Thursday, February 24, 2011

మద్దెలచెర్వు సూరి హత్య తర్వాత తెరవెనుక దాగి ఉన్న నిజాలు

మద్దెలచెర్వు సూరి హత్య తర్వాత తెరవెనుక దాగి ఉన్న నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆయన హత్యకు గురి కాకుండా ఉండి ఉంటే సినిమారంగంలో పాతుకుపోయేవారని విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ఆయనకు సంబంధించిన రౌడీలు ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌లో 75వేల రూపాయల మెంబర్స్‌షిప్‌తోనూ, కొంతమంది నిర్మాతల మండలిలో మెంబర్లుగా నమోదు అయ్యారని తెలిసింది.
ఈ విషయమై ఓ నిర్మాత చెబుతూ... వారందరి మెంబర్‌షిప్స్‌పై పరిశీలన జరుగుతుందనీ, వారికి ఫేవర్‌‌గా ఎవరు సంతకాలు పెట్టారో వారిపై దృష్టి సారిస్తున్నామని అన్నారు. ఆదివారంనాడు జరిగిన మీటింగ్‌లో ఛాంబర్‌ ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు తెలిసింది.

సినిమాల్లో రౌడీలుగా నటించేవారిని చెన్నైనుంచి తెప్పిస్తున్నారు. ఆ అవసరం లేకుండా ఇలాంటి వారితోనే పనిచేయిస్తే... చెన్నైవారి ఆటలు కట్టించవచ్చనే టెక్నిక్‌తో తెచ్చినట్లు తెలిసింది.

No comments:

Post a Comment