Friday, September 16, 2011

హీరోయిన్ల పనిబడితే అన్నీ దారికొస్తాయని అలా చేస్తున్నారట!

అసలే తెలుగులో సినిమాలు సక్సెస్‌ రేటు తగ్గిపోవడం, బాలీవుడ్‌ భామలు రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో ఇండస్ట్రీ పెద్దలు తాజాగా హీరోయిన్లకు చెక్‌ పెట్టేందుకు......... ఓ నిర్ణయం తీసుకున్నారు. ఎప్పటి నుంచో హీరోయిన్లు మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌లో మెంబర్లుగా కావాలని చెప్పినా వినిపించుకోవడంలేదు. వారికి హీరోల వత్తాసు ఉండటంతో ఇన్నాళ్ళపాటు వారు ఏమీ అనలేకపోయారు.

ఇప్పటికి విసుగు చెంది తాజాగా కొత్త నిర్ణయం తీసుకున్నారు. గురువారం జరిగిన ఛాంబర్‌, మా కార్యదర్శివర్గ సమావేశంలో 'మా' సభ్యత్వం తీసుకోని నటీమణులకు నోటీసులు జారీ చేశారు. ఒకవేళ సభ్యత్వం తీసుకోకపోతే అవకాశాలు ఇవ్వమని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పారు.

సభ్యత్వం లక్ష రూపాయలుగా నిర్ణయించారు. ఇటీవలే హీరోయిన్లు తెలుగు సినిమాల్లో నటించి ఇక్కడ సంపాదించిన తర్వాత ఇతర బాషల్లో అవకాశాలు పొందాక.. తెలుగుసీమ వైపు కన్నెత్తి కూడా చూడడంలేదు.

దీపం ఉండగానే చక్కబెట్టే చందంగా తయారైంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం హీరోలపై ఆంక్షలకు బదులు హీరోయిన్లపై వేస్తే బాగుంటుందనుకున్నట్లు తెలిసింది. మరోవైపు కొంతమంది హీరోయిన్లు చిత్రం షూటింగ్ ముగిసిన తర్వాత పబ్లిసిటీ వైపు కన్నెత్తి కూడా చూడటంలేదు. దాంతో పలువురు నిర్మాతలు ఛాంబర్‌కు ఫిర్యాదు చేసిన దాఖలాలు ఉన్నాయి.

"శక్తి" సినిమా ప్రమోషన్‌కు సహకరించడం లేదని ఇలియానాపై కేసు కూడా ఉంది. ఇంకో రకంగా చూడాలంటే.. హీరోయిన్లకు ఏమైనా జరిగితే మెంబర్‌ కాలేదని సాకుతో తప్పించుకున్న సందర్భాలూ ఉన్నాయి. కనుక అందరూ తప్పనిసరిగా మెంబర్‌ అవ్వాల్సిందేనని అంటున్నారు. ఇది ఎన్నాళ్ళు కఠినంగా ఉంటుందే చూడాలి మరి.

No comments:

Post a Comment