Tuesday, August 23, 2011

అమ్మతో బాస్మతి బియ్యాన్ని అమ్ముతున్న త్రిష

మాజీ మిస్ చెన్నై త్రిషా కృష్ణన్ కొత్త అవతారమెత్తింది. తన తల్లితో బాస్మతి బియ్యాన్ని అమ్ముతోంది. ఏంటీ..? ఇది నిజమా..? అనుకుంటున్నారా..? అసలు సంగతి ఏంటయా అంటే... త్రిష తల్లి ఉమా కృష్ణన్ తన కుమార్తెతో నటించే అరుదైన ఛాన్సును దక్కించుకుంది.

కోహినూర్ బాస్మతి బియ్యాన్నే కొనాలంటూ ఓ ప్రకటనలో తల్లీకూతుళ్లిద్దరూ కలిసి నటించేశారు. దీన్ని షూట్ చేసిన యూనిట్ తల్లీకూతుళ్ల యాక్షన్ అదిరిపోయిందంటున్నారట.

కానీ మొదట్లో ఉమా కృష్ణన్ ఈ ప్రకటనలో నటించేందుకు ససేమిరా అన్నదట. అయితే దర్శకుడు విజయ్ బతిమాలడంతో సరే కానీ అంటూ నటించిందట. కానీ నటనలోకొచ్చేసరికి కూతురు త్రిష యాక్టింగ్‌నే తలదన్నేసిందట. తల్లి యాక్షన్‌ను చూసి త్రిష నోరెళ్లబెట్టిందట. అదీ సంగతి

No comments:

Post a Comment