Saturday, August 13, 2011

"ఇది ప్రేమకథ కాదు" 'ఎ' సీన్లకు వర్మ సొంత కత్తెర

"ఇది ప్రేమకథ కాదు" చిత్రం విడుదలకు సరిగ్గా మరో వారం సమయం ఉంది. ఈ లోపు కథకు ప్రేరణ అయిన మరియా సుసైరాజ్, మాథ్యూలిద్దరూ వేర్వేరుగా రాంగోపాల్ వర్మకు నోటీసులు పంపారు. తమ జీవితాన్ని నేపధ్యంగా తీసుకుని తెరకెక్కించిన చిత్రంలో అన్నీ అవాస్తవ సంఘటనలను క్రోడికరించి సినిమా తీసి తమను మరింత వీధినపడేసేట్లుగా ఈ సినిమా ఉందని ఆరోపించారు. వివాదాస్పద సీన్లను వెంటనే తొలగించాలని తమ పిటిషన్‌లో పేర్కొన్నారు.

తొలుత ఈ చిత్రం అంతా కల్పితమైనదని చిత్ర నిర్మాత చెప్పినప్పటికీ ఎందుకొచ్చిన గొడవ అనుకున్నాడో ఏమో వర్మ ప్రస్తుతం ఆ సినిమా రీళ్లను ముందేసుకుని కూచుని నిశితంగా పరిశీలిస్తున్నాడట. అభ్యంతరం అనిపిస్తున్న సీన్లన్నిటినీ తనే స్వయంగా కత్తిరించి పారేస్తున్నాడట.

ఈ కత్తిరింపులో మహీగిల్ చేత నటింపజేసిన లిప్ టు లిప్ సన్నివేశాలు, బెడ్రూం సన్నివేశాలేమైనా కత్తిరింపుకు గురవుతాయేమోనని అనుకుంటున్నారు. అదే జరిగితే మహీగిల్ ప్రయత్నం అంతా వృధా పోయినట్లే అవుతుంది.

No comments:

Post a Comment