసుకున్న చర్యలతో వినిమయ వ్యయం క్రమంగా పెరుగు తోంది:
ఈ కాలంలో పెట్టుబడులు పెట్టటంలో గుర్తించదగిన పురోగతి ఉంది. 2009 ఆర్థిక సంవత్సరంలో జనవరి - నవంబరు మధ్య కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో నికర పెట్టుబడులు 16.8 లక్షలకోట్ల (ట్రిలియన్‌) యువాన్లకు చేరాయి. చైనాలో ఇది అత్యధిక స్థాయి. ప్రత్యేకించి మౌలిక వసతుల రంగంలో గడచిన సంవత్సరంతో పోల్చి చూస్తే ఇది 49.4 శాతం పెరుగుదల. ఈ పెట్టుబడులు నూతన దఫా ఆర్థికాభివృద్ధికి అవసరమైన బలమైన పునాదిని వేశాయి. వినిమయ వ్య యాన్ని పెంచేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలతో కొన్ని రంగాల్లో వినిమయ వ్యయంలో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో గృహౌపకరాణాల అమ్మకాలు మొదటి పది నెల్లలోనే 2.787 కోట్ల యూనిట్ల మేరకు జరిగాయి. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి వినిమయ వ్యయం 150 శతకోట్ల (బిలియన్‌) యువాన్లకు చేరే అవకాశం ఉంది. గడచిన సంవత్సరం మొదటి 11 నెలల్లో ఆటో మొబైల్‌ అమ్మకాలు 1.2 కోట్ల యూనిట్లకు చేరుకున్నాయి. దాంతో తొలిసారిగా చైనా ఆటో మొబైల్‌ ఉత్పత్తుల్లో ప్రపంచంలో అగ్రస్థానానికి చేరింది. విదేశీ డిమాండ్‌ తగ్గుతున్న సమయంలో పెరుగుతున్న దేశీయ డిమాండ్‌ ఆర్థిక వ్యవస్థ పుంజుకొనేలా చేయటంలో కీలక పాత్ర పోషి స్తోంది.
3. ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న నాణ్యత:
మౌలిక పరిశ్రమలు, తత్సంబంధిత వస తుల కల్పనలో గణనీయమైన మెరుగుదల కనిపిస్తోంది. అత్యవసరంగా మెరుగుదల సాధించాల్సిన వ్యవసాయం, రైల్వే, రోడ్డు రవాణా, నీటి వనరుల పరిరక్షణ రంగాలకు సంబంధించి కూడా చెప్పుకోదగ్గ మెరుగదల ఉంది. పది కీలక పరిశ్రమలకు సంబంధించిన రంగాలు, ఇనుము ఉక్కు, ఆటోమొబైల్‌, ఓడల నిర్మాణం, నాన్‌ ఫెర్రో ఖనిజాలు, వస్త్ర పరిశ్ర మల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని తాజా పర్చుకునే కర్తవ్యంలో కూడా ముందంజ వేశాము. అధునాత మొబైల్‌ ఫోన్ల ఉత్పత్తి, పరికరాల తయారీ రంగం, సాఫ్ట్‌వేర్‌, బయో మెడిసిన్‌ వంటి రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నాము. ఈ రంగాల్లో సగటు పారిశ్రామిక వృద్ధి రేటును మించి వృద్ధి రేటు సాధిస్తున్నాము. భారీ విద్యుదుత్పత్తి ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభ మైంది. తలసరి విద్యుత్‌ వినియోగం పెరగటం తో పాటు తలసరి కాలుష్యం తగ్గటం కూడా ప్రారంభమైంది. ద్రవ్యసంక్షోభం నీడలు వెన్నాడుతున్నప్పటికీ సాంస్కృతిక రంగ పరిశ్రమ పుంజుకొంటోంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యు న్నత నైపుణ్యం కలిగిన ప్రాజెక్టులు అని చెప్పు కోవటానికి వీలుగా సాంస్కృతిక రంగంలో ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోంది. ఈ ప్రాజెక్టులే అభివృద్ధికి నూతన చిరునామాగా మారను న్నాయి. వివిధ ప్రాంతాల్లో పారిశ్రామికాభివృద్ధి అంతరాలు తగ్గుముఖం పట్టాయి. 2009 ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల్లో తూర్పు ప్రాంతంలో ఆర్థికాభివృద్ధి రేటు కంటే పశ్చిమ, ఉత్తర ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధి రేటు వేగవంతం కావటం దీనికి ఉదాహరణ. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో వస్తున్న మార్పులకు అనుగుణంగా తూర్పు ప్రాంతంలోని పారిశ్రామిక వ్యవస్థ సర్దుబాట్లకు లోనవుతోంది. ఈ క్రమం లోనే పరిశ్రమలను ఆధునీకరించటం, ఉత్పత్తి కార్యక్రమాలను సులభతరం చేయటం, వినూత్న రంగాలవైపు దృష్టి మళ్లించటం, పోటీని తట్టుకుని నిలిచేలా మార్చుకోవటం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
4. పటిష్టమైన ద్రవ్యరంగ నియంత్రణ:
ద్రవ్య నియంత్రణ, సమతుల్య సాధనా యంత్రాంగం పని తీరు మెరుగైంది. బ్యాంకింగ్‌, ద్రవ్య రంగాల్లో రిస్క్‌ను అదుపులోకి తేవటం జరిగింది. బ్యాంకుల్లో నిధుల లభ్యత తగినంత స్థాయిలో ఉంది. వనరుల నాణ్యత మెరుగైంది. రిస్కును తట్టుకునే శక్తి పెరిగింది. దేశంలోని అన్ని ద్రవ్య బ్యాంకింగ్‌ సంస్థల్లోనూ ఆర్‌ఎంబి రుణాల పరిమాణం పెరిగింది. బ్యాంకు ఖతాల్లో పారుబకాయిల వాటా తగ్గింది. కాపిటల్‌ అడెక్వసీ రేటు పెరిగింది. కాపిటల్‌ మార్కెట్‌కు సంబంధించి ప్రాధమిక వ్యవస్థల ఏర్పాటులో మంచి అభివృద్ధి కనిపిస్తోంది. జిఇఎంకు సంబంధించిన మౌలిక వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాము. స్టాక్‌ మార్కెట్‌లో మొదటి దఫా పరిశ్రమల లిస్టింగ్‌ జరిగింది. స్టాక్‌ మార్కెట్‌ లావాదేవీలు పెరిగాయి. జాతీయ ఆర్థికాభివృద్ధి లో నిలకడైన స్టాక్‌ మార్కెట్‌, కాపిటల్‌ మార్కెట్లు చేదోడువాదోడుగా ఉంటున్నాయి.
5. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. సామాజిక సుస్థిరత నెలకొంది:
ప్రజల జీవన ప్రమాణాలు పెంచటానికి చేపట్టిన చర్యలన్నీ సానుకూల ఫలితాలనిస్తున్నా యి. ప్రజల పని పరిస్థితులు, జీవన ప్రమాణా ల్లోనూ ఆరోగ్యకరమైన, నిలకడైన మార్పు కనిపిస్తోంది. ప్రజల ఆదాయాల్లో పెరుగుదల ఉంది. పట్టణ ప్రాంతాల్లో వెచ్చించగలిగిన ఆదాయం గత సంవత్సరంతో పోలిస్తే 10.5 శాతం పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో 2009 మొదటి త్రైమాసం ముగింపునాటికి దీని పెరుగుదల 9.2 శాతంగా ఉంది. గత సంవత్స రం ముగిసే నాటికి పట్టణ ప్రాంతాల్లో కొత్తగా 94 లక్షల ఉద్యోగాలు కల్పించగలిగాము. దాంతో ఉపాధి మార్కెట్‌ పెరుగుదల కూడా మెరుగైన స్థాయిలో ఉంది. సంవత్సరం ముగిసే నాటికి 110 లక్షల ఉద్యోగాలు సృష్టించగలమని అంచనా వేస్తున్నాము. గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు వలస వచ్చిన వారికి, కాలేజీ పట్టభద్రులకు ఉపాధి అవకాశాలు కల్పించటంలో కూడా ప్రగతి సాధించాము. దాంతో స్థూలంగా ఉపాధి కల్పన సామర్థ్యం నిలకడగా, సానుకూలంగా ఉంది. 29.9 శాతం ప్రభుత్వ వ్యయం పెరగటంతో సామాజిక భద్రత అవసరాల కోసం చేసే ఖర్చు పెరిగింది. ఈ రంగాన్ని పటిష్టపర్చుకున్నాము. ఈ వ్యయం తో పట్టణ ప్రాంతాల్లో జీవన ప్రమాణాల వ్యయం 50 శాతం పెరగ్గా, గ్రామీణ ప్రాంతాల్లో 150 శాతం పెరిగింది. రిటైరైన కార్మికులకు చెల్లించే పింఛన్లు మొత్తం పెరిగింది. నివాస ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు కల్పించే ప్రక్రియ ఊపందు కొంది. హెచ్‌1ఎన్‌1 ఫ్లూను నియంత్రించే ప్రయత్నాల్లో కూడా ముందంజ వేశాము.
క్లుప్తంగా చెప్పాలంటే తీవ్రమైన అంతర్జా తీయ ఆర్థిక ద్రవ్య సంక్షోభం నీడన సైతం చైనా ఆర్థికాభివృద్ధి, సామాజిక అభివృద్ధి లక్ష్యాలు సాధించుకోగలిగాము. అంతర్జాతీ మాంద్యం, సంక్లిష్టమవుతున్న జాతీయ అంతర్జాతీయ పరిస్థితుల నడుమ ఈ విజయం సాధించటం పలు సమస్యలతో కూడుకొన్నదే. ఈ విజయాలు ప్రతికూల ఆర్థిక పరిస్థితులను చైనా అధిగమించ టంలో ఎంతగానో సహకరించాయి. అంతే కాదు చైనా ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యవంతంగా పురోగమించటంలో ఆటంకాలు సృష్టిస్తున్న సంస్థాగత, వ్యవస్థాగత అవరోధాలను అధిగ మించటంలోనూ, దీర్ఘకాలం, మరింత మెరుగైన ఆర్థికాభివృద్ధి రేటును సాధించటానికీ అవసరమైన శక్తివంతమైన పునాదులు వేస్తోంది.
అదేసమయంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అనేక అనిశ్చితితో కూడుకున్న పరిస్థితులు ప్రభావితం చేయనున్నాయన్న విషయాన్ని కూడా మేము గమనంలోకి తీసుకున్నాము. దేశీయంగా కూడా చైనా సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కొం టోంది. ఆర్థికాభివృద్ధికి అవసరమైన పునాదులు బలంగా లేవు. అనుకూల, ప్రతికూల ధోరణులు వ్యక్తమవుతూ ఉన్నాయి. దీర్ఘకాలిక, స్వల్పకాలిక సమస్యలు ఒకదాన్ని ఒకటి ప్రభావితం చేస్తున్నాయి. దేశీయ పరిస్థితులు అంతర్జాతీయ పరిస్థితులను, అంతర్జాతీయ పరిస్థితులు దేశీయ పరిస్థితులను ప్రభావితం చేస్తున్నాయి. ఇవన్నీ కలిసి చైనాలో సమానత్వంతో కూడిన ఆర్థికాభి వృద్ధి సాధించాలన్న లక్ష్యాన్ని మరింత క్లిష్టతరం చేస్తున్నాయి. దాంతో ఆర్థిక వ్యవస్థలో చేపట్ట దల్చిన సంస్థాగత సర్దుబాట్లు మరింత కష్టంగా మారాయి.
దేశంలో స్థూల ఆర్థిక నియంత్రణను మరింత మెరుగుపర్చి, బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాము. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు, నిలకడైన, వేగవంత మైన ఆర్థికాభివృద్ధి సాధించేందుకు అవసరమైన చర్యలు, సంస్థాగత సర్దుబాట్లు మధ్య సమతుల్యం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాము. రానున్న కాలంలో క్రియాశీల ద్రవ్య విధానాన్ని అనుస రించనున్నాము. అవసరమైనంత మేర పరపతి విధానంలో సరళత్వాన్ని ప్రదర్శిస్తాము. మేము రూపొందించిన ఆర్థికాభివృద్ధి పథకాన్ని సంపూ ర్ణంగా అమలు చేయనున్నాము. దీనికి అవసర మైనంత మేర ఆర్థిక వ్యవస్థలో సంస్థాగత సర్దుబాట్లు చేపట్టనున్నాము. సంస్కరణలు, ఆర్థిక వ్యవస్థ తలుపులు తెరవటం, స్వతంత్ర పరిశో ధనను ప్రోత్సహించటం వంటి చర్యలు చేపట్టనున్నాము. దీనికి తోడు చైనా ఆర్థికాభివృద్ధి మరింత వేగవంతంగానూ, గతితార్కికంగానూ ఉండేందుకు, సామాజిక సామరస్యతను కాపాడు కునేందుకు అవసరమైన రీతిలో ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించటం, జాతీయ, అంతర్జాతీయ అవసరాలను నెరవేర్చుకొనే విధం గానూ ఆర్థిక విధానాలు అమలు చేయను న్నాము.
నిలకడైన పార్టీ, ప్రభుత్వ నాయకత్వంలో దేశంలోని అన్ని జాతులు, తెగల సంపూర్ణ మద్దతుపై ఆధారపడి చైనా తాను ఎదుర్కొం టున్న ఈ క్లిష్ట పరిస్థితులను అధిగమించటానికి అవసరమైన చర్యలు తీసుకొంటుంది. నిలకడైన, వేగవంతమైన ఆర్థికాభివృద్ధిని శాంతియుత వాతావరణంలో సాధించటానికి కృషి చేస్తోంది.
సంక్షోభాన్ని అధిగమించే క్రమంలో తలెత్తుతున్న ధోరణులు
అంతర్జాతీయ ద్రవ్య సంక్షోభాన్ని అధిగ మించటానికి తీసుకున్న చర్యల నేపథ్యంలో ఆర్థిక, సామాజిక అభివృద్ధికి సంబంధించిన విధి విధానాల విషయంలో మా అవగాహన కూడా మరింత మెరుగైంది. సంక్షోభపు తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తూనే లోతుగా వేళ్లూనుకుపోయి, తాజా సంక్షోభం నేపథ్యంలో వెలుగు చూసిన అనేక సమస్యల విషయంలో ప్రభుత్వం సమగ్రంగా ఆలోచి స్తోంది. తాజా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కునేం దుకు తీసుకుంటున్న చర్యల నడుమ భవిష్యత్తుకు సంబంధించిన విలువైన అంచనాలు మాకు అందాయి. అవి:
1. సంక్షోభ ప్రభావాన్ని ఎదుర్కోవటంలో చైనా లక్షణాలతోగల సోషలిస్టు వ్యవస్థకున్న ప్రత్యేకతలు- అనుభవాలు:
ఒకే లక్ష్యంతో, ఒకే సైద్థాంతిక మార్గదర్శ నంతో, ఒకే పతాకం కింది మనం నడుస్తు న్నాము. ఇదే అన్ని రకాల సాధకబాధకాలను అధిగమించటానికి అవసరమైన ఏకైక మార్గం, ఏకైక సిద్థాంతం. ప్రజాతంత్ర, నాగరిక, సామ రస్య సమాజాన్ని అభివృద్ధి చేయటానికి దోహదం చేసే ఏకైక మార్గం ఇది.
ఏ దేశమైనా ఎదురవుతున్న సవాళ్లను ఇబ్బందులను అధిగమిస్తుందా లేదా అన్న అంశం ఆయా దేశాల ప్రత్యేకతల ఆధారంగా నిర్మితమైన విధి విధానాలను, వ్యవస్థలను సదరు దేశం అనుసరిస్తుందా లేదా అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. 30 ఏళ్ల క్రితం చైనా ప్రారంభించిన సంస్కరణల కారణంగా నేడు చైనా ఆరోగ్యవంతమైన ఆర్థికాభివృద్ధిని సాధించ గలుగుతోంది. ప్రజల జీవన ప్రమాణాలను నిరంతరం మెరుగుపర్చుకోగలుగుతోంది. చైనా ప్రత్యేకతలకు అనుగుణంగా మార్క్సిజం సిద్ధాం తాన్ని అమలు చేసే క్రమంలో గుర్తించిన మార్గమే ఇది.
ఈ మార్గం అనేక సవాళ్లు, ఆటుపోట్లను అధిగమించి నిలిచింది. సరైందని పదే పదే రుజువు చేయబడింది. మేము అనుసరిస్తున్న సామాజిక వ్యవస్థ మిగిలిన వాటికంటే భిన్నమైనది, మెరుగైనదీ అని నిరూపించబడింది. చైనా లక్షణాలతో సోషలిస్టు వ్యవస్థ అన్న అవగాహనలో డెంగ్‌ జియాపింగ్‌ సిద్ధాంతం, కీలకమైన మూడు కోణాలు, శాస్త్రీయమైన అభివృద్ధి దృక్పథం ఇమిడి ఉన్నాయి. ప్రత్యేకించి అంతర్జాతీయంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొం టున్న ఈ తరుణంలో ప్రభుత్వమూ, పార్టీ సరైన సమయంలో స్పందించాయి. సంక్షోభాన్ని అధిగమించేందుకు శాస్త్రీయ విధానాలను అమలు జరపటంతో పాటు అందుకవసరమైన వ్యవస్థలను ఏర్పాటు చేశాయి. పారిశ్రామిక పునర్నిర్మాణం మొదలు ప్రజల జీవన ప్రమా ణాలు మెరుగుపర్చే లక్ష్యంతో ఉద్దీపన పథకాల అమలు, సామాజిక స్థిరత్వం సాధించేందుకు అవసరమైన అభివృద్ధి వ్యూహం ఇమిడి ఉన్నాయి. ఈ విధానాల అమలు ద్వారా దేశవ్యా ప్తంగా ఆర్థికాభివృద్ధి సాధించటానికి, సామాజిక సుస్థిరతకు, ప్రజల సుఖసంతోషాల సాధనకు అవసరమైన రంగం సిద్ధం చేయబడింది.
ఈ క్రమంలో చైనా లక్షణాలతో కూడిన సోషలిజం కీలకమైన లక్ష్యాలను సాధించటానికి అవసరమైన జాతీయ వనరుల సమీకరణలో తన ప్రత్యేకతలను ప్రదర్శించింది. విధాన నిర్ణాయక క్రమంలోనూ, తీసుకున్న నిర్ణయాలను అమలు చేయటంలోనూ, జాతీయ ప్రయోజనా లను అన్ని కోణాల్లో పరిరక్షించటానికి అవసర మైన వెసులుబాటును, సామర్ధ్యాన్ని ప్రదర్శిం చింది. ఈ పరిణామం చైనాలో అభివృద్ధికి మేము ఎంచుకున్న మార్గం చైనా లక్షణాలతో కూడుకుని ఉన్నదన్న విషయాన్ని మరోసారి రుజువు చేసింది. చైనా ప్రభుత్వం అనుసరిస్తున్న సామాజిక వ్యవస్థ చైనా ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా ఉందని రుజువు చేసింది. కేవలం చైనా లక్షణాలతో గల సోషలిజం మాత్రమే చైనాను ఆధునిక అభివృద్ధి పథంలో నడప గలదు. కోట్లాది మంది ప్రజలను ఈ లక్ష్యం దిశగా సమీకరించి సంఘటితపర్చగలదు. తద్వారా వారందరినీ ఒక శక్తిగా రూపొందించ గలదు. సమాజ సర్వతోముఖాభివృద్ధిలో ఈ శక్తిని ప్రయోజనకరంగా ఉపయోగించుకోగలదు. చైనా లక్షణాలతో సోషలిజం అన్న సిద్ధాంతాన్ని అన్ని వేళలా నికరంగా అనుసరిస్తున్నాము. తత్సంబంధిత సైద్ధాంతిక వ్యవస్థను నిస్సం కోచంగా అమలు చేయగలుగుతున్నాము. భవిష్య త్తులో కూడా ఎటువంటి అవాంతరాలు ఎదు రైనా ఈ దారిలోనే ముందుకు సాగనున్నాము.
2. సంక్షోభాన్ని అధిగమించేందుకు తీసుకున్న చర్యలు శాస్త్రీయ అభివృద్ధి దృక్ఫధం అవసరాన్ని రుజువు చేస్తున్నాయి:
ఆరోగ్యవంతమైన ఆర్థిక, సామాజిక అభివృద్ధి సాధనకు, విపత్తు నివారణకు ఏకైక మార్గం శాస్త్రీయ అభివృద్ధి దృక్ఫథంతో కూడిన విధానాలు అమలు చేయటమే. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో గూడుకట్టుకున్న అనేక అసమానతలు, సంపద కేంద్రీకరణ, అసమంజస విధానాలు, లక్షణాల పర్యవసానమే నేడు ప్రపంచం ఎదు ర్కొంటున్న ద్రవ్యపెట్టుబడిదారీ సంక్షోభం. పశ్చిమ దేశాలు అనుసరిస్తున్న ఉదారవాద పెట్టుబడిదారీ అభివృద్ధి నమూనాకు ఉన్న పరిమి తులను ఈ సంక్షోభం ముందుకు తెస్తోంది. అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడిదారీ సంక్షోభం పూర్వరంగంలో చైనా శాస్త్రీయ అభివృద్ధి దృక్పథాన్ని అనుసరించింది. ఇందులో భాగంగా జాతీయ అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలను గమనంలోకి తీసుకోవటం, రోగ లక్షణాలనే కాక మూలాలను కూడా పరిహరించే చర్యలు చేపట్ట టం, దీర్ఘకాలిక, స్వల్పకాలిక అభివృద్ధి లక్ష్యాలను బేరీజు వేసుకోవటం, వాటి మధ్య సమతుల్యం సాధించటం, ప్రజల యోగక్షేమాలకు సంబంధిం చిన సమస్యలకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వటం వంటి చర్యలు చేపట్టింది. మేము అనురిస్తున్న అభివృద్ధి నమూనాను మరింత మెరుగుపర్చు కోవటానికి అంతర్జాతీయ ద్రవ్య సంక్షోభం మరో కొత్త అవకాశం ఇచ్చిందని భావిస్తున్నాము. మా పనిని, ప్రణాళికలను తయారు చేయటంలో అన్ని రకాల అంశాలను పరిగణనలోకి తీసుకుంటు న్నాము. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న మౌలిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూనే మరింత సమగ్ర అభివృద్ధి, సమతుల్యంతో కూడిన అభివృద్ధి, మన్నికైన అభివృద్ధి సాధన దిశగా చర్యలు చేపట్టాము. అంతర్జాతీయ సంక్షోభం ముందుకు తెచ్చిన సవాళ్లను అధిగమిస్తూనే దేశంలో అభివృద్ధికి సంబంధించిన నూతన అవకాశాలపై దృష్టి సారించాము. అభివృద్ధికి నూతన లక్ష్యాలను నిర్దేశించుకొన్నాము. తద్వారా శాస్త్రీయ అభివృద్ధి దృక్పథం గురించి ప్రజలకు మరింత సమగ్ర అవగాహన, అంచనా కలిగిం చేందుకు ఈ అవకాశాన్ని ఉపయోగించు కుంటున్నాము.
మరో రకంగా చెప్పాలంటే తాజా సంక్షో భాన్ని అధిగమించే ప్రయత్నంలో శాస్త్రీయ అభివృద్ధి దృక్పథాన్ని అధ్యయనం చేయటం, అమలు చేయటం అన్న అంశాలు కూడా ఇమిడి ఉన్నాయి. ఈ అనుభవాలు శాస్త్రీయ అభివృద్ధి దృక్పథం ప్రాపంచికదృక్పథమనీ, చైనా అభివృద్ధికి మార్గదర్శకత్వం వహించే పనివిధానమనీ, అంతర్జాతీయ సంక్షోభాన్ని అధిగమించటానికి అనుసరించే మౌలిక వ్యూహంతోపాటు ఇది చైనా ఆర్థిక సామాజిక అభివృద్ధి సాధన మార్గ మన్న విషయాన్ని మేము గుర్తించాము. సంస్క రణలను బలోపేతం చేసి మరింత వేగంగా అభివృద్ధిపథంలో నడిచే దిశగా మేము మరింత సమర్థవంతంగా శాస్త్రీయ అభివృద్ధి దృక్పథాన్ని అమలు చేయనున్నాము.
3. బాధ్యతాయుతమైన దేశంగా చైనాకు పెరిగిన ప్రతిష్ట:
అందరికీ అభివృద్ధి ఫలాలు అందుబాటు లోకి తేవటం, శాంతియుతమైన, సామరస్య పూర్వకమైన అభివృద్ధి సాధనే అన్ని రకాల సవాళ్లను అధిగమించే మార్గం.
ప్రపంచ దేశాలు గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి. మిగిలిన ప్రపంచాన్ని పక్కన పెట్టి ఏ ఒక్క దేశమూ తనకు తాను అభివృద్ధి చెందలేదు. అంతర్జాతీయ సవాళ్ల నడుమ ఏ దేశమూ తన అంతర్గత సమస్యలను ఒక్కటే పరిష్కరించు కోలేదు. అంతర్జాతీయ సంక్షోభం నేపథ్యంలో వందకోట్లకుపైగా ఉన్న చైనా ప్రజానీకం ఆర్థికావసరాలుతీర్చగల రీతిలో చైనా ఆర్థిక వ్యవస్థను తీర్చి దిద్దటమే చైనా ప్రపంచానికి చేసే సహాయం అని పార్టీ, ప్రభుత్వం భావి స్తున్నాయి. అదే సమయంలో ఈ సంక్షోభాన్ని అధిగమించటానికి ప్రపంచ దేశాలు సమైక్యంగా వ్యవహరించాలని కూడా చైనా పిలుపునిచ్చింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకోవటానికి అవసరమైన విధి విధానాలు రూపొందించటం లోనూ, సంక్షోభాన్ని అధిగమించటానికి అవసరమైన చర్యలు చేపట్టటంలోనూ అంతర్జా తీయ సమాజంతో చైనా సహకరించింది. అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్థలో అవసరమైన మార్పుల దిశగా చర్యలు తీసుకునేలా చేయటం లో చైనా తనవంతు పాత్ర పోషించింది. అదే విధంగా అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్థల విధి విధానాల రూపకల్పనలో మరిన్ని సానుకూల మార్పుల దిశగా నడిపించటంలోనూ, అంతర్జా తీయ వేదికలపై వర్ధమాన దేశాల వాణిని బలంగా వినిపించటంలోనూ చైనా ఇతోధికంగా కృషి చేసింది. మేము పెద్దఎత్తున ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ చైనా రెన్‌మిన్‌బి (యువాన్‌) మారక విలువ నికరంగా ఉండేలా చర్యలు తీసుకున్నాము. తద్వారా అంతర్జాతీయ వాణిజ్యం లో నిలకఢత్వం సాధించటంలో ముఖ్యపాత్ర పోషించాము. అంతర్జాతీయ వాణిజ్య నిధి కార్య క్రమంలో క్రియాశీలక పాత్ర పోషించటమే కాక తూర్పు ఆసియా ప్రాంతంలో విదేశీ మారకద్రవ్య నిధిని ఏర్పాటు చేయటంలోనూ, చైనా ఆసియాన్‌ పెట్టుబడి నిధిని ఏర్పాటు చేయటంలోనూ ముఖ్య పాత్ర పోషించటంతో పాటు, కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలతో ద్రవ్యమార్పిడి గురించి ఒప్పందాలు కుదుర్చుకొన్నది. వియత్నాంతో సహా అనేక ఆసియా దేశాలతో ఉభయతారక ఒప్పందాలు కుదుర్చుకొంది. ఇవన్నీ ప్రాంతీయ, అంతర్జాతీయ అభివృద్ధి, స్థిరత్వం సాధనలో కీలక పాత్ర పోషించాయి.
చైనా ఒక బాధ్యతాయుతమైన అభివృద్ధి చెందుతున్న దేశమని, ప్రపంచ శాంతి సౌభా గ్యాల కోసం పని చేస్తున్న దేశమని నిరూపించేం దుకు ఈ ఉదంతాలు సరిపోతాయి. చైనా గతిశీలమైన దేశం. ప్రపంచానికి తలుపులు బార్లా తెరుస్తున్న దేశం. ఈ ప్రక్రియ వలన కేవలం చైనా మాత్రమే వేగవంతమైన ఆర్థికాభి వృద్ధి సాధించటం కాదు. అంతర్జాతీయ ద్రవ్య సంక్షోభం నుండి మొత్తం ప్రపంచం బయటపడ టానికి అవసరమైన పద్ధతుల్లో ప్రపంచ శాంతి సాధన కోసం, అభివృద్ధి కోసం కూడా దోహద పడుతున్నాయి. రానున్న కాలంలో ఏ స్థాయిలో విపత్తు ఎదుర్కోనున్నామన్న దానితో నిమిత్తం లేకుండా శాంతి, అభివృద్ధి, సహకారం సూత్రా లను కాపాడుకుంటూ ముందుకు పోతాము. జాతీయ ఆర్థిక వ్యవస్థ తలుపులు తెరవటం అన్న మౌలిక జాతీయ విధానాన్ని కొనసాగిస్తూనే ఉభయప్రయోజనకరమైన విధానాలను అనుస రిస్తూ శాంతి, సారస్యంతో కూడిన అభివృద్ధి వ్యూహాలతో చైనా ముందుకు సాగుతోంది. తద్వారా ప్రపంచ అభివృధ్ధికి మరింత ఎక్కువగా దోహదకారి కానుంది.
4. సంక్షోభాన్ని అధిగమించటంలో ప్రస్ఫు టంగా ముందుకొచ్చిన చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వ సామర్థ్యం:
సంస్కరణలు, వినూత్నత, కమ్యూనిస్టు పార్టీ నాయకత్వ స్థానాన్ని పరిరక్షించి ముందుకు తీసుకెళ్లటం వంటి ప్రయత్నాల్లో మెరుగు దల...ఇవి పార్టీని బలోపేతం చేయటం, పార్టీ దార్శనికతను నిరూపించటమే కాదు, అన్ని రకాల విపత్కర పరిస్థితులను అధిగమించి దేశాన్ని సుస్థిరత దిశగా నడిపించటంలో పార్టీ నాయకత్వ స్థానాన్ని నిలబెట్టి ఉంచుతాయి.
చైనా వ్యవహారాల నిర్వహణకు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం కీలకం. 16వ మహాసభల కాలంలో చైనా ఆర్థిక విధానాల్లో పెను మార్పులు చేపట్టింది. నాటి నుండీ ఈ మార్పులను అందు కునే విధంగా పార్టీ నాయకత్వ పాత్ర పోషిం చేలా చేయటంలో కూడా కీలకమైన చర్యలు చేపట్టింది. పాలక పార్టీగా పరిపాలన సంబం ధిత విషయాల్లో అనేక మార్పులు చేసింది. ఈ మార్పులు పార్టీ అధికారంలో కొనసాగటానికీ, పార్టీ నాయకత్వ స్థానం మరింత సంఘటితం కావటానికీ, ఆధునీకరించబడటానికీ, సంస్క రణలను జయప్రదంగా అమలు చేయటానికి అవసరమైన హామీ ఇవ్వటానికీ, దేశాన్ని ఆధునీకరించటానికీ పెద్దఎత్తున దోహదం చేశాయి.
అంతర్జాతీయ ద్రవ్య సంక్షోభాన్ని ఎదుర్కొం టున్న సమయంలో చైనా కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి హు జింటావో నేతృత్వంలో పరిస్థితిని సరిగ్గా అంచనా వేసి అనేక శాస్త్రీయ చర్యలు చేపట్టింది. పార్టీ కేంద్ర కమిటీ మార్గదర్శనం మేరకు అన్ని స్థాయిల్లోనూ పార్టీ నాయకత్వం ఈ పరిస్థితిని అధిగమించ టానికి నిబద్దతతో చర్యలు చేపట్టింది. ప్రజల యోగక్షేమాలు, రాజకీయ సుస్థిరత లక్ష్యంగా రూపొందించిన విధానాలను విశ్వాసంతో అమలు జరిపింది. క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవటంలో పార్టీ శ్రేణులు దేశవ్యాప్తంగా ఆదర్శవంతమైన కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలో పార్టీ శక్తి సామర్థ్యాలు పెంచటంతో పాటు ప్రజల్లో పార్టీపై విశ్వాసం పెరిగేందుకు కూడా దోహదం చేస్తున్నాయి.
విలక్షణ, విపత్కర పరిస్థితులనుండి దేశాన్ని బయటకు తేవటంలో చైనా కమ్యూనిస్టు పార్టీ యొక్క బలమైన, పరిణతి చెందిన ఉమ్మడి నాయకత్వమే ప్రధాన పాత్ర పోషించింది. ఈ కారణంగానే అంతర్జాతీయ ద్రవ్య సంక్షోభం ముందుకు తెచ్చిన సంక్లిష్ట పరిస్థితులను అధిగమించటంలోనూ, ఆర్థికాభివృద్ధిని సాధిం చటంలోనూ చైనా తన సామర్థ్యం ప్రదర్శిం చగలిగిందన్న విషయం రుజువవుతోంది. అంతేకాదు పాలక పార్టీగా చైనా కమ్యూనిస్టు పార్టీ గడించిన అనుభవాలు కూడా పెద్దఎత్తున దోహదం చేశాయి. ప్రజలు నిస్సంకోచంగా పార్టీకి అండగా నిలవటం ద్వారానే పార్టీ ఈ అనుభవాలు గడించగలిగింది. సంస్కరణలు, ఆధునికత లక్ష్యంగా పార్టీని అభివృద్ధి చేస్తున్నంత కాలం, పరిపాలనా విషయాల్లో పార్టీ నాయ కత్వ పటిమను పెంచటానికి కృషి చేస్తున్నంత కాలం, భవిష్యత్తు అవసరాలు అంచనా వేసుకోవ టంలో పార్టీకి ఉండాల్సిన దార్శనిక లక్షణాన్ని కాపాడుకుంటూ వస్తున్నంత కాలం ప్రతి కీలకమైన చరిత్ర మలుపులోనూ పార్టీ దేశానికి నాయకత్వ స్థానాన్ని అందిస్తూనే ఉంటుంది. ఎటువంటి అవాంతరాలు ఎదురైనా పార్టీ నాయ కత్వం కింద దేశం ముందంజ వేస్తూనే ఉంటుంది. జాతీయంగా, అంతర్జాతీయంగా ఎటు వంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఆయా సమయాల్లో ప్రజలకు పార్టీయే అండగా నిలు స్తుంది. చైనా లక్షణాలతో సోషలిజాన్ని అభివృద్ధి చేయటంలో పార్టీ నాయకత్వం పాత్ర నిస్సందే హంగా శీర్షస్థానంలో ఉంటుంది.
సెప్టెంబరు 2009లో పార్టీ కేంద్ర కమిటీ 17వ ప్లీనరీ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో పార్టీ అభివృద్ధికి సంబంధించి వ్యూహాత్మక చర్యలు తీసుకున్నాము. చైనా లక్షణాలతో సోషలిజం నిర్మాణానికి అవసరమై విధంగా పార్టీని సర్వతోముఖంగా అభివృద్ధి చేసే దిశగా తీసుకున్న చర్యలు సంపూర్ణంగా అమలు చేయనున్నాము. ఈ దిశగా ఇప్పటి వరకూ అభివృద్ధి పథంలో సాధించిన అనుభవాలు పునాదులుగా పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసి, పార్టీని అభివృద్ధి చేయటానికి అవసరమైన అన్ని చర్యలు అమలు చేయనున్నాము.
లియు యున్షాన్‌ (అనువాదం: కె. వీరయ్య)

No comments:

Post a Comment