Thursday, July 14, 2011

బాధతో ఉన్నా.. ఆ అవార్డు స్వీకరించలేను: ఐష్

ముంబయిలో ముష్కరుల దాడులపై మాజీప్రపంచ సుందరి, బాలీవుడ్ అందగత్తె ఐశ్వర్యారాయ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. అంతేకాదు తనకు జూలై 13న ఫ్రెంచ్ ప్రభుత్వం ప్రదానం చేయనున్న "నైట్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ ఇట్ దిస్ లెటర్స్" అనే అవార్డును స్వీకరించలేనని తెలిపింది. ..............అవార్డు ప్రదానోత్సవానికి ఏర్పాట్లన్నీ పూర్తయిన తరుణంలో మంగళవారం రాత్రి ఐష్ తన అభ్యర్థనను ఫ్రెంచ్ ప్రభుత్వానికి తెలిపింది. దీంతో అవార్డు ప్రదానోత్సవాన్ని ఆపివేస్తున్నట్లు ఫ్రెంచ్ అధికారులు ప్రకటించారు.

అనంతరం ఐష్ మాట్లాడుతూ... తన ఆవేదనను, బాధను అర్థం చేసుకుని ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినందుకు ఫ్రెంచ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. తమ సెంటిమెంట్లను గౌరవించి తన అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్నందుకు ప్రత్యేకంగా ఫ్రెంచ్ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.

సుఖసంతోషాలతో నిండి ఉండే ముంబయి శోకంలో మునిగి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో తాము సంతోషంగా ఎటువంటి కార్యక్రమాన్ని జరుపుకోజాలమని ఐష్ వెల్లడించింది.

No comments:

Post a Comment