Tuesday, June 14, 2011

ఆ మైదానంలో స్టార్లు తప్ప ప్రేక్షకులేరీ..?

క్రికెట్ మ్యాచ్ అంటే యూత్‌ ఎగబడి చూస్తారు కనుక వారి బలహీనతల్ని క్యాష్‌ చేసుకునేందుకు టాలీవుడ్‌ ప్లాన్ చేసింది. అందుకు తెలుగు, తమిళ, కన్నడ, బాలీవుడ్‌ నాలుగు టీమ్‌లుగా ఏర్పడి ఆటలు ఆడారు. తెలుగు టీమ్‌ విషయానికి వచ్చేసరికి పాపులర్‌ నటులు లేరు. చిన్నప్పుడు ఏదో వేషం వేసిన అఖిల్‌, పెద్దగా వేషాలు లేక పబ్‌లు నడుపుకునే తరుణ్‌, ఏవో చిన్నచిన్న వేషాలువేసే కొద్దిమంది... పెండ్లిచేసుకుని ఖాళీగా ఉన్న మంచు విష్ణుతోపాటు వెంకటేష్‌, శ్రీకాంత్‌ వంటి వేళ్ళపై లెక్కించే వారు మినహా భారీ తారాగణం లేకపోవడంతో క్రికెట్‌మ్యాచ్‌ ఫెయిల్‌ అయింది.

ఏదో ఒక లక్ష్యం కోసం కాకుండా సరదాగా మ్యాచ్‌లు ఆడితే ఇలాగే ఉంటుందని ప్రేక్షకులూ నిరూపించారు. మరోపక్క ప్రతిదాన్ని వ్యాపారం చేసుకునే మంచు విష్ణు సిసిఎల్‌ తెలుగుటీమ్‌ను కొనుక్కోవడంతో అతనిదే పెత్తనం. మోహన్‌బాబు ఫ్యామిలీ చెబితే వినే స్థితిలో లేని వారంతా ఇందులో పాల్గొనకపోవడం విశేషం.

ఇటీవలే శ్రియ చెప్పినదాన్ని బట్టి ఒక్క అఖిల్‌ తప్ప మిగతా వారెవరూ ఆడలేకపోయారు. దీంతో ఫైనల్‌ మ్యాచ్‌ జరిగితే చూసేవారు కరువయ్యారు. ఇంత కష్టపడి ఖర్చుచేసి ఎందుకు ఆడిందీ తెలియదు. ప్రేక్షకులు కోసం కాకుండా తామంతా కలిసి ఉన్నామనే బిల్డప్‌ కోసం ఆడినట్లుంది.

No comments:

Post a Comment