Sunday, September 5, 2010

మధురాంతకం రాజారాం కథల్లో స్త్రీ

తెలుగు కథా సాహిత్యంలో మనిషితనానికి పట్టంగట్టి, గొప్ప మానవీయ విలువలతో కథలు రాసి , తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సుస్థిరం చేసుకున్న గొప్ప రచయిత కీ.శే మధురాంతకం రాజారాం. ఒక ఉపాధ్యాయుడుగా అతి సాధారణమైన జీవితాన్ని గడిపిన రాజారాం పల్లెపట్టులలోని జనం మధ్యతరగతి ప్రజలు , ఉద్యోగస్తులు సాగిస్తున్న సాధారణ జీవితాన్ని అతి దగ్గరగా చూసి , తన కథల్లోకి ఆ జీవితాన్ని యధాతధంగా ఒంపుకున్న రచయిత రాజారాం. తన జీవితం లో తాను చూసిన లేదా తనకు తారసపడిన వ్యక్తుల్నే పాత్రలుగా మలచిన కథలు రాజారాం వి. అందుకే వారి కథలు చదువుతుంటే మన అమ్మమ్మ ఎవరో మనల్ని ఒడిలో కూర్చోపెట్టుకుని కథలు చెబుతున్నట్లుంటుంది. పెద్దరికం ఉట్టిపడే ఈ పెద్దమనిషో లేక మన శ్రేయస్సు కోరుకునే ఏ ఉపాధ్యాయుడో మనల్ని ఒక చోట బుద్ధిగా కూర్చోపెట్టి,బెత్తంపట్టుకోకుండా అఙ్ఞానంగా నిలబడి ఏవో బుద్ధులు గరుపుతున్నట్టుంటుంది. వారి కథలు మనకు తెలియకుండానే చిత్తూరు జిల్లాలోని పంటపొలాల గట్లంట ,చేలంట ,పచ్చటి వనాలంట మనల్ని ఒక చుట్టు చుట్టి తీసుకు వచ్చినట్టుంటాయి. అందుకే వారి కథల్లోని పాత్రలు మనల్ని ఆత్మీయంగా పలకరించినట్టు, చిన్న చిన్న అలకలతో , ఆగడాలతో ఆటపట్టిస్తున్నట్టు ఒకసారి మురిపిస్తూ ఇంకొకసారి చిరుకోపంతో మందలించినట్టు, అవి మనతోబాటు సహజీవనం చేస్తూ, ఎక్కడో ఒకచోట తారసపడినట్లే అనిపిస్తాయి. ఈ విషయం లో వారి కథల్లోని స్త్రీ పాత్రలు మరీ సహజంగా అచ్చమైన స్వచ్ఛమైన ఆరణాల ఆంధ్ర స్త్రీలు గానే కనిపిస్తారు.. ఎమరాల్డ్ లాంటి ఫ్రెంచ్ అమ్మాయి అయినా సరే చందమామ పైనున్న పేదరాసి పెద్దమ్మయినా సరే వాళ్ళు మన కోసమే వచ్చినట్లు మనలో ఒకరిగా కలిసిపోయినట్త్లు అనిపిస్తుంది. వీరు సృష్టించిన స్త్రీ పాత్రలు చాలా వరకూ కరడు గట్టిన మనిషినైనా సరే మంచితనం వైపే నడిచేటట్లు చేసేవిగాను, నలుగురుకి స్ఫూర్తి దాయకంగానూ వుంటాయి.

చేదు ,తీపి, వగరు , పులుపు మొదలైన విభిన్న రుచులతో మన సంస్కృతికి ప్రతీకగా నిలచే ఉగాది పచ్చడిలా అన్ని రుచులను, అనుభవాలను అనుభూతులను మనముందుంచే రాజారాం కథల్లోను మన జీవితం లో తారసపడే అన్ని రకాల వ్యక్తుల పాత్రలున్నాయి. అవి మన సాంస్కృతికి చిహ్నంగానూ వుంటాయి. నిజానికి సృజనాత్మక సాహిత్యంలో ఏ పాత్రయినా Robert scholes చెప్పినట్లుగా real person అయివుంటుంది. అంతే గాకుండా “In realistic fiction a character is likely to be representative of a socila class “( Elements of fiction – page -19) అని కూడా అంటాడు Scholes.మధురాంతకం రాజారాం కథల్లోని స్త్రీ పాత్రలు విషయంలో ఇది ఇంకా బాగా అన్వయం అయ్యే అంశం. ఏ సాహిత్యం లో అయినా పాత్రలు ప్రధానమైనవీ అప్రధానమైనవీ అని రెండు రకాలుంటాయి. కథ ఎవరి దృష్టి కోణం నుంచీ ముందుకు నడుస్తుందో అది ప్రధాన పాత్ర. అపాత్ర చిత్రణకు దోహదకారులుగా నిలచిన మిగిలిన పాత్రలన్నీ అ ప్రధాన పాత్రలే…..
ఈ వ్యాసం లో రాజారాం కథల్లోనీ కొన్ని స్త్రీ ప్రధాన పాత్రల గురించి మాత్రమే ఇక్కడ చర్చించడం జరుగుతుందని సహృదయ పాఠకులకు మనవి చేసుకుంటున్నాను.
రాజారాం కథల్లో కనిపించే ప్రధాన స్త్రీ పాత్రలన్నీ ఏదో స్ఫూర్తి నిచ్చేవిగానే వుంటాయి. అలాంటి పాత్రల్లో కొండారెడ్డి కూతురు తలమానికంగా నిలిచే పాత్ర. ఈ కథ పేరు కూడా అదే అయిన ఈ కథలో తన పుట్టినూరునుంచీ వచ్చిన కదిరప్పా, మల్లేసులను చూసి ఒక వైపు సంతోషిస్తుంది. మరో వైపు అనుమానపడుతుంది కొండారెడ్డి కూతురురైన నాగతులసి. చాలా ఏళ్ళ తర్వాత తనవారెవరూలేని సింగరాయకొండా పాయకట్టులో తన తండ్రిక్రూరత్వాన్ని తలచుకుని అనుమానంతో కూడుకున్న భయం. కొండారెడ్డిని వేలెత్తి చూపిన వాళ్ళు, చెనక్కాయల వ్యాపారంలో తనకు పోటీ వచ్చినవాళ్ళు, తన ఆదాయాన్ని అధిక్యతను ప్రశ్నించిన వాళ్ళు యింకా రకరకాలుగా అతని మనసుకు గిట్టన్ వాళ్ళు బతికి బట్టకట్టలేరు. అతని మారణ హోమానికి ముష్టికులవంటి వాళ్ళే ఆ ఆగంతకులు. వారు నిద్రించేటప్పుడు వారి సాంచుల్లో వున్న మారణాయుధాలను చూసి మరింత భయపడిపోయి తండ్రి నరగావుకుద్దేశింపబడిన బలిపశువు తన భర్తేనన్న నిజాన్ని గ్రహిస్తుంది. దానికి కారాణం నెల్లూరు ప్రాంతం నుంచీ ఎద్దుల బేరానికి వచ్చిన తండ్రిఈ కొడుకులు వెంకటకిష్ణారెడ్డి, రవణారెడ్డిలు కొండారెడ్డి ఎద్దుల్ని బేరమాడతారు. బేరమాడడమ్ కొనే వారి సహజ లక్షణంగా వున్న ఈ దేశంలో అలా బేరమాడడమే వారు చేసిన నేరంగా భావించిన కొండారెడ్డి తన కూతురు పైట పట్టిలాగారని నేపంపెట్టి మహడీలోనే తాళ్ళతో కట్టేసి చితకతన్నిస్తాడు. అది అన్యాయమని గ్రహించిన అతని కూతురు వాళ్ళ కట్లు విప్పి , తండ్రి వేసిన అపనిందని నిజంచేయ్ ఆలని అతనితోనే లేచి వచ్చేసి పెండ్లి చేసుకుని హాయిగా వుంది . అది భరించలేని కొండారెడ్డి అల్లున్ని చంపడానికే వాళ్ళిద్దర్నీ పంపించాడూ. అదే ఆమె అనుమానం . ఆ రాత్రి వాళ్ళాకు కడుపునిండా బోజనం పెట్టి పడుకోబెట్టించి తన గదిలో వుండగా నెల్లూరుకి పెండ్లికి వెళ్ళి వచ్చిన తన భర్తతో అర్థరాత్రిదాకా మాట్లాడి, ఒక నిర్ణయానికి వచ్చి భర్తని నిద్రపోయిన తర్వాత కదిరప్ప , మల్లేసు నిద్రిస్తున్న గదిలోకి అడుగుపెడుతుంది. ఆమె పొడ గమనించిన వారు ఆమె కాళ్ళపైన బడి, ఆమె ఆదరణకు కరిగిపోయి క్షమించమని అడుగుతారు అంతేగాక , ఇక నుంచీ కొండరెడ్డి సాగించే మారణహోమంలొ పాల్గినమని చెప్పి తమ ఊరికి పోకుండా విశాఖపట్నం వెళ్ళిపోతారు. తన మంచితనం , తన మాటలు , ఆధిపత్యం వారిని మంచి వాళ్ళుగా మార్చినందుకు సంతోషిస్తుంది నాగతులసి. సరిగ్గా ఇలాంతి పాత్రే ‘గాలివెడు నుందీ న్యూయార్క్ దాకా’ కథలోని నీరజ పాత్ర.
గాలివీడు ప్రాంతంలోని మల్లారెడ్డికీ, చెంచురామానాయుడికీ ఎన్నోనాళ్ళ నుంచీ పార్టీ . ఇరువర్గాల అప్పుడప్పుడు హత్యలు చేసుకోవడం , ఆస్తుల్ని ధ్వంసం చేసుకోవడం పరిపాటి. ఇరువర్గాల మధ్య ఉప్పు నిప్పు అనుబంధం.పచ్చ గడ్డి వేస్తే భగ్గున మండి పోయే పగ. ఇలాంతి కతడుగట్టిన వ్యక్తుల మధ్య ఓ ఆడకూతురు ఎలా పగల్ని పోగొట్టి స్నేహబంధం పెపొందించే టట్లు చేసిందో ఈ కథ చెబుతుంది. ఆ పని చేసింది నీరజనే. అయితే వాళ్ళిద్దరిదీ సామాన్యమైన పగకాదు. చెంచురామానాయుడితల పుర్రెను నీళ్లు లేని చెరువులో తాటిబొచ్చెను తన్నినట్టుగా తన్నాలన్నంత పగ మల్లారెడ్డిది . ఈ బోడి మల్లారెడ్డిగాడిని కుక్కను చంపినట్లు చ్ంపిందాకా నిద్రపోకూడదనుకునే పగ చెంచురామానాయుడిది. అలాంతి పగలను నీరజ ఎలా పొగొట్టిందీ అనేదే కథ.
అమెరికా లోవున్న తన మేణల్లుడు మధుసూధనరెడ్డి ఆహ్వానం మేరకు మల్లారెడ్డి అమెరికా వెళతాడు. అక్కడా జాన్ కెనడీ అంతర్జాతీయ విమానాశ్రమంలో మేనల్లుడి స్నేహితుడు రవీంద్రారెడ్డి అతన్ని రిసీవ్ చేసుకుని అతని బాధ్యతబు ఆర్, ఎన్. తుమ్మల కు కప్పగించి వెళతాడూ. ఆ తుమ్మల సతీమణి అయిన నీరజ అతనికి అన్ని ప్రదేశాలు చూపించి తల్లి లా ఆదరించి , కూతురులా అభిమానింఛి ఆతిధ్యమిస్తుంది. ఆమె ఆతిధ్యానికి పొంగిపోయిన మల్లారెడ్డికి నీకోసం నేను ఏదయినా చేస్తాను ఏం కావాలో చెప్పమ్మా అంటాడు. ” ఏం లేదు బాబాయ్ నేను చెంచునాయుడి గారి కోడలి అక్కను. ” అని అసలు చిషయం చెప్పి కక్షల వల్ల కలిగే నష్టాన్ని వివరించి ఫోన్ ద్వారానే అటు నాయుడికీ, ఇటు ఈ రెడ్డికీ సయోధ్య ఏర్పరచడంలో నీరఝ కృతకృత్యురాలవుతుంది. ఆర్.ఎన్.తుమ్మల అంటే రమచంద్రానాయుడూ నే తుమ్మలగా గురించి వారి ఆదరాభిమానాలతో మంచి మనిషిగా మారిపోతాడు మల్లారెడ్డి. రాయలసీమలోని ఫ్యాక్షన్ కుటుంబాలలోని స్త్రీలందరూ నీరజలాగానే ఆలోచిస్తే ఇక కక్షలకు తావెముంటుంది. ఈ విష్యంలో అటు కొండారెడ్దొ కూతురు, ఇటు రామచంద్రనాయుడీ భార్య నీరజ మంది స్ఫూర్తి దాయకమైన పాత్రలుగా నిలుస్తాయి. ఆడదాని అంతర్యాన్ని అంతర్ధం చేసుకోవడం బ్రహ్మతరం కూడా కాదన్న మాట అర్థం లేనిది. ఎందుకంటే ఆడవాళ్లు చాలా విషయాల్లో గుమ్మనంగా వుంటారు. అలా వుండడం వాళ్ళ సహజ లక్షణం. అలాంటి ఆడవాళ్ళ అంతరంగాన్ని ఆ విష్కరించిన కథ “అక్కయ్య అంతరంగం”. ఇందులో జానకీ, అక్కాయ్య పాత్రలు ప్రధానంగా కథ నడుస్తుంది.రాజారాం కథల్లో ఎక్కువగా కనిపించే పాత్ర పేరు జానకి. ఈ కథలోనూ తన భర్తను వాళ్ళ అక్కయ్య ఉన్న ఫలంగా రమ్మని ఉత్తరం రాస్తే సాయంకాలం బయలు దేసి రెండు రోజులు వుండి వస్తానంటాడూ జానకితో . “మీ అక్కయ్య జాబు రాయడమూనూ, మీ రు వెళ్ళకపోవడమూనూ అని నిష్టూరాలాడుతుంది జానకి. పోనీ నువ్వు రా, వెళ్ళొద్దాం అంటాడు పెనిమిటి . అందుకు జానకి ‘నన్ను రమ్మని వ్రాయలేడుగా ‘ అని చెప్పి “రమ్మనకపోతే వెళ్లము. పొమ్మనే దాక వుండము మర్యాదిస్తే పుచ్చుకుంటాం . లేకపోతే మీకూమాకూ పొత్తు కుదరదంటాం ” అని మీ అక్కయ్యకు చెప్పమని పదే పదే కోరుతుంది. అక్కయ్యింటికి వెళ్లగానే అక్కయ్య తెలిసిన వళ్ళ పెండ్లికి తమకు మారుగా, మేనల్లుడిన గోపినె తీసుకుని వెళ్ళి , ఆ పెళ్ళికి వచ్చే అమ్మాయిల్లో మంచివాళ్ళను చూసి గోపికి సంబంధం చూడమని పంపిస్తుందతన్ని . తీరా అక్కడికి వెళ్ళాకా గోపీ ప్రేమ రహస్య్మ్ చెప్పగానే హతాసుడిఅ , తిరిగివచ్చింతర్వాత అతనికి బుద్ధి మాటలు చెబుతూ ఉత్తరం రాస్తాడూ తను. దానికి గోపీ తన తప్పు తెలుసుకుని ప్రత్యుత్తరం కూదా ఇస్తాడు. కానీ ఆ ఉత్తరంలో తనకు తన తల్లి రాసిన ఉత్తరం కూడా పెట్టిపంపుతాడు. అందులో అక్కయ్య అంతరంగాన్ని పట్టించే వాక్యాలు ఒక్క అక్కయ్యెవేకాదు. ప్రతి తెలుగు ఆడపడుచువి. పుట్టింటిపైనా, అన్న్దమ్ములపైనా , వారి పిల్లలపైనా ప్రతి ఆడబిడ్డ కూ వుండే అతి సహజమైన , ప్రేమ్ మమకారం . ఇంకా చెప్పాలంటే ఆశలు కూడానూ. తల్లికొడుక్కి తన తమ్ముడు తన కూతుర్ని తనకు కోడలిగా చేసుకోవలన్న తలంపుతో పెళ్ళి సంబంధాలు చెడగొడుతూన్నాడనీ యింకా ఏమోమో రాసి తన అంతతంగాన్ని ” గోపీకి మన శారదనే చేసుకోవాలి అక్కయ్య అంటే నేను కాదంటానా ! వాడి సంగతి అలా వుండనీ, ఆడపిల్లను కని యింట్లో పెట్టుకున్న మీ అత్తయ్య కంత బెట్టెందుకు ? ఇంట్లో పిల్లలెవరూ లేదు. ప్రొద్దుగడవడం దుస్తకంగా వుంది . శారదను నాదగ్గరుంచుకుంటాను అంటే మా బిడ్డ మాకేమ్ బరువు లేదులే వదినా అంటుందా! ఎప్పుడాఇనా అక్కడికి రావల్స్సిందిగదా . అంటే అబ్బో , మహరాజులు మీరెక్కడ మేమెక్కడ అని నంగనాచితనం ఒలకబోస్తుందా !” అని తన అంతరంగాన్ని విప్పుతుంది .అంతే గాక జానకిలాగే మీ అత్తయ్య , మీ మావయ్య మీరందరూ ఒకరు . చివరికి నేనొక తేనె యిలా వేరు పడిపోయాను”అంటూ ఉత్తరం ముదించింది. అది చదివి జానకి ” ఎలాగైనా మీరండరూ ఒకటి !నేనే వేరు ” అంటూ బాధ పడుతుంది. అక్కయ్య అదే మాట జానకీ అదే మాట అనేసరికి అతనికి బుర్ర తిరిగిపోతుంది . నిజానికి ఇక్కడ జానకి, అక్కయ్యల నిష్టూరాలు. నిజమైన కావు. అవి ఆప్యాయతలతో కూడూకున్న నిష్టురాలు . మమతలతో కూడుకున్న మాటలు. పుట్టింటిపైన ఆడబిడ్డలకి , మేనరికంపైన వదినలకి వుండె ప్రేమానురాగాలకు ఈ రెండు పాత్రలు నిలువెత్తు సాక్షాలు.
ఎన్ని సమస్యలొచ్చినా, ఎన్ని ఆటూపోటులెదురైనా తని అనికున్నదు సాధించి పరిస్థితుల్ని ధైరయంగా ఎదుర్కోనె తెలివైన పాత్ర సబల లోని విశాల పాత్ర. తను తన భర్త రామారావు ఏర్పాటుచేసిన విందు భోజనానికి వచ్చిన మేష్టారుతో తన కథను చెప్పుకుంటుంది విశాల. తన కోసం ప్రాణాలర్పించడానికి ప్రయత్నించిన రామారావునే ఏరి కోరి పెళ్ళి చేసుకుంది విశాల. ఆ కోపంతో తన తండ్రి , సవతి తల్లి ఆమెను శత్రువులాగానే భావింఛారు. పైగా తన పేరున వున్న ఆస్థి కోర్టు కెక్కుతుంది. ఆమె అందమూ, వెనకనున్న ఆస్థిని చూసి ఆమెను చేసుకుంటామని పెద్దపెద్ద వా ళ్ళే ప్రపోజల్స్ తెస్తారు. అన్నిటినీ తిరస్కరిస్తుంది విశాల . చిన్నప్పటినుంచీ తల్లి తంద్రుల ప్రేమ కునోచుకోని విశల తన కోసం బతికే మనిషి కోసం ఎదురు చూస్తుంటుంది. కోర్టులొ వ్బున్న కేసును వయోవృద్ధుడైన వెంకటనరసయ్య దీనా వస్థను చూసి కేసు విత్ డ్రాసేసుకుని తండ్రికీ మారుతల్లికీ మరింత శస్త్రువుగా భావించబడి మరింత ద్వేషానికీ గురవుతుంది చివరికి నదిలో దూకిన విశాలను అంతకు మునుపు తనని ఇష్టపడ్డాడని ప్రాణాత్యాగనికిసిద్ధపడిన వ్యక్తి కాపాడితే అతన్నె పెళ్ళి చేసుకుంటుంది. కానీ మాటల సంధర్భంలొ తనౌ ఈత బాగా వచ్చునని మేష్టారికి చెప్పి మొక్తాయింపుస్తుంది విశాల.
ఒక అనాధ పిల్లల వాఘిరాను సొంత కూతురిలా ఆదరించిన స్త్రీ మూర్తి వసంత పాత్ర వాఘిరా అనే కథలో వుంది తన చిన్నారి కూతురి స్నేహితురాలైన వాఘిరా తల్లి దండ్రుల వివాహం కాకనే కలసివుండి కన్న బిడ్డ . తల్లి వాఘిరాని తన తండ్రి కే వదిలేసి వేరే వివాహం చేసుకుని వెళ్ళిపోతే మరో ఆడదాన్ని పెళ్ళి చేసుకుంటాడు తండ్రి. పె ళ్లయిన తర్వాత ఆమెనిక అనాధ పిలలాగానే నిరాదరించిన విషయం తెలుసుకుని , ఆమె తల్లి దగ్గరనుంచీ అనుమతి తీసుకుని తన రెండో ఊతురిగా పెంచుకుంటుంది వాఘీరాని వసంత. దానికి కారణం చిన్నప్పుడూ తాను సవతి తల్లి పోరు అనుభవించి వుండడం ఆమెనలా కరుణామూర్తిగా మార్చినట్లు ఒక Phycological sapect లో వసంత పాత్రను దిద్ది తీర్చాడు రాజారం.
మధురాంతకం రాజారాం విదేశీవనితల పాత్రల్ని కూడ అతి సహజంగా చిత్రించి స్త్రీ మనస్తత్వాన్ని ఎంతో నిజాయితీగా ఆవిష్కరించిన సందర్భమూ లేకపొలేదు. “మిస్ ఎమరాల్డ్ ఫ్రమ్ ఫ్రాన్స్” అనే కథలో మన ఇందియాలో లాగా సంటిమెంట్స్. మానవ సంబంధాలూ పరిష్టంగా లేని ప్రాన్స్ యువతల మనస్తత్వం.. ప్రేమ కోసం, ఒక మంచి మాట కోసం పరితపించే ఆదేసపు యువతకు ప్రతీకగా దిద్దిన పాత్ర ఎమరాల్ద్శ్ పాత్ర, ఎమరాల్డ్ యుక్తవయసులో వున్న తల్లి ఒక పురుషుడికి తనను కని, ,మరొకర్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి అనాధలా మారిన ఎమరాల్డా ప్రభుత్వ సహయంతో చదువుకుని, భారత దేశంలోని దేవాలయాపైన, ఫిలాసఫీపైన పరిసోధన్ చేయడానికి వచ్చి, తనకు తోడుగా వుండి, తను అసహ్య్ంచుకున్నా తనను వదలకుఇండా ప్రేమించిన ఇండిఅయా అబ్బాయినే పెండ్లి చేసుకుని ఇక్కడే స్థిరపడిపోతుంది.
ఈనాడూ.. ఎన్నో త్యాగాలు చేసి బిడ్డల్ని పై చదువులు చదివించి, తమకంటే మంచి స్థాయిలో తమ బిడ్డలుండాలని , సుఖంగా జీవించాలనేఎ ప్రతి తండ్రి ఆరాటపడుతుంటారు. కానీ వారి ప్రేమను , త్యాగాల్ను తృణీకరించి వాళ్ళ కష్టార్జితాలను తాము సొంత హ క్కుదారులమని దర్జాగా అనుభవించి పైకొచ్చి కన్న వాళ్లను నిరాదరించే బిడ్డ్ల్ని కోకొల్లల్ని చూస్తుంటాం.తల్లి పాలు పెరుగు అమ్మి సంపాదించడంతొ దర్జాలు వెలగబెడుతూ ఆ డబ్బులతోనె పట్నంలో బాగా చదివి ఉద్యోగంలో స్థిరపడ్డాక తల్లిని మరిచి పోతాడు మ్ ఉరళీకృష్ణ. అయినా అతని కోసమే ఆరాటపడుతూ వృద్ధాప్యంలోను చల్లలమ్ముతూ బతుకుతుంటుంది అతని తల్లి అయిన తులసమ్మ వగపేటికి చల్లచిందినక కథలో పెద్దిందిటి అమ్మాయిని పెళ్ళి చేసుకుని ఇక్కరికం వెళ్ళిన మురళాకృష్ణ తన తల్లి పాలు పెరుగు అమ్మి బతుకు తుండడం అత్తగారికి నామోషీనని, ఆ పట్నంలో ఎక్కడా చల్లలమ్మకుండా చేశ్తాదు. చివరికి అతని స్నేహితుడిన మేష్టారు ఒకరోజు సైకిల్లో పట్నం సివార్లల్లోని ఈ సందులొ వస్తుంటే తలపైన చల్లకుండలు పెట్టుకుని వస్తున్న వృద్ధురాలిని ఢీ కొంటాడు. కడవలు పగిలి పాలు పెరుగు నేల్పాలైన పోయి, పడివున్న వృద్ధురాలిని తులసమ్మగా గుర్తించి ఎంతో బాధకు గురౌతాడు.
ఏ తల్లయినా బిడ్డలు పస్తుంటె చూడలేనిది. పరాయిబిడ్దలయినా సరే. అలాంటి కరుణా హృదయమైన స్త్రీమూర్తికి మరో ఉదాహరణ’రాతిలో తేమ’ కథలోనిరెడ్డిసాని. ఆ ప్రాంతానికికంతా పెద్ద పోతురాజులాంటివాడు రెడ్డిరి పెద్ద సిద్ధారెడ్డి. అతనా ప్రాంతానికి మకుటంలేని మహారాజు అలాంతి మహారాజు తన గుండాలమిట్టలోని శనిగచేన్లొ పడి జోగలోళ్ళపందులు పంటనష్టం చేస్తే తన మనుషుల్ని పంపి వాళ్ళ గుడిసెల్ని న్ ఏల మట్టం చేయిస్తాడు . దాంతో గూడ్ంఎలోని జోగోలోళ్ళు పిల్లా పాపల్తో రెడ్డోరి మాహాడీగేటుముందర బైటాఅయిస్తారు. రెడ్డిసాని కింద కిటికీ నుంచీ వాళ్ళని సూచి పోతూవుంటుంది . చివరికి ఆ రోజు ఎండలో బిడ్డల్తో సహా ఆకల్తో తల్లదిల్లి సొమ్మసిల్లి పోయివుంటారు. అది చూసి చలించి పోయిన రెడ్డిసాసి ధైర్యం చేసి పై అంతస్థులొని రెడ్డి దగ్గరకు వెళ్ళి కొన్ని బుద్ధి మాటలు చెప్పి వచ్చి అందరికీ వంటవండించి భోజనాలు పెట్టిస్తుంది. దాంతో కరుడూ గట్టిన రెడ్ది పాషాన హృదయంలో కరుణ జాలువారి ….వాళ్లకందరికీ తన సొంత పొలంలో పక్కా యిండ్లు కట్టించడానికి పూనుకుంటాడు. ఈ కథలో దయా జాలి ఏ కోశానా లేని తన రెడ్డి మనస్సును రమణారస తరంఘిణి గా మార్చిన ఘనత రెడ్డిసానిదే మరి.
చాలామంది “మగవాళ్ళు…..భార్యల్ని తమ ముంజేతి రామ చిలుక గ భావిస్తారు. మంచిదే . కానీ వాళ్ల కోసం తాము సృష్టించిన పెట్టినవి బంగారు పంజరాలని ఎందుకు గ్రహించరు ? “. ఈ మాటల సారాంశంమంతా ఇముడ్చుకుని సాగిన బంగారు పంజరం లోని కథలో పంజరంలో రామచిలకలాగానే జీవిస్తుంటుంది సత్య అనే స్త్రీ తన భర్త తనను బాగానే చూసుకుంటాడు గౌరవిస్తాడు. కానీ ఏ నాదూ పుట్టింటికి పోనీడు .కారణం వాళ్ళ ఆర్థిక స్తోమత ఆలుడికంటే తక్కువైనది. సత్య తల్లిదండ్రులు ఆడపిల్లలు గలవారు .అందరికీ పెళ్లిళ్ళి చేసి వట్టిపోయిన గొడ్డులా అయిపొతారు. అయినా అల్లుళ పెట్టిపొతలకు లోటురానీరు. ఆ ఏడు దీపావళికి భర్తను తీసుకుని తప్పక రమ్మని తండ్రి ఉత్తరం రాస్తూ విడిది తన యింట్లో గాక దగ్గరలొనే ఓ మంచి హోటల్లో ఏర్పాటు చేస్తానని రాస్తాడు. దాంతో సత్య భర్త సరేనని సత్యతో బాటూ వెళ్లి హోటల్లో దిగి అత్తింతి మర్యాదలన్నీ అనుబహ్వించి వస్తాడు. కానీ ఆ తర్వాత కొద్దిరోజులకి నాన్న స్నేహితుడిన పరంధామయ్య స్వారా ద్వారా టవున్లో యిల్లు అమ్మేసి నీ తల్లిదండ్రులు పల్లెకు వెళ్ళిపోయారన్న విషయం తెలుసుకుని హతాసురాలైపోతుంది సత్య. అందుకే తన ఇల్లు తనకు ఏ మాత్ర స్వేచ్ఛ నివ్వని బంగారు పంఅజంరంగానే అనుకుంటుంది.
ఈ నాడు రాజకీయాలు పట్నాలనేగాక పల్లెలను కలుషితం చేసేశ్తున్నాయి. ఓట్ల కోసం నాయకులెప్పటికప్పుడూ కొత్త ఎత్తు గడలతో అమాయక ఓ టర్లను పావులుగా చేసుకుని కొత్త జూదాలు ఆడుతుంటారు… ఆ జూదంలో నాయకుల మెప్పుకోదం కుటుంబాలను నా/శనం చేసుకుని, తన వాళ్ళ కు దూరమయ్యే అమాయకులూ, తనమనుగడ ఎంత పనికిమాలిన వెధవైనా సరే …ఫలానా లీడర్ అనిపించుకోవడం గొప్పగా భావించుకునే ఆడకుఉళ్ళు పల్లెల్లో సహజంగా కనిపించే వ్యక్తులు. సరిగ్గా అలాంటి అమాయకుడు మహిళామణులకుఇ ప్రతీక్ ‘రాణీ సాహెబ్ రంగయ్యమ్మారావు’ కథలోని రంగమ్మ పాత్ర..
ఎలక్షన్లో తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడం కోసం అమాయకుడైన వెంకతేసును మెంబరుగా పెట్టి నామినేషన్ వేయిస్తాడు చెంచునారాయణప్ప. అది గమనించి నారాయణప్ప ప్రత్యర్థి హనుమంతప్ప అతన్ని రహస్యంగా తీసుకెళ్ళి సారా తాపించి రోజూ బిరియానీలు, ఏం కావలిసివస్తే అవి ఏర్పాటు చేసి నెలపాటు బాగా చూసుకుని, అతన్ని ఉపయోగించుకుని వదిలేస్తాడు. అంటవరకు కూలీనాలీ చేసి సంసారాన్ని ఈ దిన రంగమ్మ కు ముఖం చూపించలేక్ ఆమెలేనప్పుడొచ్చి అన్నంతిని నామోషిపడుతుంటే రంగమ్మ “ఎందుకయ్యా నామోషి… నిన్ను నేనేమీ అనను. మెంబరు వెంకటేశు భార్య ననిపించుకోవడమే నాగొప్ప… నువ్వింట్లొనే కూకో .నేను కూచో బెట్టిసాకుతాను అంటూ అతన్ని తిరిగి తన పంచన చేర్చుకుంటుంది. పేరుగొప్ప కోసం ఎంత కష్టాన్నైనా భరించగల రంగమ్మ ఆ సమయంలొ ఎంకటేశుకు ‘రాణీ సాహేబ్ రంగాయమ్మారావు!’ లా అనిపిస్తుంది మరి.
ఇలా రాజారాం కథల్లొ ఇంకా బిడ్డలకోసం కువైట్ వెళ్ళి తను కొవ్వొత్తిలా కాలిపోతున్న ‘కేసేట్ ‘ ద్వారా భర్త కు బిడ్డకు ధైర్యవచనాలు చెబుతూ ‘శబ్ద సందేశం ‘ పంపే శ్త్రీ, గతకాలపు వైభవచిహ్నాన్ని కాపాడుకోవడానికి తంటాలు పడే ముసుగు నాగమ్మ మహడీ లోని ఉన్నత వర్గపు స్త్రీ, ఈ రాయలసీమ ప్రాంతలో కన్న కష్టాలు పడి బిడ్డల్ని ప్రయోజకుల్ని చేస్తే, ఆ బిడ్డల్ని కట్నం పేరుతో తన్నుకుపోయి కన్న వాళ్ల కు అతన్ని దూరం చేసే అడారి కోయిల కథలొనొ ధనవంతుల ఆడబిడ్దలు వంటి పాత్రలేన్నో కనిపిస్తాయి. చివరికి జానపద కథల్లో కథానాయకుడికి సహాయపడే’ పేదరాసిపెద్దమ్మ ‘పాత్రను allegery లో అద్భుతంగా చిత్రించిన వైనంకూడా రాజారాం కథల్లొ కనిపిస్తుంది.
ఇలా రాజారాం కథల్లో ఎన్నో స్త్రీ పాత్రలు మనల్ని పలకరించినట్లు వుంటాయి. మనతో కలిసి జీవింవినట్లు వుంటాయి. మనల్ని సుతిమెత్తగా మందలించి , ప్రేమానురాగాల్ని పంచిపెట్టి అనుబంధాలతో అల్లుకుపోయినట్లు అనిపిస్తాయి. ఎందుకంటే అవి సమాజంలొనుంచీ తీసుకోబడిన పాత్రలే. ఒక్క మాటలో చెప్పాలంటే మన చుట్టు వున్న స్త్రీ రాజారాం కథల్లో విభిన్న రూపాల్లోకి , పేర్లలోకి పరకాయప్రవేశం చేశాయి అంతే.

No comments:

Post a Comment