Wednesday, January 22, 2014

బాత్ రూమ్ క్లీనింగ్

సాధారణంగా ఇల్లల్లో లివింగ్ రూమ్, బెడ్ రూమ్, వంటగది, గెస్ట్ రూమ్ లకు ఇచ్చిన ప్రాధాన్యత బాత్ రూమ్ లకు ఇవ్వరు. అయితే బాత్ రూమ్ ను శుచి శుభ్రతలతో మెయింటైన్ చేసుకోవడం ప్రతి ఒక్కరి అవసం. ఆరోగ్యం. కాబట్టి తప్పని సరిగా బాత్ రూమ్ ను క్లీన్ గా పెట్టుకోవడం ప్రతి ఒక్కరి భాద్యత. వ్యక్తిగత పరిశుభ్రతను కాపాడుకోవడానికి, మీ బాత్ రూమ్ క్లీనింగ్ ను మీ దిన చర్యలో ఒక భాగంగా చేసుకోండి. అయితే ముఖ్యంగా బాత్ రూమ్ క్లీనింగ్ విషయంలో ఎక్కువ సమయాన్ని తీసుకోవడం, టైల్స్ ను రుద్దడానికి కెమికల్స్, రసాయానాలు వేసి అరగంట పాటు నాననిచ్చి తర్వాత శుభ్రం చేయడం ఇవన్నీ సమయాన్ని వృధాచేయడమే. కాబట్టి బాత్ రూమ్ క్లీనింగ్ విషయంలో ఎక్కువ సమయం తీసుకోకుండా చాలా సులభమైన చిట్కాలు అతి తక్కువ సమయంలో ఎలా శుభ్రం చేయాలో చూద్దాం.... బాత్ రూమ్ శుభ్ర పరచడానికి ముందు ఏ వస్తువులు అవసరం అవి ముందుగా ఏర్పటు చేసుకొని ఒక ప్లేస్ లో అమర్చుకోవాలి. మాప్, చీపురు, బకెట్, మగ్ ఇటివంటి తప్పని సరిగా ఉండేలా చూసుకోవాలి. మీకు ఇంకా టాయిలెట్ బ్రెష్ కూడా అవసరమౌతుంది. దాన్ని కూడా దగ్గరలో ఉంచుకోండి. అలాగే క్లీనింగ్ చేసే సమయంలో చేతులుకు గ్లౌజులను వేసుకోవడం మరిచిపోకూడదు. మీరు సాధారణంగా శుభ్రం చేయాలానుకొన్నా సరే గ్లౌజులు తప్పనిసరి ఎందుకుంటే బాత్ రూమ్ క్లీనింగ్ కు ఉపయోగించే కెమికెల్స్ చేతులమీద పడి చర్మఇన్ఫెక్షన్, మరే ఇతర సమస్యలు రాకుండా కాపాడుకోవాలి. బాత్రూమ్ శుభ్రం చేయడానికి : 6బెస్ట్ టిప్స్ 
 బాత్రూమ్ బేసిన్: ప్రతి రోజూ దంతాలను బ్రెష్ చేసి కడగకపోతే ఎలా పాచి, గారకడుతాయో, ఇన్ఫెక్షన్ కు ఎలా గురి అవుతుంది. అదే విధంగా బాత్రూమ్ బేసిన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి, బాత్రూమ్ బేసిన్ శుభ్రం చేయడానికి నిమ్మరసం ఉప్పు మిశ్రమంతో బాగా రుద్ది 15నిముషాలు అలాగే ఉంచి తర్వాత శుభ్రం చేయాలి. బాత్రూమ్ కర్టెన్స్ : బాత్రూమ్ లో వేలాడదీసిన కర్టెన్స్ ను నెలకొకసారైనా శుభ్రం చేయాల్సి ఉంటుంది. కర్టెన్స్ మీద మరకలను తొలగించడానికి వెనిగర్ మరియు సాల్ట్ స్ప్రే చేయాలి. ఈ రెండింటిని ఉపయోగించడం వల్ల చాలా తేలిక గా శుభ్రం చేయవచ్చు . 
బాత్రూమ్ టైల్స్: బాత్రూమ్ టైల్స్ చాలా త్వరగా మరకలు పడుతాయి. ఈ సమస్యను నివారించడానికి మీరు చేయాల్సిందల్లా బంగాళదుంప ముక్క తీసుకొని మరకలున్న ప్రదేశంలో బాగా రుద్ది అలాగే 15నిముషాలు వదిలేసి, తర్వాత వేడి నీళ్ళతో శుభ్రం చేయాలి . బాత్రూమ్ విండోస్: బాత్రూమ్ విండోస్ ఎప్పుడు మబ్బుగా సోపువాటర్, లేదా పొగపడినట్లు కనబడుతుంటుంది. కాబట్టి, బాత్రూమ్ విండోస్ శుభ్రపరచడానికి టూత్ బ్రష్ ఉపయోగించాలి . టూత్ బ్రష్ ను సోప్ వాటర్ లో డిప్ చేసి తర్వాత బాత్రూమ్ విండోను శుభ్రం చేయాలి. బాత్ రూమ్ క్లీనింగ్ తో వ్యక్తిగత పరి శుభ్రత.: క్లిక్ చేయండి టాయిలెట్ బేసిన్: టాయిలెట్ బేసిన్ శుభ్రం చేయడానికి ఒక మగ్గునీటిలో వెనిగర్ నిమ్మరసం మరియు ఉప్పు మిక్స్ చేసి, టాయిలెట్ బేసిన్ మీద పోయాలి. అరగంట తర్వాత టాయిలెట్ క్లీనర్ తో రుద్ది తర్వాత శుభ్రం చేయాలి. నీరు పోసి శుభ్రం చేయడం వల్ల మంచి షైనింగ్ తో మెరుస్తుంటుంది. వాటర్ ను ఫ్లష్ చేయాలి: బాత్ రూమ్ ను సోప్ క్లీనింగ్, స్ర్కబింగ్, వాటరింగ్ తర్వాత బాత్ షవర్ తో లేదా పైప్ తో బాత్ రూమ్ లో వాటర్ ఫోర్స్ గా తిప్పి నీటితో శుభ్రపరచాలి. లేదా మగ్గుతో నీటిని ఫోర్స్ గా పోసి సోప్ వాటర్, పోయే విధంగా చూసుకోవాలి. ఫినాయిల్: వాటర్ తో శుభ్ర పరిచిన తర్వాత, చివరగా ఫినాయిల్ చల్లి శుభ్రం చేసుకోవాలి. ఒక మగ్గునీటిలో కొన్ని ఫినాయిల్ కొద్దిగా వేసి బాత్ రూమ్ లో చల్లి శుభ్రం చేస్తే సూక్ష్మక్రిములను నాశనం చేసి, ఫినాయిల్ స్మెల్ బాత్ రూమ్ లో రిఫ్రెష్ చేస్తుంది. మీ బాత్ రూమ్ అందంగా ఉంచుకోవడానికి చిట్కాలు: క్లిక్ చేయండి మాప్: బాత్ రూమ్ ఇలా శుభ్రపరిచిన తర్వాత మాప్ తీసుకొని తడినంత తుడిచేయాలి. బాత్ రూమ్ ను ఎప్పుడూ పొడిగా ఉంచాలి. ఇలా వుంచడం ద్వారా నీటి వాసన బాత్ వాసన లేకుండా చేస్తుంది.

No comments:

Post a Comment