రామ్ చరణ్ హీరోగా "ఖైదీ" రిమేక్..?
టాలీవుడ్‌లో చిరంజీవిని మెగాస్టార్ చేసిన చిత్రం "ఖైదీ". ఈ చిత్రానికి ముందు చిరంజీవి అనేక చిత్రాల్లో నటించినప్పటికీ.. వాటి వల్ల వచ్చిన పేరు అంతంతమాత్రమే. అయితే, "ఖైదీ" చిత్రం విడుదలైన తర్వాత చిరంజీవికి వచ్చిన స్టార్‌డమ్ అంతా ఇంతా కాదు. అంతటి ఘన విజయాన్ని సాధించిన ఈ చిత్రాన్ని.. ఇప్పటికీ ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇపుడు చిరంజీవి నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న రామ్ చరణ్ హీరోగా ఈ చిత్రం పునర్ నిర్మితం కానుంది. మాక్స్ ఇండియా ప్రొడక్షన్ బ్యానర్‌లో నిర్మాత కె.అచ్చిరెడ్డి "ఖైదీ" చిత్రం పేరుతో ఫిలిమ్ ఛాంబర్‌లో ఓ టైటిల్‌ను నమోదు చేయించినట్టు సమాచారం. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచారు. మొత్తం స్క్రిప్ట్ వర్క్‌తో పాటు అన్ని పక్కాగా ప్లానింగ్ చేసిన తర్వాతే చిత్ విశేషాలను వెల్లడించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
No comments:
Post a Comment