బక్కపలుచని భామ త్రిష "తీన్‌మార్" చిత్రంలో పవన్ కల్యాణ్‌కు లిప్ టు లిప్ కిస్ ఇవ్వడాన్ని ప్రేక్షకులు బాగానే రిసీవ్ చేసుకున్నారట. ఇదే మాటను త్రిష కనబడినవారికంతా చెపుతోందట. మొదట్లో "లిప్ టు లిప్" ముద్దు ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని చాలామంది చెప్పారనీ, అయితే ఇపుడు వాళ్లే తనను పొగుడుతున్నారని బడాయిలు పోతోంది ఈ బ్యూటీ. అయితే త్రిష ఇంత ఘాటుగా రెచ్చిపోవడం వెనుక పలు కారణాలున్నాయంటున్నారు టాలీవుడ్ ఫిలిం జనం. అమ్మడికి బాలీవుడ్ పరిశ్రమలో చుక్కెదురవడంతోపాటు కోలీవుడ్‌లో తెల్లపిల్లలు తాప్సీ, తమన్నాలాంటి వారు తిష్ట వేయడంతో బోణీ కొట్టడం సాధ్యం కావడం లేదట.
దీంతో టాలీవుడ్‌లో నిలదొక్కుకునేందుకు ఇటువంటి వేడి వేడి ముద్దు సన్నివేశాలతో యువ హృదయాలకు లంగరు వేసి ఒడిసి పట్టుకోవాలని ప్రయత్నిస్తోందట. ఇందులో భాగంగానే తీన్‌మార్ చిత్రంలో "లిప్ లాక్" సన్నివేశమని అంటున్నారు.
లిప్ టు లిప్ ముద్దుపై త్రిషను కదిస్తే... మారుతున్న సమాజాన్ని అనుసరించి మనమూ మారాలని సెలవిస్తోందట. అంటే సమాజంలో లిప్ టు లిప్ ముద్దులు మామూలైపోయాయనేనా దీనర్థం.

No comments:
Post a Comment