Wednesday, March 9, 2011

తెలంగాణ ఫోరం పదవికి నాగం గుడ్‌బై

తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్‌ పదవికి నుంచి తప్పుకుంటున్నట్లు సినీరయర్‌నేత నాగం జనార్ధన్‌రెడ్డి ప్రకటించారు. ఫోరంకు తాను కన్వీన్‌ర్‌గా ఉండనని గతంలోని చంద్రబాబుకు చెప్పానని. అప్పుడు ఉన్న ఒత్తిడి మేరకు తాను కన్వీనర్‌ బాధ్యతలు చేపట్టానని సృష్టం చేశారు. ఫోరంకు ఎవరు ఎన్వీనర్‌గా ఉన్నా వారి నాయకత్వంలో పని చేస్తానని తెలిపారు.
నాగం నాయకత్వంలో తాను పని చేయనని, ఆయన కన్వీనర్‌గా ఉన్నతం కాలం తాను ఫోరం సమావేశాలకు హాజరుకానని మరో టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు బహిరంగ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేథ్యంలోనే నాగం పై ప్రకటన చేశారు.
తాను బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు చేస్తునన్నాని, సొంత ప్రయోజనాల కోసం ఫోరంలోని సభ్యులను వాడకుంటున్నానని మోతుక్కపల్లి చేసిన ఆరోపణలను నాగం ఖండించారు.

No comments:

Post a Comment