
2003లో విడుదలైన ‘జిస్మ్’ ఓ సంచలనాత్మక చిత్రం. 100 ప్రపంచవ్యాప్తంగా అత్యంత శృంగార సినిమాలలో ‘జిస్మ్’ 92వ చిత్రంగా నిలిచింది.
పూర్తిగా అక్రమ సంబంధం నేపథ్యంలో చిత్రీకరించిన ‘జిస్మ్’ చిత్రానికి ప్రేరణ 1944లో విడుదలైన ‘డబుల్ ఇన్‌డెమ్నిటీ’, 1981లో విడుదలైన ‘బాడీహీట్’ ఆంగ్ల చిత్రాలే. ఇక ఆ చిత్రంలో నటించిన జాన్‌అబ్రహం, బిపాసాబసులు రెచ్చిపోయి శృంగార సన్నివేశాలలో నటించిన సంగతి ప్రేక్షకులకు విదితమే. ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్లకు ఆ చిత్రం సీక్వెల్ తీసేందుకు ప్రయత్నాలు ఊపందుకున్నాయి. అయితే ఆ చిత్రంలో అప్పట్లో బిపాసాబసు నటించగా ఇప్పుడు ఈ సీక్వెల్ చిత్రంలో మల్లికను నాయికగా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
No comments:
Post a Comment