Friday, June 17, 2011

నిత్యామీనన్‌తో కూడా లింకు ఉందని రాసినా రాస్తారు...

ఒకవైపు అనుష్క - నాగచైతన్యల రిలేషన్ గురించి టాలీవుడ్‌లో హీటెక్కిపోయే గుసగుసలు బయటకొస్తుంటే పానకంలో పుడకలా యువనటుడు సిద్ధార్థ్ అతడిని అడక్కపోయినా తన "లింకు"లు గురించి చెపుతున్నాడట. తనతో నటించిన అరడజను మందికి పైగా నటీమణులతో తనకు లింకులున్నట్లు చాలామంది ఊదరగొట్టారని పిలిచి మరీ చెపుతున్నాడట. ముఖ్యంగా శృతిహాసన్‌తో తను బాగా సన్నిహితంగా మెలిగినట్లు అనేక కథనాలు రావడాన్ని తను చూశానని కూడా చెపుతున్నాడట. అయితే ఆ సిల్లీ కామెంట్స్‌ను పట్టించుకోనని అంటున్నాడట.

కొత్తగా 180 చిత్రంలో తన సరసన నటిస్తున్న నిత్యామీనన్‌తో కూడా లింకులు పెట్టి రాసినా రాస్తారు.. అంటూ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడట. అంటే నిత్య మీనన్‌తో కూడా లింకు ఉన్నదని గుసగుసలాడమనా దీనర్థం...?

No comments:

Post a Comment