Sunday, May 22, 2011

"నగరం నిద్రపోతున్న వేళ"

జగపతిబాబు, ఛార్మి జంటగా నటించిన చిత్రం "నగరం నిద్రపోతున్న వేళ". గురుదేవ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై జూన్‌లో విడుదల చేయనున్నట్లు నిర్మాత నందిశ్రీహరి చెప్పారు.

దర్శకుడు ప్రేమ్‌రాజ్‌ మాట్లాడుతూ, సమకాలీన రాజకీయాలు, పరిస్థితులనుగుణంగా తీసిన ఈ చిత్రం ఎప్పుడు చూసినా నూతనంగా ఉంటుంది. ప్రజాస్వామ్యాన్ని ఎందుకు దిగజారుస్తున్నారు? రాజకీయాలంటే అసహ్యించుకునే ఎందుకు జరుగుతుంది? వంటి అంశాలు చర్చించామని తెలిపారు.సంభాషణల రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. పేరుకు చిన్నసినిమా అయినా పెద్దచిత్రంగా తీశారు. నిర్మాత, దర్శకుడు ఈ చిత్రాన్ని ప్రేమించి తీశారు. కమర్షియల్‌ చిత్రాలు తీసినా చక్కటి సందేశంకూడా ఉండాలనుకునేవారు. అలాంటి చిన్న చిత్రాలు 'చలిచీమలు' నుంచి మా కెరీర్‌ ప్రారంభమయింది.

దీన్‌రాజ్‌ గొప్ప రచయిత, ప్రేమించుకుందాంరా, కలిసుందాంరా.. చిత్రాలకు రచన చేశారు. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. ఆడియో విడుదలై సక్సెస్‌ సాధించింది. గోరటి వెంకన్న మూడు పాటలు, భాస్కరభట్ల, అనంత్‌శ్రీరామ్‌, సుద్దాల ఒక్కోపాటను రాశారు. జూన్‌ మొదటివారంలో చిత్రాన్ని విడుదలచేయనున్నారు. అని చెప్పారు.

భాస్కరభట్ల మాట్లాడుతూ, అశ్లీలంలేకుండా పాటల్లో సత్తువవున్న సాహిత్యం చొప్పించాం. పాటలు సక్సెస్‌ అయినట్లే సినిమాకూడా అవుతుందనే నమ్మకముందని తెలిపారు.

No comments:

Post a Comment