శ్రీరామచంద్రుడు పితృవాక్య పరిపాలకుడైతే.. రావణుడు మాతృవాక్య పరిపాలకుడు. శివాంస సంభూతుడు. శ్రీహరి పథాన్ని త్వరిత గతిన చేరాలని తపించిన అపర హరిభక్తుడు. ఆ మహనీయుడి కథాంశంతో గతంలో చాలా సినిమాలొచ్చినా.. రావణావతారానికి సంబంధించిన పూర్తి వృత్తాంతంతో ఇప్పటివరకూ ఒక్క సినిమా కూడా రాలేదు. ఆ బృహత్కారానికి తెరతీశారు పద్మశ్రీ మోహన్‌బాబు. అన్నమయ్య, శ్రీరామదాసులాంటి కావ్యాలతో ప్రేక్షకుల్ని భక్తిసాగరంలో ముంచెత్తిన దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఈ వెండితెర అద్భుతానికి దర్శకుడు.
వచ్చే ఏడాది మొదలు కానున్న ఈ సినిమా గురించి బుధవారం మోహన్‌బాబు మాట్లాడుతూ, రావణుడి పాత్ర ఔన్నత్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించే సినిమా ఇది. ఆయన జననం నుంచి మరణం వరకూ ఈ కథ సాగుతుంది. ఎన్టీఆర్, ఎస్వీఆర్ లాంటి మహానటులు చేసిన పాత్రను నేను చేయబోతున్నాను. వారి స్థాయికి ఏమాత్రం తగ్గకుండా నా శైలిలో ఈ పాత్ర రక్తికట్టించడానికి ప్రయత్నిస్తాను.
భారతదేశంలో పేరెన్నికగన్న నటీనటులందరూ ఈ సినిమాలో ముఖ్యపాత్రలు పోషిస్తారు. ఫారిన్ టెక్నాలజీతో త్రీడీ కెమెరాలను ఉపయోగించి ఈ చిత్రాన్ని చిత్రీకరించనున్నాం' అన్నారు. రాఘవేంద్రరావు చెబుతూ... మా కాంబినేషన్‌లో వచ్చిన అల్లుడుగారు, అల్లరిమొగుడు, మేజర్‌చంద్రకాంత్ చిత్రాలు శతదినోత్సవాలు జరుపుకున్నాయి. ఆ వరుసలోనే వాటికన్నా మరింత అత్యద్భుతంగా ఈ సినిమా నిలుస్తుందన్నారు. త్వరలో మరిన్ని వివరాలు తెలియపరుస్తామన్నారు.

No comments:
Post a Comment