Saturday, September 24, 2011

జీవా హీరోగా వస్తున్న మరో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'డేర్‌'

జీవా హీరోగా, అంజలి(షాపింగ్‌ మాల్‌ ఫేమ్‌) జంటగా నటించగా రామ్‌ దర్శకత్వం తమిళంలో రూపొందిన సూపర్‌ హిట్‌ చిత్రం 'కట్రదు తమిళ్‌'. ఈ చిత్రాన్ని 'డేర్‌' (బ్రేవ్‌ మ్యాన్‌ డైస్‌ ఓన్లీ ఒన్స్‌) పేరుతో గణేష్‌ సమర్పణలో ఎం.ఎస్‌.వి........ ప్రొడక్షన్స్‌ పతాకంపై తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు నిర్మాత జి.మురళి. ఈ సందర్భంగా నిర్మాత జి.మురళి మాట్లాడుతూ- ''రంగం, వచ్చాడు - గెలిచాడు చిత్రాల తర్వాత జీవా హీరోగా వస్తున్న మరో లవ్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. 'కట్రదు తమిళ్‌' చిత్రంలో జీవా పెర్‌ఫార్మెన్స్‌ తమిళ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ఈ చిత్రం జీవాకి స్టార్‌ హీరో ఇమేజ్‌ తెచ్చిపెట్టింది.

ఈ చిత్రం విజయ్‌ అవార్డు కూడా గెలుచుకుంది. 'షాపింగ్‌ మాల్‌'తో హీరోయిన్‌గా పరిచయమైన అంజలి నటించిన రెండో చిత్రం ఇది. మేధావి గొంతు నొక్కాలని చూసే వారెవ్వరినీ ప్రాణాలతో వదిలిపెట్టని ఓ విభిన్నమైన పాత్రలో జీవా జీవించారనే చెప్పాలి. జీవా పెర్‌ఫార్మెన్స్‌, అంజలి గ్లామర్‌ ఈ చిత్రానికి హైలైట్స్‌గా చెప్పుకోవచ్చు. విభిన్న కథాంశంతో రూపొందిన చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. ఈ కథకు 'డేర్‌' అనే టైటిల్‌ పర్‌ఫెక్ట్‌గా సూట్‌ అవుతుంది.

'రంగం' తర్వాత జీవాకి తెలుగులో హీరోగా మంచి ఫాలోయింగ్‌ వచ్చింది. 'డేర్‌' చిత్రాన్ని కూడా హిట్‌ చేస్తారన్న నమ్మకం నాకు వుంది. యువన్‌ శంకర్‌రాజా మ్యూజిక్‌ ఈ చిత్రాన్ని పెద్ద ఎస్సెట్‌ అని చెప్పాలి. తమిళ్‌లో ఈ ఆడియో చాలా పెద్ద హిట్‌ అయింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫస్ట్‌ కాపీ రెడీ అయిన ఈ చిత్రం ఆడియోను అక్టోబర్‌ మొదటి వారంలో, సినిమాని రెండో వారంలో రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం'' అన్నారు.

మాటల రచయిత శశాంక్‌ వెన్నెలకంటి మాట్లాడుతూ - ''మంచి కాన్సెప్ట్‌తో రూపొందిన సినిమా ఇది. మంచి కథకు మంచి మాటలు కూడా తోడయ్యాయి. ప్రేక్షకులకు చక్కని అనుభూతి కలిగించే సన్నివేశాలు ఈ చిత్రంలో వున్నాయి. తప్పకుండా ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది'' అన్నారు. జీవా, అంజలి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: గణేష్‌, నిర్మాత: జి.మురళి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: రామ్‌.

No comments:

Post a Comment