![]() |
తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో ఇప్పటివరకు ఆలోచించలేదనీ.. అడిగారు కాబట్టి ఒక్కటి మాత్రం చెప్పదలచుకున్నానని నటి స్నేహ మనసులోని మాట బయట పెట్టింది. మహా అందగాడు కానవసరంలేదు. డబ్బు, హోదా, ఇవేవీ లేకపోయినా పట్టించుకోను. కానీ అతడికి దట్టంగా జుత్తు ఉన్నదో లేదో చూస్తాను. ఎందుకంటే పీచు జుట్టేసుకుని ఏ బోడిగుండో, అరగుండుతోనో వుండే బాగోదు గదా.. అని సెలవిచ్చింది. ఇప్పటివరకు అమ్మానాన్నలు నన్ను చూసుకుంటున్నారు. రేపు వచ్చేవాడు కూడా అంతకంటే బాగా చూసుకోవాలి అంది. ప్రస్తుతం స్నేహ, నాగార్జునతో 'రాజన్న' చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి విజయేంద్రప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు.
No comments:
Post a Comment