Friday, August 19, 2011

ఆమె నవ్వు చూసి పడిపోయాడట ఆ నిర్మాత!

నవ్వు నాలుగు విధాల చేటు అన్న సామెతను నేడు మార్చేసి నవ్వు నాలుగు విధాల మేలు అని అంటున్నారు. 'ప్రేమకావాలి' హీరోయిన్‌ ఇషా చావ్లా నవ్వితేనే నిర్మాత అచ్చిరెడ్డి పడిపోయాడట. ఆమె నవ్వు చాలా ప్లెజెంట్‌గా ఉంటటుందట. 'ప్రేమకావాలి' చిత్రం విజయ యాత్రలో ప్రేక్షకులు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. అందుకు ఆమె నవ్వంటే చాలా ఇష్టమని అచ్చిరెడ్డి చెప్పారు. లేటెస్ట్‌గా ఆయన సునీల్‌తో నిర్మిస్తున్న 'పూలరంగడు'లో హీరోయిన్‌ ఎవరా? అని ఎంతోమందిని తన మనసులో ఆలోచించుకున్నారట.

ఓసారి ఎవరో అమ్మాయి నవ్వుతుంటే... అచ్చం ఇషా చావ్లా గుర్తుకు వచ్చిందట. ఇక వెంటనే ఆ విషయాన్ని దర్శకుడుకి చెప్పగానే.. అయితే ఓకే.. అనేశాడు. రాత్రికి రాత్రే ఫోన్‌చేసే ఆమెను ఆఘమోఘాల మీద హైదరాబాద్‌ రప్పించేశారు. ఈ చిత్రంలో హీరోయిన్‌ ఛాన్స్‌ కొట్టేసింది.

మరి ఆమె సరసన నటించే సునీల్‌ మాత్రం.. ఆమె నవ్వు, ముక్కుతీరు.. టోటల్‌గా ఆమెను చూస్తుంటే.. భాగ్యశ్రీలా ఒక పద్ధతిలా ఉంటుందనిపించిందని చెప్పాడు. హీరో చూపులు వేరుగానే ఉంటాయి కదా.

No comments:

Post a Comment