Saturday, April 23, 2011

పుట్టినప్పుడు నగ్నంగానే కదా పుట్టాం.. అలా కనబడతానంటే అభ్యంతరమెందుకు?



హాటెస్ట్ మోడల్ పూనం పాండే ఓ పట్టాన వదిలేట్టు లేదు. "పుట్టినప్పుడు నగ్నంగానే కదా పుట్టాం.. మరి అలా కనబడతానంటే అభ్యంతరమెందుకు..?" అని ప్రశ్నిస్తోందట. బీసీసీఐకి మానవుడి పుట్టుక గురించి లెక్చర్లిస్తోందట. మనిషనేవాడు పుట్టినప్పుడు నగ్నంగానే కదా పుడతాడు... మరి తానలా కనబడతానంటే ఎందుకు కొంతమంది అభ్యంతరం చెపుతున్నారో అర్థం కావడం లేదని వాపోతోందట. తన నగ్న స్వరూపాన్ని ప్రదర్శించడానికి మీడియా మద్దతు కావాలని అంటోందట. మీడియా ఏకమైతే ఎంతటివారైనా దిగి వస్తారనీ, కనుక తన తరపున బీసీసీఐకి మీడియా చెప్పాలని అభ్యర్థిస్తోందట.

ఇచ్చినమాట నెరవేర్చే దాకా తనకు నిద్ర పట్టదని బాధపడుతోందట. తను ప్రకటించినట్లు నగ్నంగా కనిపిస్తేనే హాయిగా నిద్ర పడుతుందని పూనం చెప్పుకొస్తోందట. ఇదిలావుంటే పబ్లిసిటీ స్టంట్ కోసమే పూనం పాండే ఇటువంటి పిచ్చి ప్రకటనలు చేస్తోందని కొంతమంది నేరుగా ఆమెకే మెయిళ్లు రాస్తున్నారట.

మరికొందరైతే స్త్రీ జాతి పరువు తీస్తున్నావంటూ చంపేస్తామని బెదిరిస్తున్నారట. అయితే ఎవరెన్ని బెదిరింపులు చేసినా తనేమీ భయపడనని అంటోందట పూనం.

No comments:

Post a Comment