ఫీజు రీఎంబర్స్‌మెంట్ పథకానికి సంబంధించిన పూర్తి నిధులు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని, విద్యార్థుల భవిష్యత్ కాపాడాలని డిమాండ్ చేస్తూ యువనేత జగన్ గత ఏడు రోజులుగా చేస్తున్న నీరాహార దీక్షను గురువారం సాయంత్రం 5 గం||లకు విరమించారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న వరలక్ష్మీ తల్లి లక్ష్మమ్మ ఇచ్చిన నిమ్మరసం తాగిన జగన్ దీక్ష విరమించారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొనసాగుతున్న గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరిపించడానికి ఏడురోజుల పాటు నిరాహార దీక్ష చేసినట్లు చెప్పుకొచ్చారు. ప్రతి పేద విద్యార్థి చదువు కోవాలన్న లక్ష్యంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరెడ్డి ఫీజు రీఎంబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారని, ఇలాంటి పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు.
ఫీజు చెల్లించి లేకనే వరలక్ష్మి ఆత్మహత్య చేసుకుందన్నారు. ప్రభుత్వం అలక్ష ధోరణితో 25 లక్షల పేద విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీఎంబర్స్‌మెంట్ పథకానికి బడ్జెట్‌లో అత్తెపరు కేటాయింయింపులు చేసి చేతులు దులుపుకోవడం తను కలిచి వేసిందన్న జగన్.. మావతా దృక్ఫథంతో ఈ పథకానికి నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. లేకుంటే విద్యార్థుల కోసాగ్నిలో ప్రభుత్వం కొట్టుకుపోతునతుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొనసాగుతున్న గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరిపించడానికి ఏడురోజుల పాటు నిరాహార దీక్ష చేసినట్లు చెప్పుకొచ్చారు. ప్రతి పేద విద్యార్థి చదువు కోవాలన్న లక్ష్యంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరెడ్డి ఫీజు రీఎంబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారని, ఇలాంటి పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు.
కాగా.. ఏడు రోజుల పాటు కేవలం నీళ్లు మాత్రమే తాగుతూ దీక్ష చేసిన జగన్, దీక్ష విరమించగానే బెడ్డుపై నుంచి హుషారుగు లేవడంతో పాటు, ఎప్పటిలాగే తన దైనసశైలిలో పుల్‌జోష్‌తో ప్రసంగాచారు.
మామూలుగా వ్యక్తులు మూడు రోజులు తినకుంటేనే మాట్లాడే ఓపికను కోత్పోతారు. అలాంటప్పుడు ఏడు రోజులు ఏమీ తినకున్నా ఇదెలా సాధ్యం అంటున్నారు. జగన్ చూసిన చాలా మంది. జగన్ ఏమీ తినకపోవడం నిజమే అయినా.. ఆయన తాగే వాటర్‌లో తిండికంటే శక్తివంతమైన ద్రవాలు కలిపి ఇచ్చారని కొందరు, ప్లూయిడ్స్ తీసుకోవడం వల్లనే జగన్ నీరసించకుండా ఉన్నారని మరికొందరు అంటున్నారు.
ఇక్కడ తింటూ దీక్ష చేశారా? తినకుండా చేశారా? అనేది అంత ముఖ్యమైన విషయం కాకున్నా.. ఇప్పటికే కొందరు నేతల వల్ల నిరహార దీక్షలు విలువ లేకుండా పోయింది. ఇలాంటి నేపథ్యంలో యువనేతలు ప్రజల అభిమానం ఉన్న నేతలు కూడా అపహాస్య ధోరణిలో దీక్ష చేయడం సరికాదని, నీతిగా చేస్తే మరింత గుర్తింపు వచ్చేదంటున్నారు.
No comments:
Post a Comment