Monday, August 15, 2011

ప్రియమణిపై మండిపడుతున్న తమిళ తంబీలు!

వరుస ప్లాపులతో దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్న నటి ప్రియమణిపై తమిళ తంబీలు ఆగ్రహోద్రుక్తులయ్యారు. ఇకపై తమిళ చిత్రాల్లో నటించనని ప్రియమణి చెప్పడాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారు..................దీనిపై తమిళ నిర్మాతలు మాట్లాడుతూ మేం ఇక్కడ పరిచయం చేసి జాతీయ అవార్డు ఇప్పించటమే నేరమా అని ప్రశ్నిస్తున్నారు. మరికొంతమంది నిర్మాతలు, దర్శకులైతే ఏకంగా ఈ అమ్మడుకు ఫోన్ చేసి తిట్టని తిట్టు తిడుతున్నారట.

దీంతో తేరుకున్న ప్రియమణి అస్సలు నేను ఎప్పుడూ అలాంటి కామెంట్స్ చేయలేదని మొత్తుకుంటోంది. ఈ విషయమై ప్రియమణి మాట్లాడుతూ.. నేను ఎప్పుడూ తమిళ పరిశ్రమకు గుడ్ బై చెపుతున్నట్టు ప్రకటించలేదు. త్వరలోనే ఓ పెద్ద ప్రాజెక్టుతో మంచి పాత్రతో వస్తాను. నన్ను ఆదరించి ఈ స్థాయికి తెచ్చింది ఆ పరిశ్రమే.

తమిళ ప్రేక్షకులకు, చిత్రసీమకు ఎపుడూ రుణపడి ఉంటాను అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తెలుగు, కన్నడ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉండటం వల్ల తమిళంలో వస్తున్న ఆఫర్లకు సమయాన్ని కేటాయించలేక పోతున్నాను. అంతేగాని తమిళ పరిశ్రమని వదిలేసినట్లు కాదు. అక్కడ పోటీకి భయపడి కాదంటూ వివరణ ఇచ్చుకుంది.

No comments:

Post a Comment