Thursday, March 10, 2011

మిలియన్ మార్చ్ పిలుపునిచ్చిన కేసీఆర్ ఎక్కడ?: ఓయూ స్టూడెంట్స్ డిమాండ్

"మిలియన్ మార్చ్"కి లక్షలాది మంది ప్రజలు తరలి రావాలని చెప్పిన కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదో తెలపాలని ఉస్మానియా విద్యార్థులు డిమాండ్ చేశారు. వేదికలపై ఆర్భాటంగా హైదరాబాదులోకి చీమను కూడా తిరగనివ్వబోమని చెప్పిన కేసీఆర్ ఇంత జరుగుతున్నా మౌనాన్ని ఎందుకు పాటిస్తున్నారో తెలియజేయాలన్నారు.తాము మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మిలియన్ మార్చ్‌ని విజయవంతం చేసి తీరుతామని చెప్పారు. ఇప్పటికే ఉస్మానియా క్యాంపస్‌లో పోలీసులకు విద్యార్థులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ర్యాలీలో పాల్గొనేందుకు వెళుతున్న విద్యార్థులను అడ్డుకున్నందుకు పోలీసులపై రాళ్ల దాడి చేస్తున్నారు.

No comments:

Post a Comment