Wednesday, May 25, 2011

చూడండి అభిమానులూ.. ఎలా ఉన్నానో..?:

బాలీవుడ్ హాట్ హీరోయిన్లు ఏదో ఒక సంచలనాన్ని సృష్టించకుండా ఉండలేరు. అదేదో గొప్ప కార్యమైతే ఫర్వాలేదు కానీ, వీళ్లు మాత్రం తమ గ్లామర్ అందాలను చూపెట్టడమనే అంశాన్నే సంచలనం చేస్తుంటారు.తాజాగా బాలీవుడ్ సెక్సీబాంబ్ అరుణా షీల్డ్స్ తన అభిమానుల వీక్షణ కోసం అంటూ ఫేస్‌బుక్‌లో తన నగ్న ఫోటోను పెట్టేసింది. అలా ఆ నగ్న ఫోటోను జోడించడానికి కారణాన్ని కూడా జోడించిందనుకోండి.

ఈ భామకు గత శుక్రవారంనాడు శరీరంపై పొంగు( ఆటలమ్మ వంటి) వచ్చిందట. దీంతో గత పదిరోజులుగా అభిమానులకు అందుబాటులో లేకుండా ఉండాల్సిన పరిస్థితి చోటుచేసుకుంది. ఆమె అభిమానులు మాత్రం ఉండలేకపోయారట. ఫేస్ బుక్ లో అరుణా.. ఎలా ఉన్నావ్... ఎక్కడున్నావ్.. అంటూ ప్రశ్నలపై ప్రశ్నలు సంధించడం మొదలెట్టారట.

అభిమానులు పడుతున్న బాధను చూసి తట్టుకోలేని అరుణా షీల్డ్స్ తన శరీరంపై ఉన్న దుస్తుల్ని తీసేసి పొంగుతో ఎర్రగా కందిపోయి ఉన్న నగ్న శరీరాన్ని క్లిక్ మనిపించి ఆ ఫోటోను ఫేస్‌బుక్‌లో పెట్టేసిందట. అలా పెట్టింది కాక తన అందం ఎలా మారిందో చూడండంటూ ముక్తాయింపు కూడా ఇచ్చిందట. అభిమానులపై మరీ ఇంత "నగ్న"మైన ప్రేమ చూపించాలా..?

No comments:

Post a Comment