Monday, February 7, 2011

కాజల్‌, ప్రభాస్‌లు వివాహం చేసుకుంటున్నారు

సినిమా హీరోహీరోయిన్లు నిజజీవితంలో జోడీగా ఉండటం జరుగుతూనే ఉంది. లేటెస్ట్‌గా కాజల్‌, ప్రభాస్‌లు వివాహం చేసుకుంటున్నారనే వార్తలు ఫిలింనగర్‌లో గుప్పుమన్నాయి. గతంలో కోలీవుడ్‌లో సూర్య, జ్యోతిక హిట్‌పెయిర్‌‌లా ఎలా చెప్పుకునేవారో ఇప్పుడు టాలీవుడ్‌లో వీరిద్దరినీ చెప్పుకుంటున్నారు.
డార్లింగ్‌ షూటింగ్‌లో సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందిట. ఆ ప్రేమ దినదినం వృద్ధి చెందుతూ పాకాన పడిందని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. షూటింగ్‌లో వీరి ప్రవర్తన చూస్తుంటే ప్రేమలోకంలో పీకల్లోతు కూరుకుపోయినవారు ఈ లోకంతో పనిలేనట్లుగా ఎలా ఉంటారో అలా ఉంటున్నారట.

అంతగా ప్రేమ ముదిరిపోవడంతో వీరిద్దరు త్వరలోఒక్కటి కానున్నట్లు సమాచారం.

No comments:

Post a Comment