తరుణ్, విమలా రామన్ జంటగా కన్మణి దర్శకత్వంలో సుప్రీమ్ మూవీస్, ప్రణవ్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "చుక్కలాంటి అమ్మాయి - చక్కనైన అబ్బాయి". గోగినేని శ్రీనివాస్, రాజు హర్వాణి నిర్మాతలు. ఈ రొమాంటిక్ ప్రేమకథా చిత్రం విడుదలకు సిద్ధమైంది.
నిర్మాతలు మాట్లాడుతూ... తరుణ్‌తో మేము నిర్మించిన ఈ చిత్రం యొక్క ఫస్ట్ కాపీ రెడీ అయింది. సెన్సార్ వారు క్లీన్ యు సర్టిఫికేట్ ఇచ్చారు. ఒక ప్రేమికుల జంట పెళ్లి తర్వాత తమ మధ్య ఎలాంటి మనస్పర్థలు రాకుండా ఉండటానికై ఓ నిర్ణయం తీసుకుంటారు. దానివల్ల వారు ఎదుర్కొంటున్న సంఘటనలు వినోదాత్మకంగా ఉంటాయి. తరుణ్, విమలారామన్‌ల జంట ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. అనూప్ అందించిన సంగీతం చిత్ర విజయంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఆడియోకు మంచి స్పందన లభించింది. దర్శకుడు కన్మణి కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మే 27న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామని చెప్పారు.
తరుణ్, విమలారామన్, బ్రహ్మానందం, కాశీ విశ్వనాథ్, ధర్మవరపు, ప్రగతి, రక్ష తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్, ఫోటోగ్రఫీ: వాసు, కూర్పు: గౌతంరాజు, సమర్పణ: విజయ్ చాబ్రియా

No comments:
Post a Comment