వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రాల సంఖ్య బాలీవుడ్‌లో పెరుగుతోంది. సంచలనం సృష్టించిన మోడల్ జెస్సికాలాల్ హత్యోదంతం నేపథ్యంలో తెరకెక్కిన 'నోవన్ కిల్డ్ జెస్సికా' చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. విద్యాబాలన్, రాణీముఖర్జీ ప్రధానపాత్రలు పోషించారు. చిన్న బడ్జెట్‌లో రూపొందిన ఈ సినిమా బాక్సీఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అనతికాలంలోనే చక్కటి వసూళ్లను సాధించింది. విద్యాబాలన్ ఈ విజయాన్ని ఆస్వాదిస్తోంది.
పా, ఇష్క్ చిత్రాలతో మంచి నటిగా గుర్తింపు పొందిన విద్యకు నో వన్ కిల్డ్ జెస్సికా కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది. జెస్సికా సోదరి సబ్రీనా పాత్రను పోషించిన విద్య తెరపై చక్కటి హావభావాలు పలికించింది. ఇలాంటి పాత్రల విషయంలో మీరు తీసుకొనే జాగ్రత్తలేమిటని అడిగితే...'ప్రాథమికంగా నేను కథ, అందులోని నా పాత్ర తీరుతెన్నులను నిశితంగా పరిశీలిస్తాను. కథ విన్నాక ఆయా పాత్రల్లోని గుణగణాలను తీసుకొని నేటి సమాజానికి అనుగుణంగా మార్పులు చేసుకొంటా'నని చెప్పుకొచ్చింది. ఒక పాత్రలో నటించేప్పుడు విద్య చాలా హోంవర్క్ చేస్తుందంట !
No comments:
Post a Comment