తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయడానికే ప్రభుత్వం సాంబశివుడిని హత్య చేయించిదని తెలంగాణ ప్రజా ఫ్రంట్ గద్దర్ ఆరోపించారు. మావోయిస్టు మాజీ నేత, తెలంగాణ రాష్ట్ర సమితి పొలిట్‌బ్యూరో సభ్యుడు సాంబశివుడి హత్యలో పాలుపంచుకున్న దోషుల్ని వెంటనే బహిర్గత పరచాలని ఆయన డిమాండ్ చేశారు. నల్లగొండలో శనివారం రాత్రి జరిగిన ధూంధాం కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తున్న సాంబశివుడిని తెరాస కార్యకర్తలమంటూ పరిచయం చేసుకున్న కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వేటకొడవళ్ళతో దాడి చేసి హత్య చేసిన విషయం తెల్సిందే. ఈ హత్యపై తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతలందరూ ఖండించారు.
ఇదిలావుండగా, సాంబశివుడి హత్యకు ఉపయోగించిన కారును అధికారులు గుర్తించారు. ఏపీ28ఏజీ 3661 నంబర్‌గల మారుతి కారు రాజేంద్రనగర్ ఆర్టీఏలో నమోదైనట్టు ఆధికారులు వెల్లడించారు. ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో లోన్‌పై శాలీ జార్జ్ అనే వ్యక్తి మారుతీ 800 వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు సమాచారం.
ఈ కారును చౌటుప్పల్‌లోని ఓ స్కూల్ వెనుక భాగంలో వదిలి వెళ్లినట్టు తెలిసింది. ఈ కారుపై రక్తం మరకల్ని, కారులో మందు సీసాల్ని, కత్తులను కనుగొన్నట్టు పోలీసులు తెలిపారు. అలాగే, పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

No comments:
Post a Comment