Monday, May 30, 2011

"చెర్రీ" అత్తగా నటించనున్న చేపకళ్ల మీనా

హీరోయిన్లకు పెళ్లయితే చాలు.. అత్త లేదా అమ్మ పాత్రలే వరిస్తుంటాయి. తాజాగా చేపకళ్ల మీనాకు కూడా అలాంటి పరిస్థితే వచ్చింది. రాంచరణ్ తేజకు అత్తగా మీనా నటించనున్నట్లు సమాచారం. బద్రినాథ్ సినిమా దర్శకుడు వి.వి. వినాయక్ రూపొందించబోతున్న చిత్రంలో రాంచరణ్ హీరోగా నటించనున్నాడు. ఈ చిత్రంలో రాంచరణ్‌కు సమంత జోడీగా నటించనుంది. సమంతకు అమ్మగా... రాంచరణ్ కు అత్తగా మీనా నటించనున్నట్లు భోగట్టా.

మీనా పెళ్లి చేసుకున్న తర్వాత కొన్నాళ్లు కేవలం బుల్లితెర కార్యక్రమాలకే పరిమితమైంది. బుల్లితెరలో తృప్తి లేదనుకున్నదో ఏమోగానీ పెద్దతెరపై కన్నేసింది. అత్త పాత్రలతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తోంది. వెండితెర అత్తగా రాజ్యమేలుతుందేమో.. చూద్దాం.

No comments:

Post a Comment