Thursday, March 10, 2011

కేసీఆర్‌ అసలు విలనా?

మిలియన్‌ మార్చ్‌ కార్యక్రమాన్ని వాయిదా వేయాలనే తన ప్రతిపాదనలను తెలంగాణ జేఏసీ తోసి పుచ్చడంతో కలత చెందిన కేసీఆర్‌ గత కొన్ని రోజులుగా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.
కేసీఆర్‌ దూరం ఉండటం ఫెక్టేమోగానీ మిలియన్‌ మార్చ్‌ క్తాస్త థౌజండ్‌ మార్చ్‌ అయ్యే పరిస్తిస్థితి వచ్చింది. 

దీంతో ఖంగుతిన్న కోదండారామ్‌... కేసీఆర్‌ బ్రతిమిలాడటం మొదలు పెట్టారని సమాచారం. దీంతో కాస్త మెత్తబడ్డ కేసీఆర్‌ బుధవారం ఉదయం మీడియా ముందుకు వచ్చారు. మిలియన్‌మార్చ్‌ను విజవంతం చేయవల్సిందిగా తెలంగాణలోని అన్ని పక్షాలకు పిలుపునిచ్చారు.కేసీఆర్ గ్రీన్‌ సిగల్‌ ఇవ్వడంతో న్నిటి వరకు ముడుచుకుని కూర్చున్న టీఆర్‌ఎస్‌ శ్రేణులు కూడా ఈ ఉదయం నుంచే హడావుడి ప్రారంభంచాయి.  నిన్నటి వరకు డీలాగా ఉన్న తెంగాణా వాదుల్లో ఈప రిణామాలతో ఉత్సాహం లేచ్చొచ్చినట్లయియింది.
దీన్ని బట్టి ఒక్కటి మాత్రం స్పష్టం అవుతోంది. కేసీఆర్‌ లేకుండా కోదండరామ్‌గానీ.. తెలంగాణ జేఏసీ గానీ ఏమీ పీకలేదని! తన కాందంటే మీకు తిప్పలు తప్పవు అనే విధంగా ప్రవర్తించి కేసీఆర్‌ వైఖరి స్పష్టమైంది.
ఏదిఏమైనా ... హైదరాబాద్‌ దిగ్భదం, రోడ్లపై వంటవార్పు, చరిత్ర సృష్టిస్తాం అనే స్థాయి నుంచి.. సాధరణ ర్యాలీ, ట్యాంక్‌బండ్‌పై ఓ గంట ధర్నా స్థాయికి దిగజారింది మిలియన్‌మార్చ్ ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత కేసీఆర్‌ అవంలంభించిన వైఖరి వల్లనే ఈ పరిస్థితి నెలకొందనేది నిస్పష్టం.

మరి కేసీఆర్‌ ఎందుకు ఇలా చేశారు? ఢిల్లీ వెళ్లే ముందు ఒక వైఖరితో ఉన్న ఆయన ఢిల్లీ వెళ్లాక ఎందుకు వైఖరి మార్పుకున్నాడు? ఎవరితోనైనా ఏదైనా డీల్‌ కుదుర్చుకున్నారా? అందులో భాగంగానే మిలియన్‌ మార్చ్‌ను నీరు గార్చేలా ప్రవర్తించారా? ఈ ఫెయిల్యూర్‌ పరిణామాల వెనుక అసలు విలన్‌ కేసీరేనా? అనే ప్రశ్నలకు సమాధాలనాలు దొరకాల్సిఉంది.

No comments:

Post a Comment