నందమూరి బాలకృష్ణ కధానాయకునిగా పరచూరి మురళి దర్శకత్వంలో రూపొందనున్న సినిమా షూటింగ్ రెండవ షెడ్యూల్ సోమవారంనాడు ప్రారంభమైంది. శ్రీ కీర్తి కంబైన్స్ పతాకంపై ఎం.ఎల్.పద్మకుమార్ చౌదరి నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ...'బాలకృష్ణ పర్సినాలిటీకీ తగ్గ కథనంతో తెరకెక్కుతోంది. అభిమానులను రంజింపచేసే అన్ని అంశాలకూ ఇందులో పెద్ద పీట వేస్తున్నాం. దర్శకుడు పరుచూరి మురళి గతంలో పెదబాబు, ఆంధ్రుడు చిత్రాలు తీశారు. కళ్యాణీమాలిక్ సంగీతం, విజరు సి.కుమార్ ఛాయాగ్రహణం ఆకట్టుకునేవిధంగా ఉంటాయి. సినిమా పూర్తయ్యేవరకూ నిరవధికంగా షూటింగ్ చేస్తాం. ఈనెల 24 నుంచి వైజాగ్‌లో చిత్రీకరణ చేయబోతున్నాం. అక్కడ వేసిన సెట్‌లో సుమారు నెలరోజులు కీలక సన్నివేశాలు చిత్రీకరణ జరుపుతాం. తొలి షెడ్యూల్‌లో రామ్‌లక్ష్మణ్ నేతృత్వంలో ఫైట్స్, కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాం' అని తెలిపారు.
జయసుధ, కోటశ్రీనివాసరావు, బ్రహ్మానందం, చరన్‌రాజ్, ఎమ్మెస్ నారాయణ, వేణుమాధవ్, ఆదిత్య మీనన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, సమర్పణ: సందీప్.
No comments:
Post a Comment