Friday, November 18, 2011

వైవిఎస్‌ 'యుగపురుషుడు' జూనియర్ ఎన్టీఆరా...?! బాలయ్య కుమారుడా..?

స్వర్గీయ ఎన్‌.టి.ఆర్‌.కు వీరాభిమానిగా చలనచిత్రరంగంలోకి వచ్చి దర్శకుడిగా ఎదిగిన వైవిఎస్‌ చౌదరి గురించి వేరే చెప్పాల్సినపనిలేదు.....................నందమూరి వంశీయులతో సినిమాలు చేయడం అంటే ఆయనకు చెప్పలేనంత ఇష్టం. లేటెస్ట్‌గా రవితేజతో 'నిప్పు', చిరంజీవి మేనల్లుడుతో 'రేయ్‌' వంటి సినిమాలను నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా, తాజాగా ఫిలింఛాంబర్‌లో ఆయన 'యుగపురుషుడు' అనే టైటిల్‌ను రిజిష్టర్‌ చేశారు. లోగడ పెద్ద ఎన్‌.టి.ఆర్‌. యుగపురుషుడుగా నటించిన విషయం తెలిసిందే. మరి ఈ కొత్త యుగపురుషుడు ఎవరి కోసం? అనేది చర్చనీయాంశమైంది.

నందమూరి వంశీయులే ఆ టైటిల్‌తో సినిమా చేయాలనీ, మరెవరితరం కాదని సినీవర్గాలు భావిస్తున్నాయి. అయితే, బాలకృష్ణ కుమారుడు ఇప్పుడే టీనేజ్‌లోకి ప్రవేశించాడు. అతడిని పరిచయం చేస్తారా? లేదంటే జూనియర్ ఎన్టీఆర్‌తో లాగిస్తారా? అన్నది చర్చనీయాంశమైంది.

No comments:

Post a Comment