Tuesday, March 22, 2011

పదేళ్ల తర్వాత త్రిష "మదర్".. నేను "మావయ్య"...


పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ తాజా చిత్రం తీన్‌మార్ ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాదులోని శిల్పారామంలో జరిగింది. ఈ కార్యక్రమం ఆద్యంతం పూర్తి ఎంటర్ టైన్మెంట్‌గా సాగింది. కార్యక్రమంలో యాంకర్‌ సుమతో కలిసి నటుడు అలీ కొన్ని చమక్కులు విసిరారు. పవన్ కల్యాణ్‌తో షూటింగ్ చేస్తున్న సందర్భంలో ఎదురైన సంఘనటనను అభిమానులతో పంచుకున్నారు. "మైసూరులో షూటింగ్ కోసం పవన్ కల్యాణ్, త్రిషతో కలిసి తను కూడా వెళుతున్న సందర్భంలో పవన్ వెంట ఓ కుర్రాడు కూడా వచ్చాడు. లిఫ్ట్‌లో ఎక్కి వెళుతుండగా ఆ కుర్రాడ్ని చూసిన త్రిష... ఈ కుర్రాడెవరూ అని అడిగింది. దానికి పవన్ కల్యాణ్ తన కుమారుడు అఖిరానందన్ అని చెప్పాడు.

త్రిష ఆశ్చర్యపోయింది. మీకు ఇంత పెద్దబ్బాయి ఉన్నాడా...? అని అన్నది. నేను ఇప్పుడు చెపుతున్నా. ఓ పదేళ్ల తర్వాత త్రిష అమ్మ క్యారెక్టర్... నేను మావ క్యారెక్టర్.. అదే పవన్ కల్యాణ్ కుమారుడు అఖిరానందన్‌కు" అంటూ ఛలోక్తి విసిరాడు అలీ. ఈ మాట విన్న త్రిష మాత్రం నవ్వాలో... సీరియస్సవ్వాలో తెలియక మూతి ముడుచుక కూచుంది. అదీ సంగతి.

No comments:

Post a Comment