యంగ్ టైగర్ ఎన్టీఆర్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో భారీ చిత్రాల అగ్రనిర్మాత బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఏప్రిల్ నుంచి ఓ భారీ చిత్రాన్ని ప్రారంభిస్తున్నారు.ఈ చిత్రం గురించి హీరో ఎన్టీఆర్ మాట్లాడుతూ - ''పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో మళ్ళీ సినిమా చెయ్యాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఇప్పటికి కుదిరింది. ఎనిమిదేళ్ళుగా ప్రేక్షకులు, అభిమానులు, నేను ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కాంబినేషన్ ఇది.
జగన్, నేను కలిసి చేస్తున్నామంటే ఎక్స్‌పెక్టేషన్స్ చాలా పెద్ద స్థాయిలో వుంటాయి. పూరి జగన్నాథ్ ఈ చిత్రం కోసం అద్భుతమైన లైన్ రెడీ చేశారు. మా కాంబినేషన్‌లో డెఫినెట్‌గా ఇది అదిరిపోతుంది. పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఏప్రిల్ నుండి బండ్ల గణేష్ నిర్మాతగా ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అవుతుంది. నా కెరీర్‌లో ఇది ఓ ప్రెస్టీజియస్ ఫిలిం అవుతుంది'' అన్నారు.
దర్శకులు పూరి జగన్నాథ్ మాట్లాడుతూ - ''ఎన్టీఆర్‌తో సినిమా చెయ్యాలని చాలా కాలంగా అనుకుంటున్నాను. ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చే ఈ సినిమా లైన్ ఎక్స్‌ట్రార్డినరీగా వుంటుంది. ఎన్టీఆర్‌తో ఓ మంచి లవ్‌స్టోరీ చేస్తున్నాను. ఓ విధంగా ఎన్టీఆర్‌ని కొత్త యాంగిల్‌లో చూస్తారు. ఎన్టీఆర్ స్టైల్‌లో, నా స్టైల్‌లో వుంటూనే డిఫరెంట్‌గా ఈ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రాన్ని నా చిరకాల మిత్రుడు బండ్ల గణేష్ బేనర్‌లో చేస్తున్నాను. ఏప్రిల్‌లో స్టార్ట్ చేస్తాం'' అన్నారు.
ఈ చిత్రానికి సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాథ్.

No comments:
Post a Comment