ఎవరికైనా షేవింగ్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఒక గొప్ప అనుభూతి
కలుగుతుంది. అంతేకాక మీకు ఒక గొప్ప భావన మరియు విపరీతమైన విశ్వాసం
కలుగుతుంది. మీరు ఒక ముఖ్యమైన సమావేశానికి లేదా ఒక ముఖ్యమైన డేట్ కి
వెళ్ళినప్పుడు చురుకుగా మరియు సున్నితంగా కనిపించి మీ మీద జెంటిల్మెన్
అభిప్రాయం కలగాలి. షేవింగ్ పూర్తి చేసినప్పుడు,మీ చర్మం దెబ్బతినకుండా ఒక
మంచి కాంబినేషన్ గల ఫేస్ ప్యాక్ వాడటం ముఖ్యం. షేవింగ్ తర్వాత మీ ముఖం
బాగుండటం అనేది చాలా ముఖ్యం. వాస్తవానికి షేవింగ్ సమయంలో మీ చర్మం మీద ఒక
పొర గడ్డం ఉంటుంది.
మీరు ఎంత జాగ్రత్తగా లేదా ఎంత ప్రిపరేషన్ తో షేవింగ్ చేసుకున్నా సరే కోతలు
మరియు కంటికి కనబడని గాయాలు ఉంటాయి. మీరు షేవింగ్ చేసిన తర్వాత టీ ట్రీ
ఆయిల్ లేదా యాంటిసెప్టిక్ రాసిన తర్వాత ఫేస్ ప్యాక్స్ ను ఉపయోగించండి. ఇది
దెబ్బతిన్న మీ చర్మంను ఉత్తేజపరచటానికి సహాయపడుతుంది. అంతేకాక మీ ముఖ
చర్మంను తేమగా మరియు మృదువుగా చేస్తుంది. ఒక మనిషి ఫేస్ ప్యాక్స్
ఉపయోగించటానికి నిషేధం లేదు. కొన్ని స్టడీస్ ప్రకారం మహిళలతో పాటు పురుషులు
కూడా వారి ముఖ చర్మం మృదువుగా ఉండటానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఫేస్ ప్యాక్స్ డీప్ గా షేవింగ్ చేసిన తర్వాత మీ చర్మం పోషణకు మాత్రమే
కాకుండా మీ చర్మంను తేమగా మరియు యవన్నంగా ఉంచటానికి సహాయపడుతుంది. మీరు
ఎక్కువ ప్రయోజనాలు పొందటానికి సహజ మరియు మూలికా కాంబినేషన్ తో ఉన్న ఫేస్
ప్యాక్స్ కు ప్రాధాన్యత ఇవ్వాలి. షేవింగ్ తర్వాత దోసకాయ,
బొప్పాయి,తేనె,పసుపు వంటి ఫేస్ ప్యాక్స్ ఉపయోగించాలి.

No comments:
Post a Comment