Wednesday, December 25, 2013

ఉదయం వ్యాయామం వల్ల కలిగే యోజనాలు

ఉయదం సమయంలో మీరు రోడ్లులో, వీధుల్లో గమనించారా?కొంత మంది నడకసాగిస్తుంటారు. మరికింత మంది జిమ్ దుస్తుల్లో కనిపిస్తూ జిమ్ కు వెళుతుంటారు. మరికొంత మంది క్రికెట్, ఫుట్ బాల్ యూనిఫార్మ్స్ ల ఆత్రుతగా వెళుతుంటారు. మరియు మరికొంత మంది సాధారణ మార్నింగ్ వాక్ కోసం వస్తుంటారు. ఈ ప్రత్యేకమైన దృశ్యం ఉదయం చాలా స్పష్టమైనది. ఎందుకంటే అనేక మంది ఉదయం వ్యాయామంను ఎంపిక చేసుకుంటారు. సాధారణంగా చాలా మంది ఉదయం సమయంలో వాకింగ్ చేయడం ఆరోగ్యం మరియు తాజాదనం అని భావిస్తారు . వారు ఆరోజు మొదట చేసే పని. రెగ్యులర్ వ్యాయామం ప్రతి రోజూ ఉదయం చేయడం వల్ల, ఇది చాలా ఆరోగ్యకరం , పాత రోజుల్లో, ప్రజలు సూర్యోదయానికి ముందే నిద్రలేచి కొన్ని ఫిజికల్ ఛాలెంజింగ్ వ్యాయామాలు లేదా టాస్క్ లు చేసేవారు. మార్నింగ్ ఎక్సర్ సైజ్ గా యోగాను వేదాల్లో మరియు పురాణాల్లో పేర్కొన్నారు . ప్రతి రోజూ ఉదయం రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల ,అనేక ప్రయోజనాలున్నాయి. అందులో కొన్ని ప్రయోజనాలను మీకోసం క్రింది విధంగా చర్చించబడ్డాయి . ఉదయం వ్యాయామం వల్ల కలిగే యోజనాలు 
 1. మిమ్మల్ని ఫ్రెష్ గా ఉంచుతుంది : - మార్నింగ్ వర్కౌట్ వల్ల ఒక ప్రధాన ప్రయోజనం రోజంత తాజాగా ఉంచుతుంది . మార్నింగ్ వర్కౌట్ నడక, జిమ్, డ్యాన్స్ లేదా యోగా ఏదైనా కావచ్చు. మార్నింగ్ వర్కౌట్ వల్ల శరీరం యొక్క జీవక్రియ పెరుగుతుంది మరియు రోజంతా మిమ్మల్ని ఎనర్జిటిక్ గా ఉంచుతుంది . మార్నింగ్ చేసే వ్యాయామల వల్ల హార్మోనులను ఉత్తేజపరిచి అవి మిమ్మల్ని హెచ్చరికను మరియు తాజాగా ఉంచుతుంది. మీరు తర్వాత అలసటగా లేదా నిద్ర వస్తుంది భావించరు . అలాగే మార్నింగ్ వర్కౌట్స్ మీ చర్మాన్ని మరియు ముఖాన్ని తాజాగా ఫ్రెష్ గా ఉంచుతుంది. 
 2. క్రమశిక్షణ: - మార్నిగ్ వర్కౌట్ మన శరీరం క్రమశిక్షణలో ఉంటుంది. శరీరం రొటీన్ గా విధులు మరియు పని చేసేలా సహాయపడుతుంది. ప్రతి రోజూ మీరు రెగ్యులర్ వ్యాయామం చేయడం ద్వారా మీ శరీరాన్ని సర్ధుబాటు చేసుకుంటుంది.మీరు ఒక సారి మొదలు పెట్టిన తర్వాత అది అలవాటుగా మారిన తర్వాత మీరు ఒక్క రోజుకూడా వ్యాయామం చేయకుండా ఉండలేరు , అలాగే మీరు ప్రతి రోజూ ఒకే సమయానికి నిద్రలేస్తారు . ఎందుకంటే మెదడు అలవాటు మారుంటుంది. ఉదయం వ్యాయామాల వల్ల మీరు రాత్రిల్లో మంచి నిద్ర పొందడానికి సహాయపడుతుంది. 3. డైట్ రొటీన్ - ఉదయం క్రమం తప్పకుండా వ్యాయామంచేసే వ్యక్తులు ఆరోగ్యకరమైన ఆహారం అలవాట్లు కలిగి ఉంటారు . ఉదయం వ్యాయామం వల్ల ప్రయోజనాన్ని శరీరం ఆహారం వినియోగంను నియంత్రిస్తుంది. అలాగే, ఉదయం వ్యాయామం చేసే వ్యక్తుల యొక్కఆహార ఎంపిక చాలా ఆరోగ్యకరమైనవిగా ఉంటాయి. తిన్న ఆహారం మంచిగా జీర్ణం అవ్వడం మరయిు శరీరం యొక్క విధులు సక్రమంగా పనిచేయడం జరగవచ్చు. మీరు అజీర్ణం మరియు మలబద్దకంతో బాధపడుతున్నట్లైతన మార్నింగ్ వర్కౌట్స్ చాలా ఉత్తమమైన ఎంపిక . 
4. షెడ్యూలింగ్ - మీరు ఉదయం వ్యాయామం ప్రారంభించిన తర్వాత మీరు మీ రోజు లోఒక షెడ్యూల్ చేసుకోవాలి. మార్నింగ్ వర్కౌట్స్ కు మీకు సమయం కుదరనప్పుడు రజులో మరే ఇతర సమయంలోనైనా ఎంపిక చేసుకోవచ్చు . ప్రతి ఒక్కరికీ బిజీ షెడ్యూల్ ఉంటుంది. మరియు వ్యాయామం కోసం సమయం గడపడానికి చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి, చాలా మందికి మార్నింగ్ టైమ్ వ్యాయామాలకు చాలా మంచి సమయం. ఉదయం అభ్యంతరాలు లేదా మళ్లింపులు ఉండవు. ఒక ప్రశాంత వ్యాయామం మరియు వ్యాయామం చేయవచ్చు . 
5. మంచి ఫలితాలు - ఉదయం వ్యాయామాలు, ఉదయం అల్పాహారానికి ముందుగా చేయాల్సి ఉంటుంది. కాలీ కడుపుతో వ్యాయామం చేయడం ద్వారా ప్రతి ఒక్కరికీ మంచి ది మరియు భోజనం లేదా బ్రేక్ ఫాస్ట్ తర్వాత వ్యాయామం కంటే ఉదయం బ్రేక్ ఫాస్ట్ మందు చేసే వ్యాయాల వల్ల ప్రయోజనం, ఫలితాలు అధికంగా మరియు చాలా ఎఫెక్టివ్ గా ఉంటాయి. ఉదయం తాజాగాలిలో వ్యాయామం చాలా మంచిది . పగలంత పడే సూర్యరశ్మి కంటే ఉదయం వచ్చే సూర్యరశ్మిలో అనేక విటమిన్లు కూడా ఉంటాయి .ఈ అన్ని కారణాల వల్ల మార్నింగ్ వర్కౌట్స్ పరిపూర్ణంగా మరియు ఎఫెక్టివిగా ఉన్నాయి.

No comments:

Post a Comment