Friday, February 4, 2011

కంగన విశాల ‘హృదయం’


kangana-ranau 

తెలుగులో ‘బుజ్జిగాడు’ చిత్రం ఆశాభంగం కలిగించినా, ‘కైట్స్‌’ సినిమా నిరాశపరిచినా గత సంవత్సరం కంగన నటించిన ‘వన్స్‌ అపాన్‌ ఏ టైమ్‌ ఇన్‌ ముంబయ్‌’, ‘నాకౌట్‌’, ‘నోప్రాబ్లమ్‌’ వంటి చిత్రాలతో బాగానే రాణించింది. ఇప్పుడు కూడా చేతినిండా సినిమాలతో కంగన మోము మళ్లీ కళకళలాడుతోంది. హీరో మాధవన్‌తో ఆమె నటించిన ‘తను వెడ్స్‌ మను’ విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రంలో కంగన రొటీన్‌కు భిన్నమైన పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా తన ఎదపై భాగంపై టాటూను కూడా ముద్రించుకుందట. అదంతా సినిమా కథలో భాగమేనండీ...
కంగన పేరెంట్స్‌ ఆమెకు ఓ ఇష్టంలేని ఎన్‌ఆర్‌ఐ డాక్టర్‌ సంబంధం చూస్తారు. అయితే తప్పనిసరిగా పెళ్లిచూపులకు ఒప్పుకున్న కంగన తనని చేసుకునే పెళ్లికొడుకుకు తన బాయ్‌ఫ్రెండ్‌ ‘ఆవస్థి’ పేరు ఉన్న టాటూను తన ఎదపై కనిపించేలా వేసుకుని దడిపిస్తుంది. కాగా ఈ చిత్రంలో కంగన చాలా జోవియల్‌గా బిందాస్‌ గాళ్‌గా ఫుల్‌ జోష్‌వున్న పాత్రలో నటిస్తోంది

No comments:

Post a Comment