Tuesday, September 27, 2011

నా హృదయం వెన్నపూస లాంటిది.. కదిలిస్తే కరిగిపోతుంది

నయనతార, ప్రభుదేవాల మధ్య రోజురోజుకీ దూరం పెరిగిపోతోందనీ, ప్రభుదేవా మరో నటితో చెట్టాపట్టాలేసుకుని తిరగుతున్నాడనీ కోలీవుడ్ సినీజనం చెవులు................... కొరుక్కుంటున్నారు. ఇదిలావుంటే నయనతార మాత్రం వైరాగ్యంలో కొట్టుమిట్టాడుతోంది. భగవంతుని లీలలు గురించి చెపుతోంది.

అసలు సంగతేంటయా.. అంటే, మొన్నీమధ్య ఒకర్తే చెన్నైలో ఓ కారులో వెళుతోందట. ఇంతలో ఓ బాలిక మాసిన గుడ్డలతో తన కారు డోర్ వద్దకు దానం చేయమని చేయి చాచిందట. ఆ బాలికను చూసి తన హృదయం ద్రవీభించిందట. వెంటనే ఆ బాలికకు ఓ పచ్చనోటు వేసేసి ఆ తర్వాత... ఏమిటీ భగవంతుని లీలలూ.. నాకేమో బీఎండబ్ల్యూ ఇచ్చాడు. ఈ బాలికకు భిక్షాటనం చేయిస్తున్నాడెందుకూ..? అని బాధపడిందట.

అదిసరే.. ప్రభుదేవాతో నీ పెళ్లెప్పుడు అని అడిగితే... ఇల్లు కాలి ఒకరు ఏడుస్తుంటే.. మరేదో కాలి ఇంకొకరు ఏడ్చారట.. అన్నట్లు మీరడిగేది. మా పెళ్లి త్వరలో జరుగుతుందంటూ కారును రయ్యమని పోనిచ్చిందట.

No comments:

Post a Comment