Thursday, November 3, 2011

నా పర్సనల్ విషయాలు మీకెందుకు..?

Amala paul
నా వ్యక్తిగత విషయాలు మీకెందుకూ అంటూ మీడియాను నిలదీస్తోందట అమలాపాల్............ దర్శకుడు విజయ్‌తో తానేదో ప్రేమకలాపాలు సాగిస్తున్నట్లు గాలి వార్తలు రాయడంపై అమలా మండిపడింది.  సినిమాల గురించి చేతులు నొప్పెట్టేట్టు రాసినా తాను పట్టించుకోననీ, అయితే వ్యక్తిగత విషయాల జోలికి వస్తే మాత్రం సహించేది లేదని కుండబద్ధలు కొట్టినట్లు చెపుతోందట. ఇకనైనా ఇటువంటి గాలి కబుర్లను సృష్టించడం మానుకోవాలని హితబోధ చేస్తోందట.

ఇదిలావుంటే రాత్రికిరాత్రే టాప్ హీరోయిన్ల లిస్టులో చోటు సంపాదించుకున్న అమలాపాల్ ప్రస్తుతం నాగచైతన్య సరసన బెజవాడ సినిమాలో నటించింది. ఇంకా ఈ ముద్దుగుమ్మ తమిళంలో వేట్టై, ముప్పొళుదుమ్ ఉన్ కర్పణైగళ్, మలయాళంలో ఓ సినిమా చేస్తోంది.

No comments:

Post a Comment