Saturday, April 16, 2011

సల్మాన్ కంగనా వెంటపడుతున్నాడా..?! ఎందుకూ..?



ఆమధ్య కుర్రహీరో నితిన్ సరసన "అడవి"లో వాచిపోయిన రెండు పెదవులతో దర్శనమిచ్చిన కంగనా రనౌత్ మరోసారి బాలీవుడ్ వార్తల్లో వ్యక్తయింది. సీనియర్ లవర్‌మేన్ సల్మాన్, తాజాగా కంగనా కదలికలపై దృష్టి పెట్టాడట. ఆమెతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడట. కంగనా కూడా ఎంతో ఉత్సాహంగా సల్మాన్ ఖాన్ ఎక్కడకి వెళితే అక్కడకు వెళ్లేందుకు రెట్టించిన ఉత్సాహంతో వెళుతోందట. గంటలపాటు రాత్రిపూట మీటింగులతో కాలం గడుపుతోందట.

అదలా వుంచితే పెళ్లికాని సల్మాన్‌ను, పెళ్లెప్పుడు చేస్కుంటావ్ అని ప్రశ్నిస్తే... ఇక ఎంతమాత్రం ఆలస్యం చెయ్యను. త్వరలో కట్టేస్తా. సింగిల్‌గా జీవితాన్ని లీడ్ చేయడం బోర్ గా ఉంది. నా మనసుకు నచ్చిన అమ్మాయి కూడా తారసపడింది. అయితే ఆమె వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ రావాలంతే అంటున్నాడట.

ఇంతకీ ఈ ముదిరిపోయిన బెండకాయను పెళ్లాడేందుకు ఎవరు ముందుకొస్తున్నారబ్బా...?

No comments:

Post a Comment