మహిళలకు, పురుషులకు చలికాలపు చర్మ సంరక్షణా చిట్కాలు ! చలికాలం
వచ్చిందంటే చాలు, పురుషులైనా, స్త్రీలైనా పొడి చర్మ సమస్యలు
ఎదుర్కొనాల్సిందే. వేసవి కాలంలో గాలిలో తేమ వుంటుంది. కనుక మనం శరీరం చెమట
రూపంలో తేమను నిలుపుకుంటుంది. కాని శీతాకాలం లేదా చలి కాలంలో, అందరూ చర్మ
సమస్యలు ఎదుర్కొంటారు. పొడిబారిన తెల్లటి ముఖం, చుర చుర మంటూ నొప్పులు
కలిగించే ఇతర చర్మ సమస్యలు బాధిస్తాయి. ఇక అపుడు స్కిన్ కేర్ ఉత్పత్తుల
ఉపయోగం తప్పనిసరిగా వుంటుంది. ఈ సమస్యలు, మహిళలకే కాక పురుషులకు కూడా
వుంటాయి.
చలికాల శరీర సంరక్షణా చిట్కాలు !
నిగ నిగ లాడే మెత్తటి చర్మం కొరకు సహజమైన మాయిస్చరైసర్ లు రాయండి.
చలికాలంలో చేసే వేడి నీటి స్నానాలు కూడా చర్మానికి హాని కలిగిస్తాయి. అవి
మీ చర్మ తేమను తొలగించి చర్మాన్ని పొడి చేసి, పెళుసుగా చేస్తాయి. కనుక
ఎక్కువ సేపు లేదా తరచుగాను స్నానం చేయకండి. చర్మం పగుళ్ళు చూపిన చోట
పెట్రోలియం జెల్లీ వాడకం చేయండి. ప్రతి రోజూ నిద్రించేముందు, ఆల్మండ్
నూనెను ముఖానికి రాయండి. చల్లని గాలి నుండి మీ చర్మాన్ని దూరంగా వుంచండి.
వూల్లెన్ క్లోత్ లేదా ఒక బట్టతో మీ శారీరక భాగాలను కప్పి ఉంచేందుకు
ప్రయత్నించండి.
స్త్రీ, పురుషులు కోసం శీతాకాల చర్మ సంరక్షణ చిట్కాలు
చలికాలంలో పురుషులకు, మహిళలకు పెదవుల సంరక్షణ ఎలా ? .
చలికాలంలో మీ పెదవుల రక్షణకై లిప్ కేర్ పూతలు తప్పక వేయాలి. వీలు
వున్ననంతవరకు ఇంటిలోని సహజ పదార్దాలైన నెయ్యి, వెన్న, కొబ్బరి నూనె వంటివి
రాయండి. శరీర తేమ నిలువకు గాను నీరు అధికంగా త్రాగండి. చాలామంది తమ
పెదవులను నోటితో టచ్ చేసి తేమగా ఉంచేందుకు ప్రయత్నిస్తారు. కాని ఇది
సరికాదు. ఈ చర్య పెదవులని మరింత తరచుగాపొడి చేస్తుంది. పెదవి భాగాలను మరింత
పగిలేలా చేస్తుంది. కనుక పెదవులను నోటితో తడి చేసే అలవాటు మానండి.
పురుషులకు , మహిళలకు పాద సంరక్షణలో చిట్కాలు!
వింటర్ వచ్చిందంటే చాలు చాలా మంది కాలి మడమ పగుళ్ళ సమస్యలను కలిగి వుంటారు.
ఈ సమస్యలకు పరిష్కారంగా ఇంటి చిట్కాలు కొన్ని పాటించవచ్చు. ఒక పెద్ద
గిన్నె లో ఒక మాదిరి నులి వెచ్చని వేడినీటిని తీసుకొని దానిలో నిమ్మ రసం
కలిపి, ఆ నీటిలో మీ పాదాలను కనీసం 30 నిమిషాలపాటు వుంచండి. తర్వాత పాదాలను
బయటకు తీసి, వాటిని స్క్రబ్బర్ లేదా గట్టి సాధనంతో రుద్దండి. పాదాలకు కల
మృతకణాలు తొలగిపోతాయి. చర్మం ఆరోగ్యంగా వుంటుంది. ఇపుడు, పెట్రోలియం జెల్లీ
లేదా ఇతర స్కిన్ ఆయంట్ మెంట్ లు పాదాలకు రాయండి. వీలైనంత వరకు పాదాలకు చలి
గాలి తగలకుండా సాక్స్ ఉపయోగించండి.
చలికాలంలో హెయిర్ కేర్ టిప్స్ ఎలా ?
చలికాలంలో జుట్టు ఊడటం లేదా చిట్లడం సాధారణంగా గమనించవచ్చు. ఈ కాలంలో కేశ
సంరక్షణ ప్రధానం. ఈ కాలంలోనే తలకు చుండ్రు వ్యాధి కూడా వచ్చే అవకాశం
వుంటుంది. చుండ్రు వ్యాధిని తొలగించాలంటే, వెంట్రుకలను శుభ్రపరచే ముందు,
కొట్టిపాటి నిమ్మ రసం రాయండి. కొద్దిసేపు వుంచి శుభ్రమైన వేడి నీటితో
కడిగేయాలి. ఈ కాలంలో జుట్టు ను అతిగా దువ్వటం కూడా మంచిది కాదు. సహజమైన
నూనెలతో తగినంత సేపు మర్దన చేసి నూనెలు తల చర్మపు పొరలకు ఇంకిపోయేలా
చూడండి.

No comments:
Post a Comment