![]() |
జాతీయస్థాయి అవార్డు పొందిన తాను ప్రత్యేకించి అటువంటి సినిమాలు మాత్రమే చేయాలనే రూల్ ఏమీ పెట్టుకోలేదని అంటోంది. కొన్నిసార్లు అందాల్ని ఆరబోసి నటించాల్సిందేనని బల్లగుద్ది చెబుతోంది. జగపతిబాబు సరసన పెళ్లయి కొత్తలో బెడ్‌రూమ్ సన్నివేశాల్లో అలరించింది.
అదే జగపతిబాబు సినిమా 'క్షేత్రం'లో చారిత్రాత్మక నేపథ్యంలో ఒక పాత్ర పోషిస్తోంది. ఇది గొప్ప పేరు తెస్తుందనే నమ్మకముందని చెపుతోంది. అయితే ప్రేక్షకులు మాత్రం నాయికలను మాత్రం అందాలు చూడటానికి వస్తారని నిర్మొహమాటం లేకుండా చెబుతోంది. అటువంటి పాత్రలు వచ్చినా కొత్తదనం ఉంటేనే చేస్తానని అంది.. మరి ఆ కొత్తదనం ఏమిటో...?!!

No comments:
Post a Comment