Tuesday, March 8, 2011

ఏ కోకిల కుహూ... అని అరుస్తుంది

చిన్నారులూ.. మీకు కోకిల తెలుసు కదా.. వసంత కాలంలో ఉదయాన్నే కుహూ.. కుహూ.. అని అరుస్తుంది. మనం దానికి పోటీగా కుహూ.. అన్నామనుకోండి అది మళ్లీ కుహూ... అని ఇంకొంచెం పెద్దగా అరుస్తుంది. అయితే మగ కోకిలలు మాత్రమే కుహూ.. మని అరుస్తాయి. కోకిల చూడ్డానికి కాకిలా నిగనిగ లాడే నలుపుతో వుంటుంది.
కానీ తోక కాకి తోక కన్నా పొడవుగా ఉంటుంది. కాకి కన్నా సన్నగా వుంటుంది. దీని ముక్కేమో పసుపు రంగులో ఉంటుంది. కళ్లు రక్తమంత ఎర్రగా ఉంటాయి. ఇది ఎప్పుడు చెట్లమీదే ఉంటుంది. శీతాకాలంలో ఆ పక్షి అసలు ఉందా లేదా అన్న సందేహం కలుగుతుంది. అంటే చాలా సైలెంట్‌గా ఉంటుందన్నమాట. వసంత కాలం, వేసవి కాలంలో మాత్రం అరుస్తూనే ఉంటుంది. దీని ఆహారం మర్రిపళ్ళు, రావిపళ్ళు రకరకాల చెర్రీపళ్ళు... ఇంకా గొంగళి పురుగులు, మిగతా పక్షుల్లా కోకిల గూళ్లు కట్టుకోద్దు. అందుకే వాటి గుడ్లను కాకి గూట్లో భద్రపరుస్తుంది. అయితే గుడ్లన్నీ ఒకే గూటిలో పెట్టదు ఎందుకో మరి! వీటి గుడ్లు లేత బూడిద రంగు, ఆకుపచ్చ రంగుల్లో ఉంటాయి. కాకి గుడ్లను పోలి ఉంటాయి. కాకపోతే కొంచెం పెద్దగా ఉంటాయి. కామమ్మే ఈ గుడ్లను పొదిగి పిల్లల్ని చేస్తుంది.

No comments:

Post a Comment