భూమిక తన భర్త భరత్‌ఠాకూర్‌కు విడాకులివ్వబోతున్నదంట’ అని పుకారు షికారు చేయడం, దానిని వెంటనే భూమిక ఖండిచడం తెలిసిందే.ఇది జరిగిన రెండో రోజే నయనతార ఇక సినిమాల్లో నటించదంట అనే మరో గాలివార్త చక్కర్లు కొట్టింది. వివాహానంతరం నటించొద్దని ప్రభుదేవా ఆదేశించినందున ‘శ్రీరామరాజ్యం’ ఆమె నటించే చివరి చిత్రం అవుతుందని ఆమె ప్రమేయం లేకుండానే ఓ ప్రకటన వెలువడిపోయింది. దాంతో ఎప్పుడూ మీడియాతో మొహమాటానికైనా ముచ్చటించని నయనతార మీడియా ముందుకొచ్చి లబోదిబోమంటూ ఆ వార్తను ఖండించింది. ఇది జరిగిన రెండో రోజే..త్రిష పెళ్లి వార్త తెర మీద కొచ్చింది. చెన్నయికి చెందిన ఓ ప్రముఖ యువ వ్యాపారవేత్త త్రిష అంటే పడి చస్తున్నాడని..
త్వరలోనే అతనితో త్రిష పెళ్లి జరగనుందని వార్తలు వచ్చేసాయి. తను స్నానం చేస్తున్నట్లుగా ఒక కల్పిత వీడియోను ఇంటర్నెట్‌లో ఉంచినప్పుడు కూడా త్రిష ఇంత కంగారు పడలేదు. ఆదరాబాదరా.. ఈ పెళ్లి వార్తను ఖండిం చేసింది. నిజమని ఎవరైనా నమ్మితే, తన సినిమా చాన్సులకు భంగం కలుగుతుందనే భయమే ఇందుకు కారణం. ఈ విధంగా నాలుగైదు రోజుల వ్యవధిలో ముగ్గురు ముద్దుగుమ్మలపై పుకార్లు రావడం, వాటిని వారు ఖండించడం సహజంగానే అందరి దృష్టినీ విశేషంగా ఆర్షిస్తోంది!
No comments:
Post a Comment