Sunday, June 5, 2011

నయన లవర్ ప్రభుదేవాను పడగొట్టిన హన్సిక

నయనతారను పెళ్లాడి తీరుతానంటూ భీష్మించిన ప్రభుదేవా రహస్యంగా మరో భామతో ప్రేమాయణం సాగిస్తున్నట్లు కోలీవుడ్ సినీజనం తెగ చెప్పుకుంటున్నారు. నయనతారతో బోర్ ఫీలవడం వల్లనే ప్రభుదేవా పక్కచూపులు చూస్తున్నట్లు చెపుతున్నారు. ఇంతకీ "గురుడు" పడగొట్టిన మరో తార ఎవరయ్యా అని వాళ్లను అడిగితే బాలీవుడ్ సెక్సీతార హన్సిక అని సెలవిచ్చారు. హన్సిక ఈమధ్య ప్రభుదేవా ఎక్కడుంటే అక్కడికి పనిగట్టుకుని వెళుతోందట. హన్సిక చూపిస్తున్న ప్రేమకు ప్రభుదేవా దబ్బున పడిపోయాడట.

వీరి ప్రేమాయణం ఆనోటా ఈనోటా తిరిగి తిరిగి నేరుగా నయనతారకు చేరిందట. దీంతో నయన చిందులేసిందట. నేరుగా హన్సికకు ఫోన్ చేసి చడామడా తిట్టిపోసిందట. హన్సిక మాత్రం తక్కువ తిన్లేదట. నయనకు మించి ఒక రేంజ్‌లో రేగిపోయిందట. సినిమా ప్రేమలు ఇలానే ఉంటాయేమో మరి..?

No comments:

Post a Comment