Thursday, February 24, 2011

బరితెగింపు

తమిళమ్మాయి అసిన్‌..అందాల ఆరబోతకు రంగం సిద్ధం చేసిందా? త్వరలోనే బికినీతో మత్తు చల్లనుందా?..అంటే..అవుననే సమాధానం వినవస్తోంది బాలీవుడ్‌లో. అమీర్‌ ‘గజని’తో ఉత్తరాది తెరపై సూపర్‌ సక్సెస్‌ సాధించిన అసిన్‌..అటుపై పెద్దగా విజయాలు దక్కక రేసులో వెనుకబడింది. ఒకటీ అరా అవకాశాలు వచ్చినా..మితిమీరిన ఎక్స్‌పోజింగుకి అభ్యంతరం చెప్పడంతో ఛాన్సులు మిస్సయ్యాయి. దాంతో ఇప్పుడు రూటుమార్చి ఏకంగా బికినీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది.
సాజిద్‌ నడియావాలా ‘హౌస్‌ఫుల్‌ 2’ చిత్రంలో అమ్మడు హాట్‌హాట్‌గా నటించడానికి రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఇదే దర్శకుడు రూపొందించిన ‘హౌస్‌ఫుల్‌’కి ఈ సినిమా సీక్వెల్‌. తొలిభాగంలో అక్షయ్‌కుమార్‌, రితేష్‌ దేశ్‌ముఖ్‌ హీరోలు కాగా, దీపిక పదుకొనె, జియాఖాన్‌, లారా దత్తా నాయికలుగా అందాల ఆరబోతతో కనువిందు చేశారు. తాజా సినిమాలో ఓ హాటీ రోల్‌లో అసిన్‌ ఇప్పటికే ఎంపికైంది. దర్శకుడు సాజిద్‌ ఇప్పటికే అసిన్‌ని కలిసి బికినీ సంగతి విడమర్చినట్లు తెలిసింది. ఏదేమైనా.. చివరికి ‘రూటుమార్చి..ఛాన్సు పట్టి’ అనే పంథాలోకి అసిన్‌ కూడా చేరిపోయినట్టే!

No comments:

Post a Comment