Tuesday, March 1, 2011

గోడ దిగని (గో.పి)

స్వార్థం రాజకీయల  కోసం చంద్రబాబు అటు తెలంగాణకు గానీ, ఇటు సమైక్యవాదానికి గానీ మద్దతు పలుకకుండా... తన కింద ఉండే ఇరు ప్రాంతాం నేతలను ఆవాదాల వైపు ఉసిగొల్పుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తెలంగాణా వాదులు గోపి(గోడమిమీద పల్లి) అంటూ విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా చంద్రబాబు మరోసారి గో.పి అని నిరూపించుకున్నారు. సమైక్యవాదాం వినించే విషయమై మాజీ మంత్రి జేపీ చంద్రబాబుతో మంగళవారం ఉదయం అసెంబ్లీ లాభీలో భేటీ అయ్యారు.

సమైకాంద్రా నినాదంతో ఈ నెల 5వ అసెంబ్లీని బహిష్కరిద్దామని ఆయన బాబు వద్ద ప్రతిపాదించారు. కాంగ్రెస్‌లోని మెజారిటీ సీమాంధ్ర ప్రజాప్రతినిధులు సుముఖంగా ఉన్నరు. ఇందుకు టీడీపీ కూడా కలిసి రావాలని జేపీ చంద్రబాబును కోరారు. అయితే జేపీ ప్రతిపాదనపై చంద్రబాబు ఎలాంటి స్పందన కనబర్చలేదు.

దీన్ని బట్టే అర్థం అవుతోంది. తెలంగాణ. సమైక్య ఉద్యమాలతో రాష్ట్రం తలగలబడిపోతున్నా చంద్రబాబుకు అస్సలు పట్టడం లేదని! రాజకీయంగా నష్టం వాటిల్లుతుందనే స్వార్థంలో తన్నుకు చావండి.. చివరికి ఎవరు గెలిస్తే వాళ్లవైపే నేను అనే దురాలోచతో చంద్రబాబు ఉన్నట్లు ఆయన వైఖరి చూస్తే స్పష్టం అవుతుందని మరికొందరు విమర్శిస్తున్నారు. బాధ్యతగల ఒక ప్రతిపక్ష నేత ఈ వివాదాలును చల్లార్చే వైపు నడవాల్సిన చంద్రబాబు.. గోడమీద పిల్లి మాదిగా అదును కోసం ఎదురు చేస్తుండటం విచారకరం. కేంద్ర ప్రభుత్వమే ఈ సమస్యను సృషింటంచింది.... వాళ్లే పరిష్కరించాలని చంద్రబాబు వాదిస్తున్నారు. బాద్యత గలవాడైతే చంద్రబాబుగారికి ఏమైంది? అనేది సమైక్య, తెలంగాణ వాదాలతో సంబంధం లేని సమాన్యుడి ప్రశ్న.

No comments:

Post a Comment