బెంగాల్ దాదా, సౌరవ్ గంగూలీ లేని కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌పై క్రీడాభిమానులు పెద్దగా ఆసక్తి చూపలేదు. గంగూలీ లేని కేకేఆర్ మ్యాచ్‌ను చూసేందుకు క్రికెట్ అభిమానులు ఆసక్తి చూపకపోవడంతో, స్టేడియం ఖాళీగా కనిపించింది. కేవలం 20వేల మంది ప్రేక్షకులు మాత్రమే కేకేఆర్-డెక్కన్ ఛార్జర్స్ మ్యాచ్‌కు హాజరయ్యారు. ఈ మ్యాచ్ టిక్కెట్లను ఉచితంగా అందజేసినా క్రికెట్ అభిమానుల కొరత ఏర్పడింది. కేకేఆర్-డెక్కన్ ఛార్జర్స్ మ్యాచ్‌ను వీక్షించేందుకు వీక్షకులు కరువవడంపై నిర్వాహకులు సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. గంగూలీని కేకేఆర్ జట్టులో ఎంపికచేసుకోకపోవడం పట్ల క్రికెట్ అభిమానులు మ్యాచ్‌ను వీక్షించేందుకు సుముఖత చూపలేదంటున్నారు.
No comments:
Post a Comment