సెక్సీభామకు ఆ వయసు రాలేదు
తనకింకా పెళ్లి చేసుకునే వయస్సు రాలేదంటోంది బాలీవుడ్ సెక్సీభామ కరీనాకపూర్. ప్రస్తుతం తనది కెరీర్ కోసం కష్టబడే వయసు తప్ప పెళ్లిచేసుకునే వయసుకాదని చెబుతోంది ఈ సుందరి. చాన్నాళ్ల నుంచి సైఫ్ అలీఖాన్‌తో సహజీవనం చేస్తున్న ఈ అమ్మడు ప్రస్తుతం తన దృష్టంతా కెరీర్‌మీదనే ఉందని చెబుతోంది. ఈమె టాప్ హీరోయిన్ అనేది బాలీవుడ్ ఎరిగిన సత్యం.తన పెళ్లిపై అపనమ్మకం వచ్చిందో ఏమోగానీ తనకు ఇప్పుడే ఆ ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. ఓ పక్క తన ప్రియిడు సైఫ్ అలీఖాన్ పెళ్లికి తొందర పెడుతున్నా ఈమె మాత్రం అందుకు ఉత్సాహం చూపించడం లేదట. కరీనా వాలకం చూస్తుంటే పెళ్లి కన్నా సహజీవనమే బెటరని అనుకుంటుందేమోనని బాలీవుడ్ జనాలు గుసగులాడుకుంటున్నారు.
No comments:
Post a Comment