గ్లిసరిన్ నకిలీ కన్నీళ్ల ఉత్పత్తికి పేరొందింది. దీనిని సినిమా మరియు
టెలివిజన్ నటులు మరియు నటీమణులు ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే గ్లిసరిన్ అనేక
ఇతర ప్రయోజనాలను కలిగి ఉంది. అటువంటి ప్రయోజనాలు చర్మం మీద కూడా ఉన్నాయి.
అంతేకాక చర్మం మరియు అందం సంరక్షణ కోసం అనేక ఇతర లాభాలున్నాయి.
గ్లిసరిన్ కన్నీటి గ్రంధులను ఉద్దీపన చేసి నకిలీ కన్నీళ్లను ఉత్పత్తి
చేస్తుంది. అంతేకాక మన చర్మ కణాలను పునరుద్ధరించడానికి ప్రేరేపించగలదు.
గ్లిసరిన్ ను చర్మం మీద నేరుగా లేదా ఫేస్ ప్యాక్ మరియు ఫేస్ మాస్క్ ల కొరకు
ఇతర పదార్థాలతో కలిపి ఉపయోగించవచ్చు. ఈ క్రింద చర్మంనకు గ్లిసరిన్ తో ఉండే
కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి:-
1. మాయిశ్చరైజర్
గ్లిసరిన్ చర్మం కొరకు ఒక మంచి మాయిశ్చరైజర్ గా పరిగణించబడుతుంది.ఇది పొడి
మరియు నిస్తేజంగా మారిన చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.అందువలన
శీతాకాలంలో అత్యవసరం. గ్లిసరిన్ ఒక తేమను కలిగించే పదార్ధం వలె చర్మం మీద
నేరుగా ఉపయోగించవచ్చు.గ్లిసరిన్ ను కాటన్ మీద వేసి చర్మం మీద రాయవచ్చు.
చర్మం మీద గ్లిసరిన్ రాసిన తర్వాత మృదువుగా మరియు హైడ్రేటెడ్ గా
అనిపిస్తుంది.
గ్లిసరిన్ లో పొడి,కఠినమైన మరియు విసుగు చర్మంను నయం చేసే కొన్ని
లక్షణాలను కలిగి ఉంది. చర్మంను తేమగా మరియు మృదువుగా ఉంచుతుంది. చర్మం
కొరకు గ్లిసరిన్ ప్రయోజనాలలో ఇది ఒకటి.
2. క్లీన్సెర్
గ్లిసరిన్ చర్మం నుండి దుమ్ము మరియు ధూళి తొలగించి శుభ్రం చేయటానికి
ఉపయోగించవచ్చు. గ్లిసరిన్ మరియు రోస్ వాటర్ కలిపి ఒక క్లీన్సెర్ గా
వాడుకోవాలి.సాయంత్రం నిద్ర పోవటానికి ముందు ఈ మిశ్రమంతో పూర్తిగా ముఖం
తుడవాలి. ప్రభావవంతమైన చర్మం మరియు సూక్ష్మరంధ్రములను శుభ్రపరచటానికి
క్రమం తప్పకుండా ఈ విధానాన్ని మళ్ళీ చెయ్యండి. ఇది చర్మం కొరకు గ్లిసరిన్
యొక్క మంచి ప్రయోజనాలలో ఒకటి.
3. పోషణ
గ్లిసరిన్ చర్మం కొరకు పోషణ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. అందువలన అనేక
సౌందర్య సాధనాలలో ఒక అవసరమైన పదార్ధంగా వాడుతున్నారు. గ్లిసరిన్ చర్మంలో
నీటి శాతాన్ని సమతుల్యంగా ఉంచడానికి మరియు చర్మం పోషణకు సహాయపడుతుంది.మీ
మాయిశ్చరైజర్ లో గ్లిసరిన్ కలిపి ప్రతి రోజు ఉపయోగించవచ్చు. మీరు ఫేస్
ప్యాక్స్ మరియు ఫేస్ మాస్క్ లలో గ్లిసరిన్ ఉపయోగించవచ్చు.గ్లిసరిన్ లో
చర్మం పోషణ మరియు మృదువుగా ఉంచటానికి అనేక లాభాలున్నాయి.రెగ్యులర్ గా
ఉపయోగించుట వలన తాజా చర్మం మరియు ఆరోగ్యకరముగా ఉంచడానికి ఖచ్చితంగా సహాయం
చేస్తుంది.
4. చర్మం రక్షణ
గ్లిసరిన్ పొడి మరియు విసుగు చర్మం చికిత్స కొరకు మందులు మరియు క్రీమ్స్
లలో ఉపయోగిస్తారు.కొన్నిసార్లు చల్లని,కాలుష్యం మరియు ఇతర కారకాల కారణంగా
చర్మం దురద మరియు పొరలుగా కావచ్చు.ఈ సమయంలో గ్లిసరిన్ ఉపయోగించి చర్మం
లోపాలను తగ్గించడానికి మరియు చర్మం మృదువుగా ఉంచడానికి సహాయం
చేస్తుంది.చర్మ సంరక్షణ మందులలో గ్లిసరిన్ ప్రధాన భాగంగా ఉంటుంది. క్రమం
తప్పకుండా గ్లిసరిన్ ఉపయోగిస్తే మంచి చర్మ రక్షణను అందిస్తుంది.అందువలన
ఆరోగ్యకరమైన చర్మంను ఉంచడానికి తరచుగా గ్లిసరిన్ ఉపయోగించాలి. చర్మంనకు
గ్లిసరిన్ ఉపయోగించడం ద్వారా మంచి చర్మ రక్షణ అందించబడుతుంది.
5. దోషాలను తగ్గిస్తుంది
గ్లిసరిన్ మోటిమలు మరియు దోషాలను తగ్గించటానికి సహాయపడుతుంది. ఇది
గ్లిసరిన్ నిరంతర వాడుక తర్వాత జరుగుతుంది. మోటిమలు మరియు దోషాలు ఉన్న
ప్రాంతంలో గ్లిసరిన్ తో రబ్ చేయాలి. చర్మం మీద మచ్చలు నెమ్మదిగా తగ్గుతాయి.
చర్మం కొరకు గ్లిసరిన్ ఉపయోగిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ ప్రయోజనాలు
చర్మం కొరకు మాత్రమే కాకుండా కన్నీళ్ల ఉత్పత్తికి కూడా సహాయపడుతుంది.

No comments:
Post a Comment